Dekh Lenge Saala Song: అబ్బాయిని బీట్ చేసిన బాబాయ్..చికిరి రికార్డ్ బ్రేక్ చేసి టాప్‌లో దేఖ్ లేంగే సాలా
Dekh Lenge Saala Song: చాలా కాలం తరువాత పవన్ కళ్యాణ్ 'దేఖ్ లేంగే సాలా పాటలో అదిరిపోయే స్టెప్స్ వేసి ఫ్యాన్స్‌ని ఫిదా చేశాడు.
Dekh Lenge Saala Song
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘దేఖ్ లేంగే సాలా (Dekh Lenge Saala Song)’ పాట సోషల్ మీడియాలో రికార్డుల మోత మోగిస్తోంది. ఈ పాట విడుదలైన తర్వాత సోషల్ మీడియా మొత్తం ఊగిపోతోంది, దీనికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ డాన్స్ అని చెప్పాలి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైనమిక్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్(Dekh Lenge Saala Song)’. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో గతంలో ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ బ్లాక్ బస్టర్ తర్వాత మళ్లీ ఈ కాంబో నుంచి సినిమా వస్తుండడంతో, ప్రేక్షకుల్లో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాను ఒక రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ‘దేఖ్ లేంగే సాలా’ అనే పాటను మేకర్స్ విడుదల చేశారు.
ఈ పాట విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో రికార్డుల మోత మోగించింది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ(Dekh Lenge Saala Song) పాటకి అదిరిపోయే సంగీతం అందించాడు. ఈ పాట రిలీజ్ అయిన కేవలం 24 గంటల్లోనే ఏకంగా 29.6 మిలియన్లకు పైగా వ్యూస్ (Views) సాధించింది. 24 గంటల్లో ఈ స్థాయిలో వ్యూస్ సాధించిన పాటగా ‘దేఖ్ లేంగే సాలా’ ఒక కొత్త రికార్డు క్రియేట్ చేసింది.

అంతకు ముందు ఈ రికార్డ్ రామ్ చరణ్ సినిమాలోని ‘చికిరి’ పాట పేరుమీద ఉండేది. ఇప్పుడు ఆ రికార్డ్ బ్రేక్ చేసి ‘దేఖ్ లేంగే సాలా’ సాంగ్ (Dekh Lenge Saala Song)టాప్ లో నిలిచింది. ఈ పాట ఈ రేంజ్ లో సక్సెస్ అవ్వడానికి, రికార్డులు క్రియేట్ చేయడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ డాన్స్ అని అభిమానులు అంటున్నారు. చాలా కాలం తరువాత పవన్ కళ్యాణ్ ఈ పాటలో అదిరిపోయే స్టెప్స్ వేసి ఫ్యాన్స్‌ని ఫిదా చేశాడు.
ఈ భారీ విజయం, పాటలో పవన్ కళ్యాణ్ అదిరిపోయే డాన్స్ వెనుక ఉన్న అసలు క్రెడిట్ మాత్రం దర్శకుడు హరీష్ శంకర్ దే అని సినీ వర్గాలు చెబుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయన నుంచి ప్రస్తుతం ఎలాంటి అంశాలను, డాన్స్‌ను కోరుకుంటున్నారు అనే దానిపై హరీష్ శంకర్ చాలా పక్కాగా ప్లాన్ వేసి ఈ ‘దేఖ్ లేంగే సాలా’ సాంగ్‌ను సెట్ చేశాడు.
అందుకే పవన్ కళ్యాణ్ ఈ పాటలో చాలా ఎనర్జిటిక్‌గా, స్టైలిష్ స్టెప్స్‌తో కనిపించారు. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు. సోషల్ మీడియాలో హరీష్ శంకర్ ప్లానింగ్‌పై, ఆయన విజన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ ఒక్క పాట విడుదల కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఒక రేంజ్ కి వెళ్లిపోయాయి. ఈ సినిమా కూడా పాటలాగే భారీ విజయం సాదిస్తుందని మేకర్స్ , ఫ్యాన్స్ చాలా ధీమాతో ఉన్నారు. ఈ సినిమా 2026 ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని ప్రస్తుతం సినీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.
పాటతోనే ఈ స్థాయిలో రికార్డ్స్ క్రియేట్ చేసిన పవన్ కళ్యాణ్, సినిమా విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో అని చూడాలి. ఈ పాట సృష్టించిన హడావుడి చూస్తుంటే, సినిమా రిలీజ్ తర్వాత రికార్డులు మరింత భారీగా ఉంటాయని అంచనా వేయొచ్చు. ఈ సినిమా మొత్తం హరీష్ శంకర్ మార్క్‌తో, పవన్ కళ్యాణ్ మాస్ ఇమేజ్‌ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ‘గబ్బర్ సింగ్’ ఇచ్చిన ఊపు కంటే ఈసారి రెట్టింపు విజయాన్ని ఆశిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఈ ‘దేఖ్ లేంగే సాలా’ సాంగ్ టీజర్‌గా పనిచేసిందనే చెప్పాలి.



