Just EntertainmentLatest News

Wedding:ఈ నెలలోనే విజయ్ దేవరకొండ – రష్మిక పెళ్లి .. ప్రేమ వివాహాలతో ఒక్కటైన సెలబ్రెటీలపై మరోసారి చర్చ

Wedding: ఎంగేజ్‌మెంట్ రింగ్స్ ధరించి ఉన్న వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో చూసిన ఫ్యాన్స్ ఇన్నాళ్లకు తమ కోరిక నిజమవుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Wedding

చాలారోజులు నుంచి వైరల్ అవుతోన్న టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మందన్నల పెళ్లి(Wedding) వార్త .. ఇప్పుడు నిజంగా మారుతోంది. కొంతకాలంగా వీరిద్దరూ లవ్‌లో ఉన్నారంటూ వస్తున్న వార్తలకు బలాన్ని చేకూరుస్తూ, ఇప్పుడు వీరి వెడ్డింగ్ ఇన్విటేషన్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ పెళ్లి పత్రికలో వీరిద్దరి పెళ్లి (Wedding) ఫిబ్రవరి 26న అత్యంత సన్నిహితుల మధ్య జరగనుండగా, మార్చి 4న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో గ్రాండ్‌గా, విజయ్, రష్మిక రిసెప్షన్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అతిథులకు ఆహ్వానాలు కూడా అందుతున్నాయన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎంగేజ్‌మెంట్ రింగ్స్ ధరించి ఉన్న వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో చూసిన ఫ్యాన్స్ ఇన్నాళ్లకు తమ కోరిక నిజమవుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ జంట త్వరలోనే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి హ్యాపీగా ఉండాలని కోరుతున్నారు.

మరోవైపు టాలీవుడ్‌లో ఈ సెలబ్రెటీల మ్యారేజ్(Wedding) వార్త విన్న సినీ ప్రేమికులు ఇప్పటి వరకూ ఇలా లవ్ మ్యారేజ్ చేసుకున్న సెలబ్రెటీలు ఎంతమంది ఉన్నారన్న లెక్కల్లో పడ్డారు. అయితే టాలీవుడ్‌లో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల చరిత్రను చూస్తే పాత తరాన్ని వదిలేస్తే సావిత్రి-జెమినీ గణేషన్, కృష్ణ – విజయనిర్మల ఈ ఒరవడికి నాంది పలికినట్లు అయ్యారు.సావిత్రి పెళ్లి జీవితం ఒడిదుడుకుల మధ్య సాగినా..వెండితెరపై హిట్ జంటగా పేరు తెచ్చుకున్న కృష్ణ – విజయనిర్మల నిజ జీవితంలోనూ ఆదర్శ దంపతులుగా నిలిచారు.

Wedding
Wedding

ఆ తర్వాత అక్కినేని నాగార్జున – అమల, రాజశేఖర్ – జీవిత వంటి వారు దశాబ్దాలుగా అన్యోన్యంగా ఉంటూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. నేటి తరం విషయానికి వస్తే వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి, రానా – మిహీకా బజాజ్, నితిన్ – శాలిని వంటి వారు కూడా తమ ప్రేమను పెళ్లి పీటల వరకు తీసుకెళ్లి సంతోషంగా ఉన్నారు. శర్వానంద్ – రక్షితా రెడ్డి కూడా వివాహబంధంతో ఒకటయ్యారు. అయితే అక్కినేని నాగచైతన్య – సమంత వంటి కొన్ని జంటలు విడిపోవడం అభిమానులను బాధించినా, తర్వాత వీరిద్దరూ సినీ రంగానికి చెందిన వారినే మరోసారి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మొత్తంగా సినీ లోకంలో ప్రేమ వివాహాలకు ఎప్పుడూ క్రేజ్ తగ్గలేదు.

ఇక విజయ్ దేవరకొండ, రష్మిక జంట విషయానికి వస్తే వీరిద్దరూ గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. వీరిద్దరూ విదేశాల్లో కలిసి తిరుగుతున్న ఫోటోలు చాలాసార్లు సోషల్ మీడియాలో వైరల్ అయినా వీరిద్దరూ నోరు విప్పలేదు. తాజాగా వైరల్ అవుతున్న పెళ్లి పత్రికలో వీరిద్దరూ ఫిబ్రవరి 26 తేదీన ఒక్కటవబోతున్నారన్న వార్త చూసి.. వీరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మార్చి 4న జరిగే రిసెప్షన్‌కు సినీ ప్రముఖులంతా హాజరయ్యే అవకాశం ఉంది. దీంతో ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button