Gold and Silver
కొంతకాలంగా దూసుకెళ్తున్న బంగారం, వెండి ధర(Gold and Silver)ల్లో ఈరోజు ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. గోల్డ్ రేటు (Gold Rate) స్వల్పంగా తగ్గగా, వెండి రేటు (Silver Rate) మాత్రం భారీగా తగ్గింది. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.270 తగ్గగా, 10 గ్రాముల 22 క్యారట్ల బంగారంపై రూ.250 తగ్గింది.
అయితే, అంతర్జాతీయ మార్కెట్లో (International Market) మాత్రం ఔన్స్ (Ounce) బంగారంపై 19 డాలర్లు పెరిగి, ప్రస్తుతం 4,300 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ఇవాళ బంగారం ధర (Gold and Silver)తగ్గింది. 10 గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర: రూ.1,22,750 కాగా, 24 క్యారట్ల ధర: రూ.1,33,910కి చేరింది.
దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) 22 క్యారట్ల ధర రూ.1,22,900 కాగా, 24 క్యారట్ల ధర రూ.1,34,070. ముంబై, బెంగళూరు, చెన్నైలలో 22 క్యారట్ల ధర రూ.1,23,700 కాగా, 24 క్యారట్ల ధర రూ.1,34,950.
గత వారం రోజుల్లో రూ.20 వేలు పెరిగిన వెండిరేటు, తాజాగా భారీగా తగ్గింది. శనివారం కిలో వెండిపై ఏకంగా రూ.5 వేలు తగ్గింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర తగ్గింపు తర్వాత రూ.2,10,000 వద్దకు చేరింది.
ఢిల్లీ, ముంబయి, బెంగళూరులలో కిలో వెండి రేటు రూ.2,02,000 వద్దకు చేరింది. చెన్నైలో కిలో వెండి ధర రూ.2,10,000 వద్ద ఉంది. మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఈ ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చన్న విషయాన్ని కొనుగోలు దారులు గమనించాలి.
