Bigg Boss
గత బిగ్‌బాస్(Bigg Boss) సీజన్లలో లాగానే, ఈ సీజన్‌లో కూడా ఎలిమినేట్ అయిన ఎక్స్-కంటెస్టెంట్లను బిగ్‌బాస్ హౌస్‌లోకి తిరిగి ఆహ్వానించడంతో ఎనిమిదో వారం నామినేషన్స్ ప్రక్రియ ఓ రేంజ్‌లో, హాట్ హాట్‌గా సాగింది. అంతేకాదు, ఈ వారం నామినేషన్స్ పవర్ మొత్తాన్ని కూడా మాజీ కంటెస్టెంట్ల చేతికే అప్పగించాడు బిగ్‌బాస్.
మాజీ కంటెస్టెంట్ల చేతిలో నామినేషన్స్ పవర్..ప్రియ, మర్యాద మనీష్, ఫ్లోరాశైనీ, దమ్ము శ్రీజ వంటి మాజీ కంటెస్టెంట్లు ఈ వారం నామినేషన్స్ నిర్వహించారు. ఈ ప్రక్రియ కోసం బిగ్‌బాస్(Bigg Boss) వారికి రెండు కత్తులు ఇచ్చారు.
- మొదటి కత్తి: ఒక కత్తిని ఉపయోగించి హౌస్‌మేట్స్‌లో ఒకరిని డైరెక్ట్‌గా నామినేట్ చేయాలి.
- రెండో కత్తి: ఇంకొక కత్తిని హౌస్‌మేట్స్‌లో ఎవరికైనా ఇవ్వాలి. ఆ కత్తి తీసుకున్న వ్యక్తి మరొకరిని నామినేట్ చేయవచ్చు.
నామినేషన్స్ ప్రక్రియ వివరాలు.. ఈ వారం ఇమ్మానుయేల్ కెప్టెన్‌గా ఉండటం వలన నామినేషన్స్ నుంచి తప్పించుకోగలిగాడు. అలాగే, సాయి శ్రీనివాస్ తనకు వచ్చిన ఇమ్యూనిటీ పవర్‌ను ముందుగానే ఉపయోగించుకోవడంతో, ఎవరూ వీరిద్దరినీ నామినేట్ చేయలేకపోయారు.
- ముందుగా వచ్చిన ప్రియ, సంజనను డైరెక్టుగా నామినేట్ చేసి, కత్తిని కళ్యాణ్ చేతికి ఇచ్చింది. కళ్యాణ్ ఆ కత్తిని ఉపయోగించి రాముని నామినేట్ చేశాడు.
- ఫ్లోరా డైరెక్ట్‌గా రీతూని నామినేట్ చేసి, మరో కత్తిని సుమన్ శెట్టికి ఇచ్చింది. సుమన్ శెట్టి మళ్లీ సంజననే నామినేట్ చేశాడు.
- మనీష్ డైరెక్ట్‌గా కళ్యాణ్‌ని నామినేట్ చేసి, కత్తిని కెప్టెన్ ఇమ్మానుయేల్ కు ఇచ్చాడు. ఇమ్మూ తన పవర్ ఉపయోగించి తనూజని నామినేట్ చేశాడు.
- చివరిగా దమ్ము శ్రీజ వచ్చి డైరెక్ట్‌గా మళ్లీ కళ్యాణ్‌ని నామినేట్ చేసి షాకిచ్చింది.
ఈ ప్రక్రియ మొత్తం ముగిసేసరికి, ఎనిమిదో వారం నామినేషన్స్ లిస్ట్‌లో మొత్తం 8 మంది కంటెస్టెంట్స్ నిలిచారు. కళ్యాణ్, రాము, డీమాన్ పవన్, గౌరవ్, సంజన, తనూజ, మాధురి, రీతూ చౌదరి
అయితే ఈ లిస్ట్‌లో ఉన్న చాలా మంది కంటెస్టెంట్లకు బయట ఎంతో కొంత ఫ్యాన్ బేస్ ఉంది. అయితే, గౌరవ్ , మాధురీలకు మాత్రం అంతగా ఆదరణ లేదని, ఓటింగ్ పరంగా వీరిద్దరూ కొంత వెనుకబడి ఉండవచ్చని విశ్లేషణలు చెబుతున్నాయి. మరి ఈ వారంలో హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఈ ఇద్దరిలో ఒకరా? లేక అనూహ్యమైన కంటెస్టెంట్ బయటకు వెళ్తారా? అనేది ఓటింగ్ ట్రెండ్‌ను బట్టి చూడాలి.
