Pawan Kalyan : వైజాగ్‌తో పవన్‌ అనుబంధం ఆనాటిదా?

Pawan Kalyan : వైజాగ్‌లో 'హరిహర వీరమల్లు' ప్రీ-రిలీజ్ ఈవెంట్ (Pre-release Event)అభిమానుల మాస్ సెలబ్రేషన్స్ మధ్య అట్టహాసంగా జరిగింది.

Pawan Kalyan: వైజాగ్‌లో ‘హరిహర వీరమల్లు’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ (Pre-release Event)అభిమానుల మాస్ సెలబ్రేషన్స్ మధ్య అట్టహాసంగా జరిగింది. రేపు, జూలై 24న విడుదల కానున్న ఈ హిస్టారికల్ మూవీపై ఇప్పటికే భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్ యాక్టింగ్ గురువు, తనను తీర్చిదిద్దిన సత్యానంద్ గెస్ట్‌గా రావడం ఒక అన్‌ఫర్గెట్టబుల్ మూమెంట్ అని చెబుతూ పవన్ సెంటిమెంట్‌గా ఫీలయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాటలు కేవలం ఒక స్పీచ్ కాదు, తన లైఫ్ జర్నీ.ని, ఫేస్ చేసిన ఛాలెంజెస్‌ని, అందుకున్న ఆత్మీయతను కళ్ళకు కట్టినట్లు చూపించే భావోద్వేగాల ప్రవాహం అని పవన్ ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు.

Pawan Kalyan

“నేను ప్రభుత్వ ఉద్యోగి కొడుకును కదా… మా నాన్నకు ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉండేది కాబట్టి అన్ని ఊళ్లు తిరిగేవాడిని అంటూ తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు పవన్. అన్నయ్య చిరంజీవి సినీ రంగంలోకి వచ్చాక, తాను ఇంట్లోనే ఉండేవాడినని, అలాంటి తనను అన్నయ్య చిరంజీవి స్వయంగా సత్యానంద్ వద్దకు వైజాగ్ పంపించి యాక్టింగ్ ట్రైనింగ్ ఇప్పించారని గుర్తు చేసుకున్నారు. ఉత్తరాంధ్ర ఆటపాట సత్యానంద్ గారు నా గుండెల్లో నింపేశారు,” అంటూ తన గురువు పట్ల కృతజ్ఞత చాటుకున్నారు.

వైజాగ్‌తో తనకున్న స్పెషల్ కనెక్షన్‌ని పవన్ కళ్యాణ్ ఎమోషనల్‌గా వివరించారు. “ఇదే నోవాటెల్‌లో రెండేళ్ల క్రితం నేను బయటకు రాకూడదని అప్పటి పోలీసులు నన్ను ఆపారు, అరెస్ట్ చేయాలని చూశారు. అలాంటప్పుడు వైజాగ్ అంతా హోటల్ ముందు నా కోసం కూర్చుంది. అందుకే నా వైజాగ్ కోసం ఇక్కడ ఈ ఈవెంట్ పెట్టాలనుకున్నా,” అంటూ అభిమానుల పట్ల తనకున్న ప్రేమను చాటారు. తమ సినిమా టికెట్ రేట్లు తక్కువ పెట్టినా, అద్భుత విజయాన్ని అందించిన అభిమానులకు ప్రత్యేక ధన్యావాదాలు చెప్పారు.

‘హరిహర వీరమల్లు'(Hari Hara Veera Mallu) టికెట్ రేట్లు పెంచడానికి తన వద్దకు వచ్చినప్పుడు, సినిమాటోగ్రఫీ శాఖ జనసేన వద్ద ఉన్నా తనకు సంబంధం లేదని, సీఎం గారి దగ్గరకు వెళ్లి అనుమతి తీసుకోమని క్లియర్‌గా చెప్పారు. “ఆయన ఇస్తే తీసుకోండి అని చెప్పానంటూ తన కమిట్‌మెంట్‌ని తెలియజేశారు. నారా లోకేష్ ‘పవన్ అన్న సినిమా హిట్ అవ్వాలి’ అని ట్వీట్ చేసినందుకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. రాజకీయ భేదాలు పక్కన పెట్టి సినీ రంగం పట్ల ఆయన చూపిన రెస్పెక్ట్‌ని అప్రిషియేట్ చేశారు.

