Kingdom : కింగ్‌డమ్ మూవీపై రష్మిక మాస్ ట్వీట్..
Kingdom : 'అర్జున్ రెడ్డి' తర్వాత విజయ్ కెరీర్‌లో చాలా ఒడిదుడుకులు ఉన్నాయి. 'గీత గోవిందం' తర్వాత సరైన హిట్‌ను అందుకోలేకపోయాడు. '

Kingdom : చాలాకాలం తర్వాత హీరో విజయ్ దేవరకొండకు ఒక మాస్ హిట్ పడింది. నేడు (జులై 31న) రిలీజయిన రౌడీ బాయ్ కొత్త సినిమా ‘కింగ్‌డమ్’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను రాబడుతోంది. థియేటర్ల దగ్గర విజయ్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. దీనికి తోడుగా, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో మరింత వైరల్ అవుతోంది. ఈ ట్వీట్‌తో, రష్మిక-విజయ్‌ల మధ్య ఉన్న బలమైన అనుబంధం మరోసారి బయటపడింది.
Kingdom
‘అర్జున్ రెడ్డి’ తర్వాత విజయ్ కెరీర్‌లో చాలా ఒడిదుడుకులు ఉన్నాయి. ‘గీత గోవిందం’ తర్వాత సరైన హిట్‌ను అందుకోలేకపోయాడు. ‘డియర్ కామ్రేడ్’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ వంటి చిత్రాలు నిరాశపరిచాయి. ‘లైగర్’ భారీ అంచనాలతో వచ్చి, ఘోరంగా నిరాశపరిచింది. అయితే, ఇప్పుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ‘కింగ్‌డమ్'( Kingdom ) సినిమా, విజయ్‌కు మళ్లీ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు.
‘మళ్లీరావా’, ‘జెర్సీ’ వంటి క్లాసిక్ సినిమాలు తీసిన గౌతమ్, ఈసారి తన స్టైల్‌ను మార్చి, ఒక పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ‘కింగ్‌డమ్’ను తెరకెక్కించారు. ఈ సినిమా అన్ని ఏరియాల నుంచి బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకోవడంతో, విజయ్ అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు.
సినిమాకు మంచి స్పందన వస్తుండటంతో, నేచురల్ స్టార్ నాని, మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ వంటి సినీ ప్రముఖులు కూడా ‘కింగ్‌డమ్’పై ప్రశంసలు కురిపించారు. మాజీ మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు సైతం తన రివ్యూను ఇచ్చారు. అయితే, వీటన్నింటికంటే రష్మిక మందన్న చేసిన ట్వీట్ మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.
సోషల్ మీడియా వేదికగా రష్మిక(Rashmika), విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)ను ట్యాగ్ చేస్తూ, “ఈ విజయం నీకు, నిన్ను ప్రేమించే వారికి ఎంత అర్థమవుతుందో నాకు తెలుసు. మనం మనం కొట్టినమ్” అని రాశారు. దీనికి విజయ్, “మనం కొట్టినమ్” అని రిప్లై ఇచ్చారు. ఈ ట్వీట్‌లో ఉన్న ‘మనం’ అనే పదం, వారిద్దరి మధ్య ఉన్న ప్రత్యేకమైన బంధాన్ని, ఒకరి విజయాన్ని మరొకరు ఎంతగా సెలబ్రేట్ చేసుకుంటారో తెలియజేస్తోంది.
‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వంటి చిత్రాలతో విజయ్, రష్మిక జోడీ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. తెరపై మాత్రమే కాకుండా, నిజ జీవితంలోనూ వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం, ఒకరికొకరు ఇచ్చే సపోర్ట్ చాలాసార్లు బయటపడింది. ఇప్పుడు ఈ ట్వీట్ మరోసారి దాన్ని రుజువు చేసింది.
I know how much this means to you and all those who love you 🥹❤️@TheDeverakonda !!
“MANAM KOTTINAM”🔥#Kingdom
— Rashmika Mandanna (@iamRashmika) July 31, 2025