Stock market: స్టాక్ మార్కెట్ బేసిక్స్..అపోహలు, నిజాలు!

Stock market: స్టాక్ మార్కెట్ అనేది ఒక కంపెనీలో ఒక చిన్న భాగాన్ని కొనుగోలు చేసే ప్రక్రియ. ఆ భాగాన్నే షేర్ లేదా ఈక్విటీ అని పిలుస్తారు.

Stock market

స్టాక్ మార్కెట్ అనగానే చాలామందికి అది ఒక జూదంలా, లేదా ధనవంతులకు మాత్రమే సంబంధించిన ప్రపంచంలా అనిపిస్తుంది. కానీ, సరైన అవగాహనతో పెట్టుబడి పెడితే, ఇది మన సంపదను పెంచుకునే ఒక అత్యంత శక్తివంతమైన క్రమబద్ధమైన మార్గం అంటారు నిపుణులు. స్టాక్ మార్కెట్(Stock market) అనేది ఒక కంపెనీలో ఒక చిన్న భాగాన్ని కొనుగోలు చేసే ప్రక్రియ. ఆ భాగాన్నే షేర్ లేదా ఈక్విటీ అని పిలుస్తారు.

మీరు ఒక షేర్ కొన్నప్పుడు, మీరు ఆ కంపెనీలో ఒక చిన్నపాటి యజమానిగా మారతారు. కంపెనీ లాభాలు పొందితే, ఆ లాభంలో కొంత భాగాన్ని డివిడెండ్ రూపంలో మీకు అందిస్తుంది, లేదా కంపెనీ వృద్ధి చెందుతున్న కొద్దీ మీ షేర్ విలువ పెరుగుతుంది. ఈ షేర్ల కొనుగోలు, అమ్మకాలు జరిగే ప్రధాన వేదికలను స్టాక్ ఎక్స్ఛేంజ్ ఉదాహరణకు, భారతదేశంలో NSE, BSE అంటారు. ఇవి ఒక మార్కెట్ లాగా పనిచేస్తాయి.

Stock market

స్టాక్ మార్కెట్‌(Stock market)లో విజయవంతం కావాలంటే రీసెర్చ్ చాలా కీలకం. కేవలం ఇతరుల సలహాలతో కాకుండా, మీరు ఏ కంపెనీలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో దాని ఆర్థిక నివేదికలు, లాభాలు, భవిష్యత్తు ప్రణాళికలు దాని వ్యాపార నమూనా వంటివి చాలా స్టడీ చేయాలి.

మార్కెట్‌లో సాధారణంగా రెండు రకాల వాతావరణాలు ఉంటాయి. బుల్ మార్కెట్ (Bull Market) అంటే మార్కెట్ విలువలు పెరుగుతున్నప్పుడు, పెట్టుబడిదారులు మార్కెట్ పై నమ్మకంతో కొనుగోళ్లకు మొగ్గు చూపినప్పుడు. దీనికి విరుద్ధంగా, బేర్ మార్కెట్ (Bear Market) అంటే మార్కెట్ విలువలు తగ్గుతున్నప్పుడు, భయంతో చాలామంది షేర్లను అమ్ముతారు. ఈ రెండు పరిస్థితులను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

పెట్టుబడి వ్యూహం విషయానికి వస్తే, స్వల్పకాలిక ట్రేడింగ్‌తో పోలిస్తే, మంచి, బలమైన కంపెనీల షేర్లను దీర్ఘకాలికంగా ఉంచుకోవడం వల్ల మంచి లాభాలు పొందొచ్చు. స్టాక్ మార్కెట్ (Stock market)ఒక క్రమబద్ధమైన పెట్టుబడి మార్గం, కానీ దీనికి ఓపిక, నాలెడ్జి చాలా అవసరం. నిపుణుల సలహాలు తీసుకోవడం, మార్కెట్ గురించి నిరంతరం నేర్చుకోవడం వల్ల ఇందులో విజయవంతం కావచ్చు.

Time management :24 గంటలు సరిపోవట్లేదా? టైమ్ మేనేజ్‌మెంట్ టిప్స్..

Exit mobile version