Ram Charan :ఎన్టీఆర్ కాదు.. లైన్లోకి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. డైరెక్టర్ నెల్సన్ కుమార్ మాస్టర్ ప్లాన్ ఇదే

Ram Charan : జైలర్ 2' తర్వాత దర్శకుడు నెల్సన్ కుమార్ టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో ఒక పవర్ ఫుల్ సినిమా చేయడానికి సిద్ధమయ్యారు.

Ram Charan

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో కోసం అనుకున్న కథను వేరే హీరోతో చేయడం లేదా డేట్స్ సెట్ అవక ప్రాజెక్టులు మారడం సర్వసాధారణం. ఇప్పుడు సరిగ్గా అలాంటి పరిస్థితిలోనే ఉన్నారట సంచలన దర్శకుడు నెల్సన్ కుమార్. సూపర్ స్టార్ రజినీకాంత్‌తో ‘జైలర్’ సినిమా తీసి ఏ రేంజ్ విజయాన్ని అందుకున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలా సింపుల్ కథతో అద్భుతమైన ఎలివేషన్స్‌తో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.700 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ప్రస్తుతం నెల్సన్ ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జైలర్ 2’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు, ఇది వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది.

ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ఆలస్యం కావడానికి కారణం.. ‘జైలర్ 2’ తర్వాత దర్శకుడు నెల్సన్ కుమార్ టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో ఒక పవర్ ఫుల్ సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మాత నాగ వంశీ నిర్మించనున్నారని, దీనిపై హీరో, నిర్మాత ఇద్దరూ అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న ‘డ్రాగన్’ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే నెల్సన్ ప్రాజెక్ట్ మొదలవుతుందని అంతా ఆశించారు.

కానీ, తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్-నెల్సన్ సినిమా ఇంకా ఆలస్యం అయ్యేలా ఉంది. దీనికి ప్రధాన కారణం, ఎన్టీఆర్ చేస్తున్న ‘డ్రాగన్’ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుండటమే. ఇప్పటివరకు జరిగిన షూటింగ్‌లో వచ్చిన అవుట్‌పుట్ పట్ల ఎన్టీఆర్ సంతృప్తిగా లేరట. దీంతో ఆ సీన్స్‌లో చాలావరకు మళ్లీ రీ-షూట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనివల్ల నెల్సన్ కోసం ఇచ్చిన డేట్స్ మరింత ఆలస్యమయ్యే పరిస్థితి ఏర్పడింది.

Ram Charan

లైన్లోకి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. ఎన్టీఆర్ డేట్స్ ఆలస్యం అవుతుండటంతో, దర్శకుడు నెల్సన్ కుమార్ సమయాన్ని వృథా చేయకుండా తన దృష్టిని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌పై మళ్లించారట. ఎన్టీఆర్ సినిమాను ప్రస్తుతానికి పక్కన పెట్టేసి, రామ్ చరణ్‌తో త్వరగా సినిమా పూర్తి చేయాలనేది నెల్సన్ మాస్టర్ ప్లాన్. దీనికి సంబంధించి నెల్సన్ ఇప్పటికే రామ్ చరణ్‌ను కలిసి కథను కూడా వినిపించారని, చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

రామ్ చరణ్(Ram Charan) ప్రస్తుతం డైరెక్టర్ బుచ్చి బాబు సనాతో ‘పెద్ది’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ ‘పెద్ది’ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే నెల్సన్ సినిమా మొదలుకానుందట. ఓవైపు సుకుమార్ సినిమా షూటింగ్‌లో పాల్గొంటూనే, మరోవైపు నెల్సన్ సినిమాను కూడా త్వరగా కంప్లీట్ చేయాలని రామ్ చరణ్(Ram Charan) ప్లాన్ వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మెగా కాంబినేషన్ ప్రాజెక్టుపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. నెల్సన్ తన ట్రేడ్‌మార్క్ డార్క్ కామెడీ , యాక్షన్ స్టైల్‌ను చరణ్‌తో ఎలా మిక్స్ చేస్తారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version