Bigg Boss : బిగ్ బాస్ హౌస్‌లో రచ్చ షురూ.. కన్నీళ్లు, గొడవలు!
Bigg Boss :సెలబ్రిటీలు , కామనర్‌ల మధ్య చిన్నపాటి ఘర్షణ, ఆధిపత్య పోరు రసవత్తరంగా సాగింది.

Bigg Boss
బిగ్ బాస్ షో మొదటి ఎపిసోడ్ ఎంతో ఉత్కంఠగా ప్రారంభమైంది. బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన మొదటి రోజే, హౌస్‌మేట్స్ మధ్య గొడవలు మొదలయ్యాయి. సెలబ్రిటీలు , కామనర్‌ల మధ్య చిన్నపాటి ఘర్షణ, ఆధిపత్య పోరు రసవత్తరంగా సాగింది.
డే వన్ లో బిగ్ బాస్ గార్డెన్ ఏరియాలో ఉన్న హౌస్ ఓనర్స్, టెనెంట్స్‌ను వేరుగా కూర్చోబెట్టారు. గార్డెన్ ఏరియాను శుభ్రం చేయడానికి ఎంత సమయం పడుతుందని బిగ్ బాస్ ఇమ్మానుయేల్‌ను అడగ్గా, అతను ఒక రోజు మొత్తం పడుతుందని చెప్పారు. దాంతో బిగ్ బాస్ ఈ పనిని మానిటర్ హరీష్‌కు అప్పగించారు. ఇమ్మానుయేల్ సరదాగా హరీష్‌ని “గుండు అంకుల్” అని పిలవడంతో మొదట పట్టించుకోని హరీష్, అదే మాట మళ్లీ మళ్లీ అనడంతో ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. “చూసుకుని మాట్లాడాలి బ్రదర్.. ఎవరు గుండు? ఎవరు అంకుల్?” అని గట్టిగా అడిగారు.
దీనితో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. “మీ మూడ్ బట్టి మనుషులు ఉండరు” అని ఇమ్మానుయేల్ అనగా, హరీష్ “నాకు నచ్చితే గుండెల్లో పెట్టుకుంటా.. నెత్తిన ఎక్కాలని చూస్తే మాత్రం తొక్కుతా” అంటూ బరువైన డైలాగులు చెప్పారు. ఆ తరువాత, “ఓకే ఓకే చాలా చూశాం.. నా రియాక్షన్ కూడా చూపిస్తా” అని ఇమ్మానుయేల్ సవాల్ విసిరారు. ఇద్దరి మధ్య గొడవ పెద్దదవుతుండటంతో, శ్రష్టి ,ఇమ్ము వెళ్లి హరీష్‌ని కూల్ చేశారు.
హౌస్‌లోకి అడుగుపెట్టిన ఓనర్స్, టెనెంట్స్‌కు కొన్ని పనులను అప్పగించారు. మానిటర్స్‌గా వ్యవహరిస్తూ, వారి పనులను గమనించాలని బిగ్ బాస్ ఆదేశించారు. హరీష్ ఇంటిని శుభ్రం చేసే పనిని ఇమ్మానుయేల్‌కు, శ్రష్టికి అప్పగించారు. ప్రియా, తనుజా , భరణిలకు వంట పనులు అప్పగించారు. అయితే, వంట గదిని శుభ్రం చేయనీయకుండా కేవలం వంట మాత్రమే చేయాలని ప్రియా చెప్పడంతో, హరీష్ దీనిపై ఆమెతో వాదనకు దిగారు. తర్వాత ఓనర్స్ అందరూ కలిసి హరీష్ తీరుపై చర్చించుకోవడం కనిపించింది.

పని పూర్తి అయ్యాక అందరూ తింటుండగా, బిగ్ బాస్ మరో షాక్ ఇచ్చారు. టెనెంట్స్ అందరూ బయటకు వెళ్లిపోవాలని, తింటున్న ఫుడ్ కూడా వదిలేసి వెళ్ళిపోవాలని ఆదేశించారు. దీనితో హరీష్ చాలా కష్టపడిన ఇమ్మానుయేల్‌ను తిననివ్వమని బిగ్ బాస్‌ను రిక్వెస్ట్ చేశారు. బిగ్ బాస్ స్పందించకపోవడంతో, హరీష్ దగ్గరున్న ఫుడ్‌ను కూడా స్టోర్ రూమ్‌లో పెట్టమన్నారు. ఈ సంఘటనతో హరీష్ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకోవడం కనిపించింది. ఆ తరువాత బిగ్ బాస్ గార్డెన్ ఏరియాలో అందరికీ ఫుడ్ ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. ఈ ఫుడ్ ఎవరికిచ్చిందనే విషయాన్ని స్పష్టం చేసి, ఎవరిచ్చిన ఫుడ్‌ను వాళ్లు మాత్రమే తినాలని తెలిపారు.
బిగ్ బాస్(Bigg Boss )షో మొదలైన మొదటి రోజే హౌస్‌మేట్స్ అందరూ చూస్తుండగా, రీతూ ఒక చిన్న గేమ్ ఆడదామని పవన్ కళ్యాణ్‌ని అడిగింది. “ఎవరు కళ్ళు ఆర్పకుండా ఒకరినొకరు ఎక్కువసేపు చూస్తారో చూద్దాం” అని చెప్పగానే, పవన్ కళ్యాణ్ దానికి ఒప్పుకున్నారు. వెంటనే రీతూ ఆయన కళ్లల్లోకి ఓర చూపులతో చూసింది. కొద్దిసేపటికే రీతూ కళ్లలో నుంచి నీళ్లు రావడంతో ఆమె కళ్ళు మూసుకుంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అలాగే కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉండిపోయారు.
చివరికి గెలిచిన పవన్ కళ్యాణ్, “అట్లుంటది మనతోని” అంటూ తన డైలాగ్‌తో ఆకట్టుకున్నారు. ఇది కేవలం ఒక ఆట మాత్రమేనా, లేక బిగ్ బాస్ హౌస్‌లో ఒక కొత్త లవ్ ట్రాక్‌కి నాంది పలకబోతుందా అనేది రాబోయే రోజుల్లో తేలిపోతుంది.
