Just CrimeLatest News

Criminals: నేరస్థులూ జాగ్రత్త..ఇకపై తప్పు చేసి పారిపోవడం కుదరదు

Criminals: ఈమధ్య కాలంలో పోలీసులు డ్రగ్స్, గంజాయి సరఫరాదారులు, పేకాట రాయుళ్ల వంటి వారిని పట్టుకోవడానికి డ్రోన్‌లనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

Criminals

నేరం చేసి తప్పించుకోవాలనకుంటే మళ్లీ తప్పులో కాలేసినట్లే. దట్టమైన అడవుల్లో దాక్కున్నా..లోతైన గుహల్లో తలదాచుకున్నా.. ఏడు సముద్రాలు దాటి పారిపోయినా.. వెతకడానికి కాదు, వెతుక్కుంటూ వచ్చే ఒక కరుడుగట్టిన నిఘా కన్ను వారిని పట్టిచ్చేస్తుంది.

అవును.. పోలీసుల చేతిలో ఒక అస్త్రంగా మారిన డ్రోన్స్..వరుసగా నేరస్థుల భరతం పడుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అడవులను అడ్డాగా మార్చుకున్న ఓ అంతర్రాష్ట్ర దొంగల ముఠా(Criminals)ను పట్టుకోవడంలో డ్రోన్‌లు (Police drone operation) సాయపడటం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు అంతర్రాష్ట్ర దొంగల(Criminals) ముఠాను(Interstate gang arrested) చాకచక్యంగా పట్టుకున్నారు. ఇది ఒక సాధారణ ఆపరేషన్ కాదు. డ్రోన్‌ల సహకారంతో పోలీసులు చేపట్టిన ఒక ప్రత్యేక ‘వల’ . జిల్లాలోని తనకల్లు అటవీ ప్రాంతంలోని చెక్కవారిపల్లి సమీపంలో ఉన్న తెల్ల గరుగుగుట్ట వద్ద ఈ దొంగల ముఠా స్థావరాన్ని పోలీసులు గుర్తించారు.

Criminals
Criminals

స్థానికులు బొగ్గు కాల్చే పనుల మాటున ఈ ముఠా అడవిలో స్థావరం ఏర్పాటు చేసుకుందని పోలీసులు గుర్తించారు. దట్టమైన అటవీ ప్రాంతంలో వారి స్థావరం ఎక్కడుందో కనుగొనడం కష్టమని గ్రహించి, పోలీసులు అధునాతన సాంకేతికతను వినియోగించుకున్నారు. ఈ ఆపరేషన్‌లో డ్రోన్‌ల సహాయంతో పోలీసులు గాలింపు చేపట్టారు.

రియల్ టైంలో అటవీ ప్రాంతాన్ని పరిశీలించి, ఎక్కడ ఎలాంటి కదలికలు ఉన్నాయో తెలుసుకున్నారు. పక్కా సమాచారంతో ముగ్గురు ఎస్‌ఐలు, 70 మంది పోలీసులు, 50 మంది స్థానిక యువకులు కలిసి ముఠా స్థావరంపై ఆకస్మికంగా దాడి చేశారు. ఈ ఆపరేషన్‌లో దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు.

అదుపులోకి తీసుకున్న నిందితుల బ్యాక్ గ్రౌండ్ పోలీసులే షాక్ అయ్యారట. ఈ అంతర్రాష్ట్ర నేరస్థుల ముఠా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినవారు. చెక్‌పాయింట్ల వద్ద దారిదోపిడీలు, అత్యాచారం, హత్యల వంటి అనేక నేరాల్లో వీరికి సంబంధం ఉన్నట్లు తేలింది. వీరు పలు రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్ నిందితులు వీళ్లు.

Criminals
Criminals

నిందితుల్లో ఇద్దరు జీవిత ఖైదు అనుభవిస్తున్న వారు కాగా, మరొకరు గుంటూరు జైలు నుంచి పారిపోయిన దొంగ అని పోలీసులు గుర్తించారు.ఈ ముఠాలోని ఏడు కుటుంబాలు దాదాపు ఆరు నెలలుగా తెల్ల గరుగుగుట్టలో నివసిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ముఠా నుంచి పోలీసులు భారీగా ఆయుధాలు, నగదు, కొంత బంగారం స్వాధీనం చేసుకున్నారు.

ఈమధ్య కాలంలో పోలీసులు డ్రగ్స్, గంజాయి సరఫరాదారులు, పేకాట రాయుళ్ల వంటి వారిని పట్టుకోవడానికి డ్రోన్‌లనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కర్ణాటకలో భారీగా గంజాయి సరఫరాదారులను, అలాగే తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌లలోని అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను పట్టుకోవడంలో డ్రోన్‌లు కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

Also Read: Six planets: ఖగోళ అద్భుత.. ఒకే వరుసలో ఆరు గ్రహాల కవాతు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button