Buchibabu: పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో బుచ్చిబాబు సానా కొత్తిల్లు.. ‘పెద్ది’ దర్శకుడికి శుభాకాంక్షల వెల్లువ

Buchibabu: సుకుమార్ ఫేవరేట్ స్టూడెంట్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బుచ్చిబాబు, తన గురువు ఆశీస్సులతోనే దర్శకత్వ శాఖలో తనదైన ముద్ర వేశారు.

Buchibabu

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’ చిత్రీకరణతో బిజీగా ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా వ్యక్తిగత జీవితంలో ఒక శుభవార్తను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో బుచ్చిబాబు(Buchibabu) కొత్త ఇంటిని కట్టుకున్నారు.

శనివారం (నవంబర్ 8) రోజు తన కుటుంబ సభ్యులతో కలిసి సతీసమేతంగా ఆయన కొత్తింట్లోకి అడుగు పెట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి, సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు.

బుచ్చిబాబు సానా టాలీవుడ్‌లో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుల్లో ఒకరు. సుకుమార్ ఫేవరేట్ స్టూడెంట్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బుచ్చిబాబు, తన గురువు ఆశీస్సులతోనే దర్శకత్వ శాఖలో తనదైన ముద్ర వేశారు. తన మొదటి సినిమా ‘ఉప్పెన’ తోనే దర్శకుడిగా అరంగేట్రం చేసి, రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, సంచలనం సృష్టించారు.

అంతేకాకుండా, ఈ చిత్రం 69వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో తెలుగులో ఉత్తమ చిత్రంగా ఎంపికై, ఆయన ప్రతిభకు జాతీయ స్థాయిలో గుర్తింపును తెచ్చిపెట్టింది. తక్కువ కాలంలోనే, తన మొదటి సినిమాతో జాతీయ అవార్డు సాధించి, దర్శకత్వ విభాగంలో తన మార్కును గట్టిగా చూపించుకున్నారు.

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఉప్పెన తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకున్నా కూడా, ఆ తర్వాత ఏకంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను డైరెక్ట్ చేసే ‘పెద్ది’ అనే పాన్ ఇండియా ప్రాజెక్టును దక్కించుకోవడం బుచ్చిబాబు(Buchibabu) ప్రతిభకు నిదర్శనం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో ఆయన బిజీగా ఉన్నారు.

ఈ చిత్రం విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోంది. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా ‘అచ్చియ్యమ్మ’ పాత్రలో నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు త్రిపాఠి వంటి ప్రముఖ నటీనటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Buchibabu

ఇక బుచ్చిబాబు (Buchibabu)సానా స్వస్థలం కాకినాడ జిల్లాలోని ఉప్పాడ. అయితే, ఆయన తాజాగా పిఠాపురంలో ఈ కొత్త ఇంటిని నిర్మించుకోవడం విశేషం. గృహప్రవేశ కార్యక్రమం ఉండటం కారణంగానే ఆయన గత రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్ కు హాజరు కాలేకపోయారు.

అయితే, ఆయన దర్శకత్వం వహిస్తున్న ‘పెద్ది’ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ‘చికిరి చికిరి’ ని ఆ కాన్సర్ట్ వేదికపై లైవ్‌లో మరోసారి ప్రేక్షకులకు వినిపించారు రెహ్మాన్.

సుకుమార్ శిష్యుడిగా పరిశ్రమకు వచ్చి, మొదటి సినిమాతోనే స్టార్ డైరెక్టర్ స్థాయికి ఎదిగి, ఇప్పుడు బడా స్టార్స్‌తో భారీ ప్రాజెక్టులు చేస్తూ, వ్యక్తిగత జీవితంలోనూ విజయాన్ని అందుకున్న బుచ్చిబాబు ప్రయాణం అభినందనీయం. ఆయన తదుపరి సినిమా ‘పెద్ది’ కూడా భారీ విజయాన్ని అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version