Aya Share : నాని ఊరమాస్ అవతారం.. ఆయా షేర్ సెన్సేషన్..

Aya Share : కేవలం దక్షిణాది భాషల్లోనే కాకుండా హిందీ, ఇంగ్లీష్, స్పానిష్‌తో సహా టోటల్ 8 భాషల్లో గ్లోబల్ స్థాయిలో ది ప్యారడైజ్ మూవీ రిలీజ్ కాబోతుంది.

Aya Share

నేచురల్ స్టార్ నానిని చాలామంది ఒక హీరోగా కంటే మన పక్కింటి అబ్బాయిలాగే అనుకుంటారు . తాజాగా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఇప్పటి వరకూ క్లాసీ లుక్‌లో కనిపించిన నానిలో..మాస్ యాంగిల్‌ను బయటకు తీశాడు. దసరా వంటి భారీ విజయం తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న.. ది ప్యారడైజ్ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

తాజాగా ఈ మూవీ నుంచి .. ఆయా షేర్ (Aya Share ) అనే ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజై సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ప్రోమోలో ఫ్యాన్స్ కూడా గుర్తుపట్టలేనంతగా నాని లుక్ మారిపోయింది. ఆయా షేర్ (Aya Share ) అనే ఫస్ట్ సింగిల్ ప్రోమో లో ..రగ్గ్డ్ బాడీ లాంగ్వేజ్, జడ, కళ్లలో ఇంటెన్సిటీ చూస్తుంటే..ఈసారి నాని బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోయడం ఖాయమని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.

ఈ సినిమాకు మెయిన్ బలం అనిరుధ్ రవిచందన్ మ్యూజిక్ అని చెప్పొచ్చు. ఇప్పుడు రిలీజైన చిన్న బిట్ లోనే అనిరుధ్ తన మార్క్ హై-వోల్టేజ్ బీట్‌తో ఫ్యాన్స్‌లో పూనకాలు తెప్పించాడు. కాసర్ల శ్యామ్ అందించిన లిరిక్స్‌కు.. అనిరుధ్ వాయిస్ ప్లస్ అవడంతో సాంగ్ రేంజ్ పీక్స్‌కు వెళ్లింది.

ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ప్రొడక్షన్లో ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒక కీలక పాత్రలో నటిస్తుండటం మూవీకి మరింత క్రేజ్‌ను తీసుకొచ్చింది. నాని కెరీర్‌లోనే ఇది అత్యంత కాస్ట్లీ అండ్ డిఫరెంట్ మూవీగా నిలవబోతోంది.

Aya Share

టెక్నికల్ అంశాల పరంగా చూస్తే ది ప్యారడైజ్.. టీమ్ చాలా బలంగా ఉంది. కేవలం మాస్ యాక్షన్ మాత్రమే కాకుండా, కథలో కూడా చాలా ఇంటెన్సిటీ ఉంటుందని మూవీ యూనిట్ నమ్మకంగా ఉంది. ఈ మూవీ రిలీజ్ డేట్ విషయంలో కూడా మేకర్స్ చాలా తెలివైన నిర్ణయం తీసుకున్నారు.

నిజానికి మార్చిలో రావాల్సిన ఈ మూవీ.. ఇప్పుడు ఆగష్టు 21న ఆడియన్స్ ముందుకు రానుంది. ఆ సమయంలో వరుసగా సెలవులు ఉండటం, రక్షా బంధన్ వంటి పండుగలు తోడవడంతో వసూళ్ల పరంగా మూవీకి పెద్ద ప్లస్ కానుంది. కేవలం దక్షిణాది భాషల్లోనే కాకుండా హిందీ, ఇంగ్లీష్, స్పానిష్‌తో సహా టోటల్ 8 భాషల్లో గ్లోబల్ స్థాయిలో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. నాని లోని పక్కా మాస్ హీరోని ఈ సినిమా ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version