Women: మున్సిపల్ ఎన్నికల పోరులో మహిళా అభ్యర్ధులే ఎక్కువట..
Women: ఎన్నికలకు ముందే 14 స్థానాల్లో ఏకగ్రీవాలు జరగగా..వీటిలో 12 స్థానాలను కాంగ్రెస్ దక్కించుకోగా, 2 స్థానాలను మాత్రం బీఆర్ఎస్ గెలుచుకుంది.
Women
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి ఊపందుకుంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 7 నగర పాలక సంస్థలు , 116 పురపాలక సంఘాలకు ఈ నెల 11న పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల బరిలో మొత్తం 12,944 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
అయితే ఈసారి ఎన్నికల గణాంకాల్లో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పురుషుల కంటే మహిళా (Women)అభ్యర్థులే ఎక్కువ సంఖ్యలో పోటీలో ఉండటం. మొత్తం పోటీదారుల్లో మహిళలు 50.27 శాతం మంది ఉండగా, పురుషులు 49.73 శాతం మంది ఉన్నారు. ఈ పోటీలో 6,508 మంది మహిళా అభ్యర్ధులు ఉండగా 6,436 మంది పురుషులు నిలబడుతున్నారు. ఇది స్థానిక సంస్థల్లో మహిళా(Women) శక్తి పెరిగిందనడానికి నిదర్శనం అంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు.
నగర పాలక సంస్థల విషయానికి వస్తే కరీంనగర్లో అత్యధికంగా 398 మంది కేండిడేట్లు పోటీ పడుతుండగా,పురపాలక సంఘాలలో.. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో అత్యధికంగా 314 మంది బరిలో నిలిచారు.అయితే కొడంగల్లో మాత్రం కేవలం 34 మంది అభ్యర్థులు మాత్రమే బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థుల హడావుడి కూడా ఏమాత్రం తక్కువేం లేదు. ముఖ్యంగా మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలో ఏఖంగా 127 మంది, ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 93 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు తమ సత్తా చాటడానికి రెడీ అయ్యారు.
ఇక రాజకీయ పార్టీల బలాబలాలను పరిశీలిస్తే, అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి అత్యధికంగా 98.3 శాతం స్థానాల్లో అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నుంచి 96 శాతం స్థానాల్లో అభ్యర్థులు నిలబడుతున్నారు. బీజేపీ 87.3 శాతం చోట్ల పోటీలో ఉండగా, జనసేన పార్టీ 332 స్థానాల్లో పోటీ చేస్తూ ఈసారి ఎన్నికల్లో కీలకంగా మారుతోంది. అలాగే మజ్లిస్, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా తమ పరిధి వరకూ పోటీలో ఉన్నాయి.

మరోవైపు ఈ ఎన్నికలలో నిలబడుతున్న కేండిడేట్ల విద్యార్హతల విషయానికి వస్తే, ఈసారి చదువుకున్న వారు రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపించినట్లు స్పష్టమవుతోంది. 775 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 2,903 మంది గ్రాడ్యుయేట్లు బరిలో నిలబడగా.. దురదృష్టవశాత్తూ 1,291 మంది నిరక్షరాస్యులు అభ్యర్థుల జాబితాలో ఉండటం హాట్ టాపిక్ అయింది.
అయితే ఎన్నికలకు ముందే 14 స్థానాల్లో ఏకగ్రీవాలు జరగగా..వీటిలో 12 స్థానాలను కాంగ్రెస్ దక్కించుకోగా, 2 స్థానాలను మాత్రం బీఆర్ఎస్ గెలుచుకుంది. మహబూబ్నగర్, రామగుండం వంటి కార్పొరేషన్లతో పాటు చౌటుప్పల్, కోదాడ, మెదక్ వంటి పురపాలికల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలంగాణలో ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తంగా ఫిబ్రవరి 11న జరగబోయే ఈ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయ భవిష్యత్తుపై పెద్ద ప్రభావమే చూపించే అవకాశం ఉంది.
Mana Shankara Varaprasad Garu:బాక్సాఫీస్ వద్ద మెగా సునామీ..చరిత్ర తిరగరాసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’




One Comment