Janhvi Kapoor:బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ జాన్వీ కపూర్ తన ఫెంటాస్టిక్ స్టైల్‌తో మరోసారి అందరినీ ఆకట్టుకుంది. వింబుల్డన్ 2025 సెమీ-ఫైనల్ మ్యాచ్‌ను చూడటానికి లండన్‌లోని ప్రఖ్యాత ఆల్ ఇంగ్లండ్ లాన్ టెన్నిస్ అండ్ క్రోకెట్ క్లబ్‌కు వచ్చిన జాన్వీ, మియు మియు (Miu Miu) డిజైనర్ డ్రెస్‌లో మెరిసిపోయింది. ఆమె తన రూమర్డ్ పార్ట్‌నర్ శిఖర్ పహారియాతో కలిసి ఈ ప్రెస్టీజియస్ ఈవెంట్‌కు వచ్చింది.
ఫ్యాషన్ క్వీన్ జాన్వీ..
జూలై 11, 2025 శుక్రవారం 28 ఏళ్ల జాన్వీ కపూర్ కార్లోస్ అల్కరాజ్, టేలర్ ఫ్రిట్జ్ మధ్య జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్‌ను చూడటానికి స్టైలిష్ లుక్‌తో అడుగుపెట్టింది. ఈ బ్యూటీ వేసుకున్న కస్టమ్ చెక్కర్డ్ మిడి డ్రెస్ డిజైనర్ లేబుల్ మియు మియు డ్రెస్‌లో… సన్నని స్ట్రాప్స్‌తో, కాస్త బోల్డ్‌గా కనిపించే నెక్ లైన్‌తో జాన్వీ రాజకుమారిలా మెరిసిపోయింది. రిస్క్ నెక్ లైన్ ఉన్నా కూడా.. జాన్వీ కాన్ఫిడెంట్‌తో వేసుకున్న ఈ డ్రస్ ఫ్యాషన్ సెన్స్ ను మరోసారి అందరికీ చెప్పకనే చెప్పింది. నేవీ బ్లూ, వైట్ కలర్స్ మిక్స్ అయిన టెక్స్‌చర్లు ఆమె అవుట్‌ఫిట్‌కు ఇంకా ఎట్రాక్టివ్ లుక్‌ను తీసుకువచ్చాయి.
ఫ్లోరల్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ డ్రెస్‌తో మెస్మరైజ్ లుక్..
జాన్వీ డ్రెస్ ఆమె బాడీకి ఫెర్ఫక్ట్ లుక్‌ని తీసుకువచ్చి సన్నని నడుము భాగాన్ని హైలైట్ చేసింది. ఇది జాన్వీ నాజూకైన రూపాన్ని ప్రదర్శించింది. డ్రెస్ నెక్ లైన్ వెంబడి ఉన్న ఫ్లోరల్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ డ్రెస్ కు మరింత అందాన్నిచ్చింది. ఆకర్షణీయమైన పసుపు రంగులో అత్యంత టెక్నిక్‌తో నేసిన ఈ మేకప్.. జాన్వీ రూపానికి వింటేజ్ ఫ్లెయిర్‌తో ఉండటంతో జాన్వీని మరింత అందంగా,ఫ్యాషన్-ఫార్వర్డ్‌గా చూపించాయంటూ ఆమె ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.
సింపుల్ యాక్సెసరీస్, అరిస్టోక్రాటిక్ వైబ్
మియు మియు సిల్హౌట్ అందరి దృష్టినీ ఆకర్షించడానికి జాన్వీ కపూర్ యాక్సెసరీస్ కూడా రీజనే. నల్లటి స్టడ్స్, వాటికి సీక్వెన్డ్ గోల్డెన్ బోర్డర్స్ ఆమె స్టైలిష్ అప్పీల్ ను మరింత పెంచాయి. కూల్ డార్క్ షేడ్స్ జాన్వీ స్ట్రక్చర్‌కు ఒక అరిస్టోక్రాటిక్ వైబ్‌ను తీసుకొచ్చాయి. మొత్తంగా వింబుల్డన్ లాంటి ప్రెస్టీజియస్ గేమ్‌కు అవి పర్ఫెక్ట్ గా సరిపోయాయి. వింబుల్డన్‌లో జాన్వీ కపూర్ ఈ ఫ్యాషన్ లుక్, ఆమె స్టైల్ అక్కడి వారిని మెస్మరైజ్ చేసింది. మొత్తంగా శ్రీదేవి కూతురుగా అమ్మను ఫాలో అవుతూ ప్రతీసారి తన అవుట్‌ఫిట్‌తో ఫ్యాన్స్‌ను ఫిదా చేసేస్తోంది జాన్వీ.