Cheating: బిగ్ బాస్ హౌస్‌లో చీటింగ్ రచ్చ.. కళ్యాణ్‌కు భరణి షాక్!

Cheating: తన కోపం మొత్తాన్ని భరణి గతంలో జరిగిన చీటింగ్‌ బాగోతాలపైకి మళ్లించాడు. ముఖ్యంగా, కళ్యాణ్ మరియు డీమాన్ పవన్ గతంలో గేమ్ ఆడిన తీరును ప్రస్తావించి, వారిపై తీవ్ర ఆరోపణలు చేశాడు.

Cheating

ఫస్ట్ ఫైనలిస్ట్ టికెట్ (Ticket to Finale) కోసం బిగ్ బాస్ ఇంట్లో కంటెస్టెంట్ల మధ్య పోటీ అసాధారణ స్థాయిలో కొనసాగుతోంది. ఈ క్రమంలో, తాజాగా విడుదలైన ప్రోమో హౌస్‌లో పెద్ద యుద్ధానికి తెర లేపింది. ఇంతకాలం ప్రశాంతంగా ఉన్న భరణి, ఈసారి నేరుగా చీటింగ్‌ (Cheating)ఆరోపణలతో ఇద్దరు కీలక కంటెస్టెంట్లపై విరుచుకుపడ్డాడు

నిన్న ఎపిసోడ్‌లో రీతూ, భరణి మధ్య జరిగిన రసవత్తరమైన పోరుతోనే ఈ వివాదం మొదలైంది. ఆ టాస్కులో రీతూ గెలిచినా, చివర్లో తనూజ అనుమానం వ్యక్తం చేయడం, దానికి భరణి వంత పాడటంతో వివాదం ముదిరింది. ఈ టాస్కుకు సంచాలక్‌గా వ్యవహరించిన సంజన నిర్ణయాన్ని భరణి తీవ్రంగా తప్పుబట్టాడు. తన నిర్ణయాలు పక్షపాతంగా ఉన్నాయని, అది అన్యాయమని బిగ్ బాస్‌కే ఫిర్యాదు చేశాడు.

తాజా ప్రోమోలో, ‘జంగ్ యార్డ్’ టాస్క్ భాగంగా ట్రయాంగిల్స్, స్క్వేర్స్, సర్కిల్స్ వంటి షేప్స్‌ను గుర్తించి, వాటిని ముందుకు తీసుకురావాలనే నియమం ఉంది. ఈ సమయంలో, రీతూ పెట్టిన షేప్స్‌లో ఒకటి ట్రయాంగిల్ కాదని, అది రెక్టాంగిల్ (దీర్ఘచతురస్రం) అవుతుందని భరణి గట్టిగా వాదించాడు. సంచాలక్ దాన్ని సరిగా గుర్తించకుండా రీతూను విజేతగా ప్రకటించారని, ఇది కూడా అన్యాయమేనని నిప్పులు చెరిగాడు.

Cheating

ఈ ఆరోపణతో రీతూ కూడా కోపంతో ఊగిపోయింది. “నా పేరు ఎందుకు తీస్తున్నారు? దాన్ని ట్రయాంగిల్ అనుకోకుండా ఏమంటారు?” అంటూ అరుస్తూ ప్రశ్నించింది. దీనికి భరణి అంతే గట్టిగా “నేను నీతో మాట్లాడడం లేదు!” అంటూ సీరియస్ అయ్యాడు.

అయితే, ఈ గొడవ కేవలం రీతూ విషయంలో ఆగిపోలేదు. తన కోపం మొత్తాన్ని భరణి గతంలో జరిగిన చీటింగ్‌ (Cheating) బాగోతాలపైకి మళ్లించాడు. ముఖ్యంగా, కళ్యాణ్ మరియు డీమాన్ పవన్ గతంలో గేమ్ ఆడిన తీరును ప్రస్తావించి, వారిపై తీవ్ర ఆరోపణలు చేశాడు.

Cheating

“ఎక్కడెక్కడ చీటింగ్ (Cheating)జరిగింది? ఎక్కడెక్కడ అన్యాయం జరిగింది? ఎక్కడ షూ చూపిస్తే మనుషులను గుర్తుపట్టారో… మొత్తం వీడియోలు బయటకు వచ్చాయి. ఇప్పటికీ నేను నోరు మూసుకుని కూర్చున్నాను” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గతంలో జరిగిన కొన్ని టాస్కులలో సంకేతాల ద్వారా, లేదా అనైతికంగా గేమ్ ఆడటం ద్వారా కొందరు లబ్ధి పొందారని, దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని పరోక్షంగా బయటపెట్టాడు.

దీంతో, కళ్యాణ్ వెంటనే మధ్యలోకి దూరిపోయాడు. “కన్ఫెషన్ రూంలో ఏం చూపించారో నాకు తెలుసు. వీడికి (డీమాన్‌కు) ఆ విషయం తెలియదు… ఎవరిని బ్లేమ్ చేస్తున్నారు? నన్ను ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు?” అంటూ భరణిపై ఫైర్ అయ్యాడు. ఈ మాటలతో కళ్యాణ్ తానేదో దాస్తున్నట్లుగా రియాక్ట్ అయ్యాడని, తప్పు చేశాడని ఒప్పుకున్నట్లుగా హౌస్‌మేట్స్ భావించారు.

“నీ పేరు తెచ్చానా? నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావ్?” అంటూ భరణి మరింత రెచ్చిపోయి కళ్యాణ్‌పైకి వెళ్లడంతో హౌస్‌లో హై-టెన్షన్ వాతావరణం నెలకొంది. మొత్తానికి, ఇన్నాళ్లూ ప్రశాంతంగా ఉన్న భరణి… ఫైనల్ టికెట్ టాస్క్ సమయంలో కోపంతో విశ్వరూపం చూపించి, హౌస్‌లోని దాగుడుమూతలను బయటపెట్టాడు. ఇది కచ్చితంగా షోలో పెద్ద రచ్చకు దారితీసే అవకాశం ఉంది.

మరిన్ని బిగ్ బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version