Icon star
సౌత్ ఇండియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే..కేరళలోని కొచ్చిలో 70వ ఫిలింఫేర్ అవార్డ్స్ వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో టాలీవుడ్ ఐకాన్ స్టార్(Icon star) అల్లు అర్జున్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. పుష్ప 2.. ది రూల్ మూవీలో తన అద్భుత నటనకు ఉత్తమ నటుడిగా బ్లాక్ లేడీని అందుకున్న బన్నీ.. ఇప్పటివరకు టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి పేరుతో ఉన్న ఒక అరుదైన రికార్డ్‌ను చేరుకున్నారు.
ఈ అవార్డుతో అల్లు అర్జున్ అకౌంట్‌లో మొత్తం ఏడు ఫిలింఫేర్ పురస్కారాలు చేరాయి. ఇప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవి మాత్రమే ఏడు అవార్డులతో టాప్‌లో ఉండగా, ఇప్పుడు అల్లు అర్జున్ చిరు సరసన నిలిచి తన సత్తా చాటారు. అవార్డు అందుకున్న సమయంలో అల్లు అర్జున్ భావోద్వేగానికి గురవుతూ, ఈ విజయం తన కెరీర్‌లోనే ఒక గొప్ప మైలురాయి అని అన్నారు. దీనికి కారణమైన తన అభిమానులకు ఎప్పటికీ రుణపడి ఉంటానంటూ కృతజ్ఞతలు తెలిపారు.
ఇక ఐకాన్ స్టార్(Icon star) అల్లు అర్జున్ సినీ ప్రస్థానాన్ని గమనిస్తే, బన్నీకి ఇది ఏడవ ఫిలింఫేర్ అవార్డ్ అవుతుంది. గతంలో పరుగు, వేదం, రేసు గుర్రం, రుద్రమదేవిలో సపోర్టింగ్ యాక్టర్, సరైనోడు , పుష్ప సినిమాలకు బన్నీ ఈ పురస్కారాలను అందుకున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి 21 నామినేషన్ల ద్వారా 7 అవార్డులు సాధించగా.. అల్లు అర్జున్ కేవలం 13 నామినేషన్లలోనే ఆ ఘనతను సాధించడంతో బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
టాలీవుడ్ అగ్ర హీరోలైన మహేష్ బాబు 4 నామినేషన్లు, రామ్ చరణ్ 3 నామినేషన్లు, ఎన్టీఆర్ 2 నామినేషన్లు, పవన్ కళ్యాణ్ 1 నామినేషన్ తీసుకుని ఈ జాబితాలో బన్నీ కంటే వెనుకే ఉన్నారు. అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పటివరకు ఫిలింఫేర్లో ఒక్క అవార్డు కూడా అందుకోకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల కేటగిరీలో ఎక్కువ అవార్డులు అందుకున్న హీరోగా అల్లు అర్జున్ టాప్‌లో కొనసాగుతున్నారు.
ఈ ఏడాది విషయం చూసుకుంటే.. ఫిలింఫేర్ వేడుకలో పుష్ప 2 సినిమాకే ఎక్కువ పురస్కారాలు దక్కాయి. ఐకాన్ స్టార్ (Icon star)అల్లు అర్జున్‌కు ఉత్తమ హీరో అవార్డుతో పాటు, సుకుమార్ బెస్ట్ డైరెక్టర్‌గా, దేవిశ్రీ ప్రసాద్ ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా అవార్డులు అందుకున్నారు. ఇతర విభాగాల్లో చూస్తే, 35.. చిన్న కథ కాదు మూవీకి నివేతా థామస్ ఉత్తమ నటిగా నిలిచారు.
అమితాబ్ బచ్చన్ (కల్కి 2898AD), అంజలి (గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి) కూడా తమ నటనతో గుర్తింపు పొందారు. ఇక సంగీత విభాగంలో కుర్చీ మడతపెట్టి పాటకు శ్రీకృష్ణ, చుట్టమల్లె పాటకు శిల్పారావు బెస్ట్ సింగర్స్‌గా నిలిచారు. ప్రస్తుతం అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాను కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో కలిసి చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ జానర్‌లో రూపొందుతున్న ఈ మూవీ అల్లు అర్జున్ క్రేజ్‌ను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్తుందని బన్నీ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
