Horse Manure: గుర్రపు పేడతో ప్లాస్టిక్ తయారీ..పర్యావరణానికి వరంలా మారనుందా?

Horse Manure: ఫైబర్లను ఉపయోగించి మనం రోజూ వాడే ప్యాకేజింగ్ మెటీరియల్స్, సన్నని ప్లాస్టిక్ లాంటి షీట్లు, రిబ్బన్లను ఈజీగా తయారు చేయొచ్చు.

Horse Manure

ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద ఛాలెంజ్‌లో ముందుగా గుర్తుకు వచ్చేది ప్లాస్టిక్ పొల్యూషన్ అని తెలిసిందే. అలాగే జంతు వ్యర్థాల నిర్వహణ కూడా పర్యావరణానికి పెద్ద సమస్యగా మారింది. అయితే ఈ రెండు సమస్యలకు ఒకేసారి పరిష్కారం చూపించేలా తాజాగా యూనివర్శిటీ కాలేజ్ లండన్ సైంటిస్టులు ఒక వినూత్న ఆవిష్కరణ చేశారు.

గుర్రపు పేడ(Horse Manure)(Horse Manure) నుంచి పర్యావరణానికి మేలు చేసే బయో-ప్లాస్టిక్‌ను తయారు చేశారు.గుర్రపు పేడ నుంచి ప్లాస్టిక్ తయారీ అనేది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇది ఫ్యూచర్‌లో ప్లాస్టిక్ రక్కసి నుంచి మనల్ని కాపాడే శక్తివంతమైన ఆయుధంగా మారనుంది. సాధారణంగా గుర్రపు యజమానులకు ఆ పేడను తొలగించడమనేది పెద్ద ఖర్చుతో కూడుకున్న పని. కానీ అదే పేడ ఇప్పుడు పర్యావరణానికి బంగారంగా మారనుంది.

మొక్కల నుంచి దొరికే సెల్యులోజ్ అనే సహజ ఫైబర్ గుర్రపు పేడ(Horse Manure)లో ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఆవు పేడతో పోలిస్తే గుర్రపు పేడలోనే ఈ సెల్యులోజ్ శాతం ఎక్కువ. అందుకే ఇది బయో-ప్లాస్టిక్ తయారీకి ఎంతో అనుకూలమైనదిగా పరిశోధకులు చెబుతున్నారు.

ప్రొఫెసర్ మోహన్ ఎదిరిసింఘే అండ్ అతని టీమ్ సభ్యులు..ప్రెషరైజ్డ్ స్పిన్నింగ్ అనే ప్రత్యేక పద్ధతి ద్వారా ఈ పేడ నుంచి సన్నని సెల్యులోజ్ ఫైబర్లను వేరు చేయడంలో విజయం సాధించారు. ఈ ఫైబర్లను ఉపయోగించి మనం రోజూ వాడే ప్యాకేజింగ్ మెటీరియల్స్, సన్నని ప్లాస్టిక్ లాంటి షీట్లు, రిబ్బన్లను ఈజీగా తయారు చేయొచ్చు. ఇది మనం వాడి పారేసే సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం కాబోతోంది.

Horse Manure

ఈ ఆవిష్కరణలోని మరో గొప్ప విషయం ఏంటంటే, దీని తయారీలో ఎలాంటి హానికరమైన రసాయనాలను కూడా వాడరు. కేవలం నీటి ఆధారిత ద్రావణాలనే ఉపయోగిస్తారు కనుక ఈ ప్లాస్టిక్ నేలలో కలిసినా భూమికి ఎలాంటి నష్టం జరగదు. ఈ సాంకేతికతను భారీ ఫ్యాక్టరీల్లోనే కాకుండా, సౌరశక్తి సహాయంతో చిన్న చిన్న పొలాల్లో కూడా ఉత్పత్తి చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 5 బిలియన్ టన్నుల జంతు వ్యర్థాలు నదులను కలుషితం చేస్తున్న ఈ సమయంలో, ఇలాంటి ఆవిష్కరణలు వ్యర్థాలను ఇలా విలువైన వనరులుగా మారుస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఈ సాంకేతికత ..ప్రకృతి ఇచ్చిన వనరులను తిరిగి ప్రకృతికే ఉపయోగపడేలా మారుస్తుందని అంటున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version