Cinema
కింగ్‌డమ్(kingdom) సినిమా చూడలేదా అయితే వెంకటేష్ వీపీ నటన కోసం చూడండి.. ఇప్పటికే చూసేసారా అయితే మరొకసారి అతని నటన కోసం సినిమాకి వెళండి ! అవును..
సినిమా చూసి 24 గంటలవుతోంది..
కానీ ఒకడు మాత్రం వెంటాడుతూనే ఉన్నాడు
నటనలో మెప్పించడం వేరు. కానీ సినిమా చూసిన థియేటర్ నుంచి ఆ పాత్రతో మనతో పాటు నేరుగా ఇంటికి వచ్చి మన విలువైన సమయాన్ని ధ్వంసం చేయడం వేరు. ఆ కోవకి చెందిన అతికొద్ది నటులలో వెంకటేష్ వీపీ కూడా ఒకడు.
ఫుడ్ ట్రక్ నడుపుతూ జీవితంలో నిలదొక్కుకుని అతి చిన్న వయసులో తండ్రి చనిపోయినా తల్లి చాటు బిడ్డగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈరోజు కింగ్‌డమ్ సినిమాతో ఈ స్థాయికి వచ్చాడు. దక్షిణాది నటులకు ఒక్క సారిగా గుండెల్లో కలుక్కుమనిపించిన నటుడు ఈ కుర్రోడు. ఒక్క చూపు చూస్తే ఉచ్చపోసుకుంటారు అంటే ఏమో అనుకున్నాం కానీ ఇతని పెర్ఫార్మెన్స్ కింగ్‌డమ్‌లో చూసిన తర్వాత ఎవరైనా అది నిజమే అంటారు.
బహుశా కింగ్‌డమ్ సినిమా విడుదల తర్వాత విజయ్ దేవరకొండ(vijaydevarakonda ), సత్యదేవ్ గురించి మాట్లాడతారో.. మాట్లాడరో కానీ వెంకటేష్(Venkitesh) గురించి మాట్లాడకుండా మాత్రం కుదిరే పని కాదు.. మొదటి సినిమాకే అంత మంచిగా డబ్బింగ్ చెప్పిన వెంకటేష్‌కు చాలా భవిష్యత్తు ఉంది.
ఏ స్థాయి అంటే అంతర్జాతీయంగా దక్షిణాది సినిమా కాలరెగరేసుకునే స్థాయిలో.. మరిన్ని మంచి సినిమాలు తీసి మరో ఫాఫా లా మమ్మల్ని అలరించాలి అని కోరుకుంటున్నాను.
..క్రాంతి
Also Read: Kingdom : కింగ్‌డమ్ మూవీపై రష్మిక మాస్ ట్వీట్..
Anasuya : డిజిటల్ ప్రపంచంతో అనసూయ వార్