Rajamouli: : మహేష్ విషయంలో రాజమౌళి అలా ప్లాన్ చేశారా?

Rajamouli:సూపర్‌స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) , దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ మూవీ SSMB29పై ఫ్యాన్స్‌లో, మూవీ లవర్స్‌లో అంచనాలు ఇప్పటికే పీక్స్‌కు చేరుకున్నాయి.

Rajamouli:సూపర్‌స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) , దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ మూవీ SSMB29పై ఫ్యాన్స్‌లో, మూవీ లవర్స్‌లో అంచనాలు ఇప్పటికే పీక్స్‌కు చేరుకున్నాయి. ఇటీవల రాజమౌళి చాలా కూల్‌గా కనిపిస్తుండటంతో, ఈ భారీ ప్రాజెక్ట్ షూటింగ్ ఎంతవరకు వచ్చిందో, ఎక్కడ జరుగుతోందో అని మహేష్ ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. ఇలాంటి సమయంలో ఓ స్వీట్ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

Rajamouli

జక్కన్న పెర్ఫెక్షన్ అడుగడుగునా విజువల్ వండరే..
ఇన్‌సైడ్ టాక్ ప్రకారం, రాజమౌళి(Rajamouli) ప్రస్తుతం మూవీలోని కీలకమైన సీన్స్‌ను మరింత బాగా తీయడానికి, మాడిఫై చేయడంలో నిమగ్నమై ఉన్నారట. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి చిత్రాలతో పోటీపడేలా, హాలీవుడ్ స్థాయి (Hollywood level) ప్రమాణాలతో రూపొందుతోంది కాబట్టి, రాజమౌళి ప్రతి ఒక్క విజువల్‌ను, ప్రతి ఫ్రేమ్‌ను పెర్ఫెక్ట్‌గా మలచడానికి అపారమైన సమయం తీసుకుంటున్నారని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. తన గత చిత్రాలతో సాధించిన మెగా సక్సెస్‌లు, వరల్డ్ వైడ్‌గా పొందిన ప్రశంసల వల్ల.. రాజమౌళి నుంచి వస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై పెర్ఫెక్షన్ విషయంలో అస్సలు రాజీపడటం లేదని తెలుస్తోంది. అందుకే ఈ మూవీపై ఎక్స్‌పెక్టేషన్స్ ఆకాశాన్ని దాటిపోయాయి.

మహేష్ బాబు సరికొత్త లుక్, డ్యాన్స్ హైలైట్స్..
మహేష్ బాబు కూడా ఈ మూవీ కోసం తన ఫిట్‌నెస్ విషయంలో ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారని, పూర్తిగా సరికొత్త లుక్‌లో కనిపించనున్నారని సమాచారం. కేవలం ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ మాత్రమే కాకుండా, ఈ మూవీలో ఒక అద్భుతమైన, కీలకమైన డ్యాన్స్ సీక్వెన్స్ కోసం మహేష్ రిహార్సల్స్‌లో పూర్తిగా నిమగ్నమై ఉన్నారని అంటున్నారు. ఈ డ్యాన్స్ సీక్వెన్స్ అభిమానులను మెస్మరైజ్ చేయడమే కాకుండా, వారి అంచనాలకు అందని విధంగా ఉంటుందని, గత మూవీస్‌లోని ప్రిన్స్ మహేష్ డ్యాన్స్‌కు ఇది ఒక సరికొత్త లెవెల్ అని చెబుతున్నారు. SSMB29 కేవలం తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలకే పరిమితం కాకుండా, ప్రపంచ ప్రేక్షకులందర మనసులను గెలుచుకునేలా రూపొందుతోంది.

వెయ్యి కోట్ల బడ్జెట్, అడ్వెంచర్ థ్రిల్లర్.. బర్త్‌డే కానుకగా గ్లింప్స్ ..

ఈ మూవీ బడ్జెట్ దాదాపు వెయ్యి కోట్ల రూపాయల వరకు ఉంటుందని, ప్రపంచ సినిమా చరిత్రలో ఇది ఒక భారీ ప్రాజెక్ట్‌గా నిలవనుందని ప్రచారం జరుగుతోంది. హాలీవుడ్ యాక్టర్స్ , టెక్నీషియన్స్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కానున్నారని న్యూస్ వస్తున్నాయి. కథాంశం ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ గా సాగుతుందని, అడవుల్లో ఎక్కువ భాగం షూటింగ్ జరుగుతుందని తెలుస్తోంది. నిజానికి ఆఫ్రికాలోని కెన్యాలో ఒక షెడ్యూల్ ప్లాన్ చేసినప్పటికీ, అక్కడ నెలకొన్న లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వల్ల ఆ షెడ్యూల్ క్యాన్సిల్ అయిందట.

అయితే, ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గుడ్ న్యూస్ ఏమిటంటే… మన సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్‌డే సందర్భంగా, ఆగస్టు 9న SSMB29 నుంచి ఒక అద్భుతమైన గ్లింప్స్ రిలీజ్ కానుందని ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. దీంతో మహేష్ ఫ్యాన్స్‌లో యాంగ్జైయిటీని మరింత రెట్టింపు చేసింది ఈ న్యూస్. ఇక ఎప్పుడెప్పుడు ఆగస్టు 9 వస్తుందా అని వారంతా తెగ వెయిట్ చేస్తున్నారు.

 

Exit mobile version