Tina: విక్రమ్ నుంచి వెబ్ సిరీస్ వరకూ టినా యాత్ర

Tina: ఏజెంట్ టినా తిరిగి వస్తోంది – LCUలో కుమ్మేస్తున్న సరికొత్త వెబ్ సిరీస్

Tina

విక్రమ్(Vikram ) సినిమాలో కేవలం కొన్ని నిమిషాలే కనిపించినప్పటికీ టామ్ అండ్ ఫైట్తో ప్రేక్షకులను షాక్కు గురి చేసిన ఏజెంట్ టినా . .ఇప్పుడు తానే ఓ కథ, తానే ఓ యూనివర్స్‌గా మారుతోంది. లోకేష్ కనగరాజ్ అధికారికంగా చెప్పినట్లే.. టినా బాలీవుడ్ స్పై జోన్లోకి ఎంట్రీ ఇచ్చే సమయం దగ్గర పడుతోంది.

ఈ సిరీస్ లో టినా (Tina)ఎవరు? ఆమెకు అంతపెద్ద శక్తి ఎలా వచ్చింది? విక్రమ్ వరకు ఆమె జర్నీ ఎలానే సాగిందో తెలుసుకోవాలంటే – మీరు ఈ వెబ్ సిరీస్ను తప్పకుండా చూడాలని లోకేష్ హింట్ ఇచ్చారు.

Tina

ఇది మామూలు స్పిన్-ఆఫ్ కాదు ఒక సీక్రెట్ మిషన్.నైట్ ఆపరేషన్లు, ఇంటెలిజెన్స్ ప్లానింగ్, టెరరిస్ట్ల అణచివేత, కోడ్ నేమ్లు – ప్రతి ఎపిసోడ్ ఒక మినీ యాక్షన్ థ్రిల్లర్లా ఉండేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. LCUలో ఇదివరకూ మనం చూసిన యాక్షన్ కన్నా ఇది ఇంకో స్థాయి యాక్షన్ అనుకోవచ్చు.

క్రేజీ కలబోన్లు – LCUని విస్తరించేందుకు మల్టీ డైరెక్టర్ ఫార్మట్‌కు రెడీ అవుతున్నారు. లోకేష్ కొత్త దర్శకుడికి అవకాశం ఇవ్వడమే కాకుండా, యూనివర్స్‌లో కొత్త కథలను విస్తరించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇది ఇండియన్ సినెమాటిక్ యూనివర్స్‌లో ఓ గేమ్ ఛేంజర్ కావొచ్చని సినీ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు.

 

Exit mobile version