T20 World Cup : ఆస్ట్రేలియాకు బిగ్ షాక్..వరల్డ్ కప్ నుంచి కమ్మిన్స్ ఔట్

T20 World Cup : స్టార్ ఆల్‌రౌండర్ పాట్ కమిన్స్ వెన్నెముక గాయంతో టోర్నమెంట్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో బెన్ ద్వార్షుయిస్ జట్టులో చేరాడు

T20 World Cup

టీ ట్వంటీ ప్రపంచకప్ కు ఇంకా వారం రోజులే టైముంది. ఇప్పటికే అన్ని జట్లు సిరీస్ లు ఆడుతూ ప్రిపరేషన్ లో బిజీబిజీగా గడుపుతున్నాయి. అదే సమయంలో హాట్ ఫేవరెట్ గా ఉన్న కొన్ని జట్లను గాయాలు వెంటాడుతున్నాయి. తాజాగా ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ ప్యాట్ కమ్మిన్స్ టీ20 ప్రపంచకప్(T20 World Cup) కు దూరమయ్యాడు.

కమిన్స్ గత కొంతకాలంగా తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. ఈ కారణంగానే ప్రస్తుతం పాకిస్థాన్‌‌తో జరుగుతున్న టీ20 ప్రపంచకప్(T20 World Cup) సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. ఈ రెస్ట్ తో మెగాటోర్నీ సమయానికి అతను కోలుకుంటాడని ఆసీస్ సెలక్టర్లు ఆశించారు. అయితే ఆసీస్ జట్టు మెడికల్ రిపోర్ట్ ప్రకారం కమ్మిన్స్ ఫిట్ నెస్ సాధించలేదని సమాచారం. దీంతో అతని కెరీర్ ను రిస్క్ లో పెట్టడం ఇష్టం లేక ఆసీస్ బోర్డు కమ్మిన్స్ ను వరల్డ్ కప్ జట్టు నుంచి తప్పించింది. కొన్ని రోజుల పాటు రిహాబిలిటేషన్ కు పంపనుంది.

కాగా కమ్మిన్స్ స్థానంలో లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ బెన్ ద్వార్షుయినిస్ ను ఎంపిక చేశారు. అతను మంచి పేస్ బౌలింగ్ తో పాటు లోయర్ ఆర్డర్ లో రన్స్ చేసే సత్తా ఉన్న క్రికెటర్. ఈ కారణంగానే బెన్ ద్వార్షుయినిస్ ను తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే ఓపెనర్ మాథ్యూ షార్ట్ స్థానంలో మాథ్యూ రెన్షాను ఎంపిక చేశారు.

T20 World Cup

రెన్షా ఇటీవలే పాకిస్థాన్‌పై టీ20 అరంగేట్రం చేసి మంచి ఫామ్‌లో ఉన్నాడు. అటు వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ కు నిరాశే మిగిలింది. ఇటీవల బిగ్ బాష్ లీగ్ లో పలు మెరుపు ఇన్నింగ్స్ లు ఆడినా స్మిత్ ను సెలక్టర్లు పట్టించుకోలేదు. ఇదిలా ఉంటే మెగాటోర్నీకి కమిన్స్ లేకపోవడం ఆస్ట్రేలియాకు పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పాలి. పవర్ ప్లేలోనూ, డెత్ ఓవర్స్ లోనూ కమ్మిన్స్ కు మంచి రికార్డుంది. అలాంటి బౌలర్ దూరమవడంతో ఈ లోటును ఎవరు భర్తీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

ఇక కమ్మిన్స్ వరల్డ్ కప్ తర్వాత ఐపీఎల్ లో ఆడే అవకాశాలున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ సారథిగా వ్యవహరిస్తున్న కమిన్స్ ఐపీఎల్ పూర్తి సీజన్ అందుబాటులో ఉంటాడా లేదా అనేది చూడాలి.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version