Mexican President
మహిళలకు ఎక్కడ ఉన్నా… ఎలా ఉన్నా… ఎలాంటి హోదాలో ఉన్నా వేధింపులు తప్పవని మరోసారి రుజువైంది. సాధారణ మహిళ దగ్గర నుంచే సెలబ్రిటీ వరకూ పలుసార్లు ఇలాంటి ఘటనలు చాలానే చూసాం.. ఇప్పుడు ఏకంగా ఒక దేశ అధ్యక్షురాలికి కూడా వేధింపులు తప్పలేదంటే పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అర్థమవుతోంది. అది కూడా భారీ భద్రత మధ్య ఉండే దేశ అధ్యక్షురాలికి ఇలాంటి ఘటన ఎదురవడంతో ఒక్కసారిగా ఆ వీడియోతో పాటు వార్త కూడా వైరల్ అయిపోయింది. ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నది మెక్సికో ప్రెసిడెంట్ క్లాడియా షీన్‌బామ్… ఓ బహిరంగ కార్యక్రమంలో పాల్గొంటుండగా ఈ ఘటన జరిగింది.
ఆమె అక్కడకు వచ్చిన ప్రజలను, ఇతర అధికారులను పలకరిస్తూ ముందుకు సాగుతుండగా ఒక వ్యక్తి హఠాత్తుగా వెనక నుంచి వచ్చి భుజంపై చేయి వేశాడు. తప్పవని మరోసారి రుజువైంది. సాధారణ మహిళ దగ్గర నుంచే సెలబ్రిటీ వరకూ పలుసార్లు ఇలాంటి ఘటనలు చాలానే చూసాం.. ఇప్పుడు ఏకంగా ఒక దేశ అధ్యక్షురాలి(Mexican President )కి కూడా వేధింపులు తప్పలేదంటే పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అర్థమవుతోంది. అది కూడా భారీ భద్రత మధ్య ఉండే దేశ అధ్యక్షురాలికి ఇలాంటి ఘటన ఎదురవడంతో ఒక్కసారిగా ఆ వీడియోతో పాటు వార్త కూడా వైరల్ అయిపోయింది.
ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నది మెక్సికో ప్రెసిడెంట్(Mexican President )క్లాడియా షీన్‌బామ్… ఓ బహిరంగ కార్యక్రమంలో పాల్గొంటుండగా ఈ ఘటన జరిగింది. చేయి వేయడమే కాదు దగ్గరకు వెళ్ళి ముద్దు పెట్టుకోబోయాడు. అప్పటి వరకూ దీనిని గమనించని సెక్యూరిటీ సిబ్బంది చివరి సెకన్లలో అతన్ని అడ్డుకున్నారు. ఇంకో రెండు మూడు సెకన్లు ఆలస్యమై ఉంటే కఛ్చితంగా ఆమెను ముద్దు పెట్టుకుని ఉండేవాడు.
CRAZY moment man GROPES Mexico’s President Claudia Sheinbaum
Then TRIES to kiss her before security finally wakes up
How was security THIS slow to react? pic.twitter.com/vaECXy0bCW
— RT (@RT_com) November 4, 2025
చివరి నిమిషంలో గమనించిన వ్యక్తిగత భద్రతా సిబ్బంది అప్రమత్తమై అతడ్ని పక్కకు నెట్టిసినా తర్వాత కూడా ఆ వ్యక్తి మళ్ళీ ఆమెను తాకేందుకు ప్రయత్నించడం షాక్ కు గురి చేసింది. అయినా ఒంటిపై ఎక్కడెక్కడో చేతులు వేసి అసభ్యంగా తాకుతుండటంతో మెక్సికో అధ్యక్షురాలిగా ఉన్న క్లాడియా షీన్‌బామ్ ఇబ్బంది పడ్డారు. చేయి వేసేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు అతన్ని ఆమె పక్కకు నెట్టేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సాధారణ మహిళలకే కాదు దేశాన్ని నడిపించే వ్యక్తికి కూడా భద్రత కరువైందంటూ ఫైర్ అవుతున్నారు.
ఇలాంటి దురాగతానికి పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ విషయంపై మెక్సికో అధ్యక్ష కార్యాలయం అధికారికంగా స్పందించలేదు. అయితే ఘటన తర్వాత నిందితుడిని మెక్సికో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అప్పుడు సదరు నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్టు గుర్తించారు. మిచోకాన్ రాష్ట్రంలో హింసను అరికట్టడం, ఇతర భద్రతా ఏర్పాట్లపై ప్రణాళిక ప్రకటించిన రోజే ఇలాంటి ఘటన ఆమెకు ఎదురవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
