March 26: మార్చ్ 26 రేసులోకి పవర్ స్టార్..వెనక్కి తగ్గిన రామ్ చరణ్

March 26: చిత్ర యూనిట్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను మార్చి 26నే విడుదల చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

March 26

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వచ్చే ఏడాది మార్చి నెలలో ఒక ఆసక్తికరమైన యుద్ధం జరగబోతోంది. మొదటగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాను 2026 మార్చి 26(March 26)న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

దీనికి తోడు నేచురల్ స్టార్ నాని నటిస్తున్న పారడైజ్ సినిమాను కూడా అదే రోజు(March 26)న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించడంతో, బాక్సాఫీస్ దగ్గర చరణ్ వర్సెస్ నాని పోటీ తప్పదని అందరూ భావించారు. కానీ ఇప్పుడు సీన్ లోకి అనూహ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రవేశించారు.

హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా మొదలైనప్పుడు ఇది రీమేక్ అనే ఉద్దేశంతో ఫ్యాన్స్ లో పెద్దగా ఆసక్తి లేదు. కానీ దర్శకుడు హరీష్ శంకర్ ఇది రీమేక్ కాదని, పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్ కు తగ్గట్టుగా కొత్తగా రాసుకున్న కథ అని చెప్పడంతో హైప్ పెరిగింది.

March 26

రీసెంట్ గా రిలీజ్ అయిన ఒక సాంగ్ లో పవన్ వేసిన డ్యాన్స్ చూసి అభిమానులు పూనకాలతో ఊగిపోతున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. చిత్ర యూనిట్ ఈ సినిమాను మార్చి 26(March 26)నే విడుదల చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

పెద్ది , పారడైజ్ సినిమాలతో పోలిస్తే ఉస్తాద్ భగత్ సింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. మిగిలిన రెండు సినిమాలు ఇంకా షూటింగ్ దశలోనే ఉండటంతో, పవన్ కళ్యాణ్ సినిమా అదే తేదీకి రావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. టాలీవుడ్ లో ఒక ఆనవాయితీ ఉంది, బాబాయ్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే రామ్ చరణ్ తన సినిమాను కచ్చితంగా వాయిదా వేసుకుంటారు.

అలాగే నాని పారడైజ్ కూడా పవన్ లాంటి మాస్ హీరోతో పోటీకి వెళ్లడం కంటే వేసవి సెలవుల్లో ఏప్రిల్ లేదా మే నెలలో రిలీజ్ అవ్వడమే మంచిదని భావిస్తున్నారట. ఓజీ సినిమాతో ఆల్రెడీ హిట్ ట్రాక్ లో ఉన్న పవన్, ఇప్పుడు ఉస్తాద్ తో మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు.

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version