Mana Shankara Varaprasad Garu
టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి మేనియా మరోసారి శిఖరాగ్రానికి చేరింది. సంక్రాంతి కానుకగా విడుదలైన మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankara Varaprasad Garuసినిమా కలెక్షన్ల వేటలో అజేయంగా దూసుకుపోతోంది. అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ కు చిరంజీవి గ్రేస్ జత కట్టడంతో ఇప్పటికీ థియేటర్ల వద్ద కాసుల వర్షం కురుస్తోంది.తాజాగా ఈ మూవీ సాధించిన వసూళ్లు టాలీవుడ్ రీజనల్ సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డును క్రియేట్ చేశాయి.
బాహుబలి, పుష్ప, సలార్ వంటి హెవీ బడ్జెట్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యి భారీ వసూళ్లను సాధించాయి. కానీ, కేవలం ఒకే ఒక్క భాషలో ..తెలుగులో విడుదలయ్యి రూ. 375 కోట్ల గ్రాస్ వసూలు చేయడం అనేది టాలీవుడ్ హిస్టరీలో ఒక సంచలనం. ఇప్పటివరకు ఈ రికార్డ్ రూ. 303 కోట్లతో సంక్రాంతికి వస్తున్నాం సినిమా పేరుతో ఉండగా, దానిని చిరంజీవి చాలా ఈజీగా క్రాస్ చేసి, రీజనల్ సినిమాల్లో ‘అన్ డిస్ప్యూటెడ్ కింగ్’ అని నిరూపించుకున్నారు.
సినిమా విడుదలైన ఫస్ట్ రోజే ఏకంగా రూ. 84 కోట్ల గ్రాస్ వసూలు చేసి చిరు కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ గా నిలిచింది.
కేవలం ఏడు రోజుల్లోనే రూ. 300 కోట్ల క్లబ్ లో చేరిన ఈ సినిమా, 25వ రోజు నాటికి రూ. 375 కోట్ల మైలురాయిని చేరుకుంది.
ఈ మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankara Varaprasad Garu)సినిమా థియేట్రికల్ బిజినెస్ దాదాపు రూ. 120 కోట్లు జరగగా, బ్రేక్ ఈవెన్ మార్కును ఎప్పుడో దాటేసి సుమారు రూ. 130 కోట్లకు పైగా లాభాలను నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు తెచ్చిపెట్టింది.
డైరక్టర్ అనిల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవిలోని వింటేజ్ కామెడీ టైమింగ్‌ను , మాస్ ఎనర్జీని పక్కాగా వాడుకోవడంలో సక్సెస్ అయ్యారు. సినిమా చూసిన అభిమానులకు మన శంకర వరప్రసాద్ గారులో పాత చిరంజీవి కనిపించడంతో ఏజ్‌తో సంబంధం లేకుండా వస్తున్న ఆడియన్స్‌తో థియేటర్లు హౌస్‌ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో కూడా మరే ఇతర పెద్ద సినిమాలు లేకపోవడం ఈ సినిమాకు మరీ ప్లస్ అయ్యింది.
మొత్తానికి, ‘బాస్ ఈజ్ బ్యాక్’ అంటూ మెగా అభిమానులు కాలర్ ఎగరేసుకునే స్థాయిలో ఈ రికార్డును చిరంజీవి తన ఖాతాలో వేసుకున్నారు. అంతేకాదు ఈ రికార్డును ఇప్పట్లో మరే రీజనల్ సినిమా టచ్ చేయడం కూడా అసాధ్యమని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.
Valentine Day : వాలెంటైన్స్ డేను చాలామంది ఎందుకు వ్యతిరేకిస్తారు?
