Bigg Boss: బిగ్ బాస్ అగ్నిపరీక్ష ప్రయోగం ఫెయిలా? సక్సెసా?

Bigg Boss:టాస్కులు ఆసక్తికరంగా ఉన్నా, కంటెస్టెంట్స్‌లో గందరగోళం, అలసత్వం వల్ల అవి ప్రేక్షకులకు పెద్దగా వినోదాన్ని పంచలేకపోతున్నాయి.

Bigg Boss

బిగ్ బాస్ (Bigg Boss)సీజన్ 9 మొదలయ్యే ముందు, అగ్నిపరీక్ష ద్వారా సామాన్యులకు అవకాశం కల్పించడం ఒక కొత్త ప్రయోగంగా, ఆసక్తికరంగా ఉంటుందని అంతా భావించారు. కానీ, రోజురోజుకు ఆ ఆసక్తి తగ్గిపోతోందని, షో ఏ మాత్రం ఎంగేజింగ్‌గా లేదని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.

కంటెస్టెంట్స్‌లో బిగ్ బాస్(Bigg Boss) హౌస్‌లోకి వెళ్లాలన్న కసి, ఆవేశం కనిపించకపోవడం, టాస్కుల్లో సరైన ప్రదర్శన లేకపోవడం దీనికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. టాస్కులు ఆసక్తికరంగా ఉన్నా, కంటెస్టెంట్స్‌లో గందరగోళం, అలసత్వం వల్ల అవి ప్రేక్షకులకు పెద్దగా వినోదాన్ని పంచలేకపోతున్నాయి.

తాజా ఎపిసోడ్‌లో ఐదుగురు లీడర్ల ఆధ్వర్యంలో ఐదు టీమ్‌లను ఏర్పాటు చేశారు. గత ఎపిసోడ్‌లో సంచాలకులుగా పెద్దగా ప్రభావం చూపించని షాకీబ్, మనీష్, పవన్‌లతో కొత్త టాస్క్ మొదలుపెట్టారు. ఈ ముగ్గురిలో మనీష్, షాకీబ్‌లు కలిసి పవన్‌ను లీడర్‌గా ఎంపిక చేశారు. ఇలా టాప్ 15 కంటెస్టెంట్స్‌ను ఎంపిక చేసి, వారిని బ్లూ, రెడ్, గ్రీన్, బ్లాక్ అండ్ వైట్, ఎల్లో టీమ్‌లుగా విభజించారు.

biggboss

ఈసారి టాస్కులను అందరికీ ఒకేసారి ఇచ్చారు. రియల్ ఆర్ ఫేక్ అనే టాస్క్‌లో పాయింట్స్ సంపాదించుకునే అవకాశం కల్పించారు. రెడ్, గ్రీన్ టీమ్‌లు చెరో రెండు పాయింట్లతో ముందంజలో ఉండగా, మిగతా టీమ్‌లు ఒక్కో పాయింట్‌తో వెనకబడ్డాయి. బ్లాక్ అండ్ వైట్ టీమ్ అయితే సున్నా పాయింట్స్‌తో నిరాశపరిచింది. బ్లూ అండ్ రెడ్ టీమ్‌లు టై అవ్వడంతో మరో అడిషనల్ టాస్క్ ఇవ్వగా, అందులో బ్లూ టీమ్ గెలుపొందింది.

టాస్కులు ప్లాన్ చేసిన విధానం బాగానే ఉన్నా కూడా, కంటెస్టెంట్స్ ప్రదర్శన అంత ఆకట్టుకునేలా లేదు. బ్లూ టీమ్ లీడర్ అయిన అనూషన్, తన ఓట్ అప్పీల్ అవకాశాన్ని హరీష్‌కి ఇవ్వగా, జ్యూరీ మెంబర్స్ అదే టీమ్ నుంచి ప్రియా శెట్టిని స్టార్ ప్లేయర్‌గా ఎంపిక చేశారు. ఆమె కూడా ఓట్ అప్పీల్ చేశాడు. ఇలాంటి అవకాశాలు లభించినా, టాప్ 15లో ఉన్న కంటెస్టెంట్స్‌లో బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లాలనే కసి కానీ, పోటీపడే తత్వం కానీ రోజురోజుకు తగ్గిపోతున్నట్లు కనిపిస్తోంది.

మొత్తంగా, బిగ్ బాస్ (Bigg Boss)అగ్నిపరీక్ష(Agnipariksha) అనే కొత్త ప్రయోగం ప్రేక్షకుల్లో అంచనాలను పెంచినా, కంటెస్టెంట్స్ తీరుతో అది ఆసక్తి కోల్పోతుందని, బిగ్ బాస్ సీజన్ 9 మొదలయ్యే ముందే ప్రేక్షకుల్లో నిరాశను పెంచుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సామాన్యులకు అవకాశం ఇచ్చే ఈ ప్రయోగం పెద్దగా సక్సెస్ కాలేదనే భావన వ్యక్తమవుతోంది.

Diabetes: డయాబెటిస్‌ను ప్రారంభంలోనే గుర్తిస్తే పెద్ద ప్రమాదం తప్పినట్లే

Exit mobile version