తన ప్రమోషన్స్ గురించి మాట్లాడిన పవన్..మొదట్లో ఎక్కువ ప్రమోషన్స్ చేసేవాడిని కాదని.. ప్రమోషన్స్ లేకుండానే తన సినిమాలు సక్సెస్ అయ్యాయని చెప్పారు.అదే అలవాటైపోయిందని.. అందుకే మీడియాకు దూరంగా ఉన్నానంటూ ఓపెన్‌గా చెప్పారు. తన అభిమానుల డెడికేషన్‌పై ఆయనకున్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ, “నా సినిమాకు రండి అని నేను అడగలేను. నేను అడగకపోయినా మీరు వస్తారని అన్నారు. చిరంజీవి తనను “నువ్వేం చేస్తావు?” అని అడిగినప్పుడు, “బతకాలని ఉంది” అని చెప్పాలనుకున్నానని, కానీ అన్నయ్య కొడతాడని ఏం మాట్లాడలేదని ఆనాటి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

అంతేకాదు సత్యానంద్ తనను ఎంతలా తీర్చిదిద్దారో పవన్ అందరి ముందూ వివరించారు. చెన్నైలో నెల రోజుల ట్రైనింగ్ సరిపోవడం లేదని అర్థం చేసుకున్న చిరంజీవి, సత్యానంద్‌తో మాట్లాడి తనను వైజాగ్ తీసుకొచ్చారని పవన్ తెలిపారు. “సత్యానంద్ గారు మెల్లిగా అన్ని నేర్పించారు. నాకు ధైర్యం నేర్పించారు. నాకు జీవిత పాఠాలు నేర్పించారు. భీమిలిలో మాకు తెలిసిన వాళ్ల గెస్ట్ హౌస్‌లో యాక్టింగ్ నేర్చుకున్నానంటూ తన గురువుతో మరోసారి గ్రాటిట్యూడ్ చూపించారు.

తన సినీ ప్రస్థానంలో అన్నయ్య చిరంజీవి, వదిన సురేఖల సపోర్ట్ ఎప్పటికీ మరువలేనిదని పవన్ ఎమోషనల్‌గా చెప్పారు. “నన్ను నమ్మింది మా అన్నయ్య, వదిన. అందుకే గెలిచాక వెళ్లి వాళ్ళ కాళ్లకు నమస్కరించాను,” అంటూ కాస్త ఎమోషనల్ అవుతూ చెప్పారు పవన్. అలాగే ఏ.ఎం. రత్నం, డైరెక్టర్ క్రిష్ 2019లో ఈ స్టోరీని తనకు చెప్పారని, అయితే కరోనా, రాజకీయ పరిస్థితుల వల్ల ఆ మూవీ పోస్ట్‌పోన్ అయిందని తెలిపారు. అందుకే ఈ సినిమా కోసం ఎంత హార్డ్ వర్క్ చేశానో, నిలబడి పని చేశానని పవన్ చెప్పుకొచ్చారు. తన పొలిటికల్ రెస్పాన్సిబిలిటీస్‌ని ఏ మాత్రం నెగ్లెక్ట్ చేయకుండానే సినిమాలు చేశానని, “ఎక్కడా నేను తీసుకున్న శాఖలకు ఇబ్బంది లేకుండా నేను సినిమాలు చేశానని పవన్ అన్నారు.

మొత్తంగా ఈ స్పీచ్‌ … ‘హరిహర వీరమల్లు’పై ఎక్స్‌పెక్టేషన్స్‌ని మరింత పెంచడమే కాకుండా, పవన్ కళ్యాణ్ పర్సనాలిటీని మరోసారి అభిమానుల హృదయాల్లో నిలిపింది.

 

Exit mobile version