Horse:పాము కాటుకు, గుర్రానికి సంబంధం ఏంటి? గుర్రం మనుషుల్ని కాపాడటమేంటి ?

Horse: ఎలాంటి భయంకరమైన పాము కాటు వేసినా కూడా చనిపోని ఏకైక జంతువు ఒకటుందని.. అది గుర్రం అని చాలామందికి తెలీదు 

Horse

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జీవుల్లో పాము ఒకటి అన్న విషయం తెలిసిందే. ఒక ఏనుగును కూడా నిముషాల్లో చంపేస్తాయి. కానీ, ప్రకృతి సృష్టించిన ఒక వింత గురించి మాత్రం చాలామందికి తెలియదు. ఎలాంటి భయంకరమైన పాము కాటు వేసినా కూడా చనిపోని ఏకైక జంతువు ఒకటుందని అది గుర్రం(Horse )అని చాలామందికి తెలీదు .

అవును, కింగ్ కోబ్రా వంటి విష సర్పాలు కాటు వేసినా కూడా గుర్రం(Horse )చనిపోదు. అయితే ఈ అద్భుతమే ఇప్పుడు వేల మంది మనుషుల ప్రాణాలను కాపాడటంలో సహాయం చేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లోని విన్స్ బయోటెక్ (Wins Biotech Pvt Ltd) వంటి సంస్థలు ఈ గుర్రాల(Horse )సాయంతోనే ప్రాణరక్షక ‘యాంటీ వీనమ్’ ఇంజెక్షన్లను తయారు చేస్తూ ప్రపంచ దేశాలను ఆకట్టుకుంటున్నాయి.

పాము కాటు వేసినప్పుడు గుర్రం చనిపోదు..కాకపోతే కాటు వేసిన తర్వాత ఒకటి రెండు రోజులు కొంచెం నీరసంగా ఉంటుంది. కానీ, మూడో రోజు కల్లా ఏమీ జరగనట్లే మళ్లీ మామూలు అయిపోతుంది. ఎందుకంటే గుర్రం శరీరంలో ఉండే రోగనిరోధక శక్తి ఆ విషాన్ని ఎదుర్కోవడానికి కావాల్సిన ‘యాంటీ బాడీస్’ (Antibodies) ను అద్భుతంగా ఉత్పత్తి చేస్తుందట. గుర్రం శరీరంలోని ఈ రహస్యమే ఇప్పుడు మానవాళికి రక్షణ కవచంగా మారింది.

యాంటీ వీనమ్ తయారీ ప్రక్రియ (Step-by-Step) ఎలా అంటే..

విష సేకరణ-ముందుగా వివిధ రకాల పాముల నుంచి విషాన్ని సేకరిస్తారు.
గుర్రానికి ఇంజెక్షన్- చాలా తక్కువ పరిమాణంలో ఉన్న పాముల విషాన్ని ఆరోగ్యవంతమైన గుర్రాలకు ఇంజెక్ట్ చేస్తారు.
ప్రతిరక్షకాల ఉత్పత్తి- గుర్రం రోగనిరోధక వ్యవస్థ ఆ విషాన్ని నిర్వీర్యం చేయడానికి సొంతంగా యాంటీ బాడీలను తయారు చేస్తుంది.
రక్త సేకరణ- ఆ తర్వాత సుమారు 2 నుంచి 3 రోజుల తర్వాత గుర్రం రక్తాన్ని సేకరిస్తారు.
ప్లాస్మా వేరు చేయడం- సేకరించిన రక్తం నుంచి ఎర్ర రక్త కణాలను వేరు చేసి, కేవలం ‘ప్లాస్మా’ అంటే తెల్లని ద్రవంను మాత్రమే తీసుకుంటారు.
శుద్ధి చేయడం- ఈ ప్లాస్మాను అత్యాధునిక ల్యాబ్‌లలో మాత్రమే ప్రాసెస్ చేసి, మనుషులకు పాము కాటేసినపుడు వాడే ..యాంటీ వీనమ్ వ్యాక్సిన్‌ను సిద్ధం చేస్తారు.

Horse

హైదరాబాద్‌కు చెందిన విన్స్ బయోటెక్ వంటి కంపెనీలు భారీ ఎత్తున గుర్రాల పెంపకం ,సంతానోత్పత్తి కేంద్రాలను నిర్వహిస్తున్నాయి. ఇక్కడ కఠినమైన క్వాలిటీ కంట్రోల్ కండిషన్లతో ఈ ఇంజెక్షన్లను తయారు చేస్తారు.భారత దేశంలో ప్రతి ఏటా వేల మంది పాము కాటుకు గురవుతుంటారు. వారందరికీ ఈ గుర్రాల వల్ల తయారైన మందే పునర్జన్మను ఇస్తోంది.

మనిషి ప్రాణాలను కాపాడటంలో గుర్రం పాత్ర వెలకట్టలేనిది. ప్రకృతిలో దాగి ఉన్న ఇటువంటి రహస్యాలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేయడమే కాదు, ప్రకృతి పట్ల గౌరవాన్ని కూడా పెంచుతాయి. గుర్రాలు కనుక లేకపోతే పాము కాటుకు మనిషిని కాపాడుకోవడం దాదాపు అసాధ్యం అని వైద్య నిపుణులు అంటున్నారు.

T20 World Cup : ఆస్ట్రేలియాకు బిగ్ షాక్..వరల్డ్ కప్ నుంచి కమ్మిన్స్ ఔట్

Exit mobile version