Just NationalJust InternationalLatest News

Passport Rules: పాస్‌పోర్ట్ రూల్స్ మారాయ్..దేనికేసం ఈ కొత్త రూల్స్? ఎప్పటి నుంచి అమలులోకి?

Passport Rules: మీ అడ్రస్ ప్రూఫ్, ఐడి ప్రూఫ్‌లలో ఒక్క అక్షరం తప్పున్నా పాస్ పోర్ట్ అప్లికేషన్ రిజక్ట్ అవుతుంది.

Passport Rules

కేంద్ర ప్రభుత్వం భారతీయ పాస్‌పోర్ట్ జారీ ప్రక్రియలో అతిపెద్ద సంస్కరణకు తెరలేపింది. దరఖాస్తుదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఇకపై తొలగిస్తూ,ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తూ సరికొత్త నిబంధనలను ఆవిష్కరించింది. ఈ పాస్ పోర్ట్ రూల్స్ (Passport Rules) ముఖ్యంగా డిజిటలైజేషన్, సేఫ్టీ, వేగవంతమైన ధృవీకరణపై దృష్టి సారించాయి.
అంతేకాదు ఇకపై మీరు జిరాక్స్ కాపీల కట్టలను పట్టుకుని పాస్‌పోర్ట్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.

పేపర్ వర్క్ కి చెక్.. డిజిటల్ డాక్యుమెంట్లకే ప్రాధాన్యత..

సెల్ఫ్ డిక్లరేషన్ (Self-Declaration).. గతంలోలాగా గెజిటెడ్ ఆఫీసర్లతో అటెస్టేషన్ చేయించాల్సిన అవసరం ఇకపై లేదు. దరఖాస్తుదారుడే స్వయంగా ధృవీకరిస్తూ సైన్ చేస్తే సరిపోతుంది.
పుట్టిన తేదీ ధృవీకరణ (DOB Proof).. గతంలో కంపల్సరీగా మున్సిపల్ బర్త్ సర్టిఫికేట్ అడిగేవారు. ఇప్పుడు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్,డ్రైవింగ్ లైసెన్స్, ఎలక్షన్ కార్డ్ చివరకు స్కూల్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (TC) వంటి పత్రాలను కూడా పుట్టిన తేదీకి ఆధారంగా ఆమోదిస్తారు.
పెళ్లైన మహిళలకు వెసులుబాటు.. వివాహానంతరం పేరు మార్చుకున్న వారు మ్యారేజ్ సర్టిఫికేట్ సమర్పించాల్సిన అవసరం లేదు. దీని కోసం ప్రత్యేక అఫిడవిట్లను కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది.
తక్కువ డాక్యుమెంట్లు.. దరఖాస్తుదారులు సమర్పించాల్సిన పత్రాల సంఖ్యను తగ్గించారు. సాధ్యమైనంత వరకు ప్రభుత్వ డేటాబేస్ నుంచే మీ వివరాలను నేరుగా సేకరిస్తారు.

పోలీసు వెరిఫికేషన్‌లో కొత్త పద్ధతులు..

mPassport Police App.. పోలీసులకు ప్రత్యేక యాప్ ఇవ్వడం ద్వారా వాళ్లు మీ ఇంటికి వచ్చినప్పుడు బయోమెట్రిక్ వివరాలను అక్కడికక్కడే అప్‌లోడ్ చేసేస్తారు.
నో వెరిఫికేషన్ (కొన్ని కేసుల్లో).. మీరు ప్రభుత్వ ఉద్యోగులై ఉండీ లేదా ఇప్పటికే పాస్‌పోర్ట్ ఉండి ‘రీ-ఇష్యూ’ కోసం
పోస్ట్-ఇష్యూ వెరిఫికేషన్.. కొన్ని అత్యవసర కేసుల్లో పాస్‌పోర్ట్ ముందుగా జారీ చేసి, ఆ తర్వాత పోలీసు ధృవీకరణ చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు.

డిజిటల్ లాకర్ (DigiLocker) వాడకం.. ఈ కొత్త రూల్స్ ప్రకారం, ఒరిజినల్ డాక్యుమెంట్లను డిజిలాకర్‌లో భద్రపరుచుకుంటే, పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో మళ్లీ ఫిజికల్ డాక్యుమెంట్లు చూపించాల్సిన పని ఉండదు. సిస్టమ్ డైరక్టుగా డిజిలాకర్ నుంచి వాటిని వెరిఫై చేస్తుంది.

మైనర్లకు స్పెషల్ రూల్స్ ..

సింగిల్ పేరెంట్.. తల్లి కానీ తండ్రి కానీ ఎవరో ఒకరు మాత్రమే ఉన్నా, అఫిడవిట్ (Annexure-C) సమర్పిస్తే మైనర్లకు పాస్‌పోర్ట్ జారీ చేస్తారు.
దత్తత తీసుకున్న పిల్లల విషయంలో అయితే ‘అడాప్షన్ డీడ్’ లేకపోయినా, సంబంధిత పత్రాలతో ప్రాసెస్ సులభతరం చేశారు.

Passport Rules
Passport Rules

పాస్‌పోర్ట్ మొబైల్ వ్యాన్ (Mobile Van).. పాస్‌పోర్ట్ ఆఫీసులు లేని మారుమూల ప్రాంతాల కోసం మొబైల్ వ్యాన్ సేవలను ప్రభుత్వం విస్తరిస్తోంది. ఇది గ్రామీణ ప్రాంత దరఖాస్తుదారులకు పెద్ద వరం అనే చెప్పాలి.

రియల్ టైమ్ ట్రాకింగ్.. అంతేకాకుండా మీ పాస్‌పోర్ట్ ఏ స్టేజ్ లో ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

ఇ-పాస్‌పోర్ట్ (e-Passport) యుగం..కొత్తగా జారీ చేసే పాస్‌పోర్ట్‌లన్నీ లేటెస్ట్ వెర్షన్‌లో ‘చిప్’ (Embedded Chip) తో వస్తాయి. దీనిలో మీ బయోమెట్రిక్ వివరాలన్నీ భద్రంగా ఉంటాయి. దీనివల్ల ఎయిర్‌పోర్టుల్లో ఇమ్మిగ్రేషన్ చెకింగ్స్ చాలా వేగంగా పూర్తవుతాయి.

ఈ కొత్త పాస్ పోర్ట్ రూల్స్(Passport Rules) ఫిబ్రవరి 15, 2026 నుంచి అమలవుతాయి.అయితే మీ అడ్రస్ ప్రూఫ్, ఐడి ప్రూఫ్‌లలో ఒక్క అక్షరం తప్పున్నా అప్లికేషన్ రిజక్ట్ అవుతుంది. కాబట్టి ఆన్‌లైన్‌లో ఫారమ్ నింపేటప్పుడు ఆధార్‌లో ఉన్న విధంగానే వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోండి.

అయితే మీరు ఫారమ్ నింపేటప్పుడే తప్పులుంటే మాత్రం సిస్టమ్ ముందే హెచ్చరిస్తుంది. దీనివల్ల రిజక్షన్ అయ్యే అవకాశాలు దాదాపు తగ్గుతాయనే చెప్పాలి.

Valentine Day : వాలెంటైన్స్ డేను చాలామంది ఎందుకు వ్యతిరేకిస్తారు?

Related Articles

Back to top button