Varanasi glimpses: వారణాసి గ్లింప్స్ సంచలనం.. రుద్ర’ అవతారంలో మహేష్.. SSMB29 కథాంశంపై ఉత్కంఠ!

Varanasi glimpses : డైరక్టర్ రాజమౌళి స్వయంగా చెప్పినట్లుగా, మహేష్ బాబు పాత్రలో శ్రీరాముడి ఛాయలు ఉన్నా కూడా.. స్టోరీ లైన్ కథాంశం కేవలం ఒకే దైవ అంశానికి పరిమితం కావడం లేదు.

Varanasi glimpses

రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న భారీ చిత్రం ‘వారణాసి(Varanasi)’ టైటిల్ లాంచ్ ఈవెంట్ సినీ ప్రపంచంలోనే అతిపెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. రామోజీ ఫిలిం సిటీలో ఘనంగా జరిగిన ఈ వేడుకలో విడుదలైన గ్లింప్స్ (Glimpse).. ఇది కేవలం ఒక సినిమా కాదు, భారతీయ ఇతిహాసాలలోని అత్యంత శక్తివంతమైన రెండు దైవ అంశాల మిక్స్ అనే విషయాన్ని చెప్పేసింది. .

డైరక్టర్ రాజమౌళి స్వయంగా చెప్పినట్లుగా, మహేష్ బాబు పాత్రలో శ్రీరాముడి ఛాయలు ఉన్నా కూడా.. స్టోరీ లైన్ కథాంశం కేవలం ఒకే దైవ అంశానికి పరిమితం కావడం లేదు. సినిమా(Varanasi)లో హీరో తన ధర్మాన్ని, న్యాయాన్ని నిలబెట్టడానికి చేసే పోరాటంలో ‘రాముడి’ లక్షణాలను చూపిస్తాడని తెలుస్తోంది. గ్లింప్స్‌లో సూచించిన రామ-రావణ యుద్ధం ప్రస్తావన ఈ ‘ధర్మం’ కోణాన్ని బలంగా సూచిస్తుంది.

Varanasi

అయితే, మహేష్ పాత్ర పేరురుద్రకావడం , కథా నేపథ్యం వారణాసి (శివుడి నివాసం) చుట్టూ తిరగడం కథకు ఒక ఊహించని మలుపు. గ్లింప్స్ చివర్లో మహేష్ త్రిశూలం పట్టుకుని, నందిపై ఉగ్రరూపంలో కనిపించడం చూస్తే… కథలో ఏదో ఒక కీలక సమయంలో, హీరో తన సాత్విక (రాముడి) రూపాన్ని వదిలి, దుష్టశక్తుల సంహారం కోసం ఉగ్ర (శివుడి) అవతారాన్ని ఎత్తే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రామాయణం యొక్క ధర్మం, శివతత్వం యొక్క విధ్వంసం… ఈ రెండింటి కలయికే ‘రుద్ర’ పాత్రగా ఉండవచ్చనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది.

ఇక మహేష్ బాబు ట్రాన్స్‌ఫర్మేషన్‌పై ఈవెంట్‌లో జరిగిన సంభాషణ ఇప్పుడు వైరల్‌గా మారింది. “నేను ఏదో సింపుల్‌గా వద్దామనుకున్నాను. కానీ జక్కన్న ఒప్పుకోలేదు, సినిమా లుక్‌లో రప్పించాడు. కనీసం బటన్స్ పెట్టుకుందామంటే కూడా ‘వద్దు, తీసేయ్’ అన్నాడు,” అని మహేష్ సరదాగా చెప్పిన మాటలు, సినిమాలో ఆయన లుక్ ఎంత డెడికేటెడ్‌గా ఉండబోతోందో స్పష్టం చేశాయి.

ఇది కేవలం స్టైల్‌కోసం కాకుండా, రాముడి లేదా పౌరాణిక పాత్రలకు అనుగుణంగా షర్ట్‌లెస్ లేదా అంగవస్త్రం ధరించే లుక్ ఖాయమని తేలింది. రాజమౌళి అంత కఠినంగా వ్యవహరిస్తున్నారంటే.. మహేష్ బాబు పాత్రకు సరిపోయేలా సిక్స్-ప్యాక్ ట్రాన్స్‌ఫర్మేషన్ లేదా అంతకు మించిన బాడీ లాంగ్వేజ్ సిద్ధం చేస్తున్నారనేది ఫ్యాన్స్ బలమైన నమ్మకం. రాజమౌళి విజన్, మహేష్ బాబు డెడికేషన్ కలిసివారణాసి’ని భారతీయ చలనచిత్ర చరిత్రలో మరో మైలురాయిగా నిలబెట్టడం ఖాయం.

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version