Electric cars: ఎలక్ట్రిక్ కార్లు..నిన్నటివి కాదు, ఒక శతాబ్దం నాటివంటే నమ్ముతారా?

Electric cars: 1890ల నాటికి, అమెరికా , బ్రిటన్‌లలో ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్‌లోకి ప్రవేశించాయి. ఆ సమయంలో ఇవి చాలా వినూత్నంగా భావించబడ్డాయి.

Electric cars

ఎలక్ట్రిక్ కార్లు (electric cars)నేటి ఆధునిక ఆవిష్కరణలుగా చాలా మంది భావిస్తారు, కానీ వాటి చరిత్ర వందల సంవత్సరాల క్రితం మొదలైంది. నిజానికి, 1912 నాటికి పెట్రోల్ కార్ల కంటే ఎలక్ట్రిక్ కార్లే నగరాల్లో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉండేవి. ఆసక్తికరంగా, ఎలక్ట్రిక్ వాహనాలు కేవలం ఒక కొత్త ట్రెండ్ కాదు, అది ఒక పాత సాంకేతికత పునరుజ్జీవం.

19వ శతాబ్దం చివరి నాటికి, మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనాలు తయారయ్యాయి. 1889లో ఫ్రాన్స్‌కు చెందిన గ్యాస్టన్ ప్లాంటే రూపొందించిన బ్యాటరీతో నడిచే వాహనాలు వీటికి మార్గదర్శకమయ్యాయి. 1890ల నాటికి, అమెరికా , బ్రిటన్‌లలో ఎలక్ట్రిక్ కార్లు(electric cars) మార్కెట్‌లోకి ప్రవేశించాయి. ఆ సమయంలో ఇవి చాలా వినూత్నంగా భావించబడ్డాయి. వీటిని ముఖ్యంగా నగరాల్లో ప్రయాణాలకు ఉపయోగించేవారు. ఎందుకంటే అవి శబ్దం తక్కువగా, నడపడానికి ఈజీగా ఉండేవి. పెట్రోల్ కార్లలాగా ఇంజిన్‌ను స్టార్ట్ చేయడానికి కష్టం ఉండేది కాదు. ముఖ్యంగా, మహిళలు ఈ వాహనాలను చాలా ఇష్టపడేవారు. ఎందుకంటే పెట్రోల్ కార్లలో ఉండే దుర్వాసన, శబ్దం, గట్టి వైబ్రేషన్స్ ఇందులో ఉండేవి కాదు.

Electric cars

1912లో, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆటోమొబైల్ తయారీదారు హెన్రీ ఫోర్డ్ తన “మోడల్ టి” పెట్రోల్ కారును తయారు చేయకముందు, డెట్రాయిట్ ఎలక్ట్రిక్ (Detroit Electric) వంటి సంస్థలు ఎలక్ట్రిక్ కార్లను భారీ సంఖ్యలో ఉత్పత్తి చేసేవి. డెట్రాయిట్ ఎలక్ట్రిక్ కంపెనీ కార్ల ధర సుమారు $3,000 ఉండగా, ఫోర్డ్ మోడల్ టి కారు ధర $650 మాత్రమే ఉండేది. ధరలో ఈ భారీ వ్యత్యాసం, పెట్రోల్ కార్లకు అనుకూలమైన రోడ్ నెట్‌వర్క్‌ల అభివృద్ధి, భారీగా దొరికే చౌక పెట్రోల్ వంటి కారణాల వల్ల ఎలక్ట్రిక్ కార్లు (electric cars)వెనుకపడ్డాయి. అంతేకాకుండా, అప్పట్లో బ్యాటరీ సాంకేతికత అంతగా అభివృద్ధి చెందకపోవడం వల్ల ఎలక్ట్రిక్ వాహనాలకు బ్యాటరీ ఛార్జింగ్ సమస్యలు, తక్కువ దూరం ప్రయాణించే సామర్థ్యం ఉండేవి.

Electric cars

మరో శతాబ్దం తర్వాత, పర్యావరణ సమస్యలు, పెట్రోల్ ధరల పెరుగుదల, సాంకేతిక పురోగతి కారణంగా ఎలక్ట్రిక్ వాహనాలపై మళ్లీ ఆసక్తి పెరిగింది. టెస్లా (Tesla) వంటి కంపెనీలు ఆధునిక లిథియం-అయాన్ బ్యాటరీ టెక్నాలజీతో సుదీర్ఘ దూరం ప్రయాణించే కార్లను రూపొందించి, వాటిని మళ్లీ మార్కెట్‌లోకి తీసుకొచ్చాయి. ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లు శక్తివంతమైన, వేగవంతమైన, పర్యావరణానికి హాని కలిగించని వాహనాలుగా మారాయి. అలా నిన్నటి టెక్నాలజీ నేటి అవసరానికి అనుగుణంగా కొత్త రూపం దాల్చి ఇప్పుడు మళ్లీ మన ముందుకు వచ్చింది.

Israel-Hamas: ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణ.. గాజాలో తీవ్ర మానవ సంక్షోభం

Exit mobile version