Hiroshima:అణుబాంబు గాయాల కథ .. హిరోషిమా

Hiroshima: ఒక నిమిషం, లక్షల బతుకులు..హిరోషిమా చేదు జ్ఞాపకం

Hiroshima

ఆగస్టు 6..ప్రపంచ చరిత్రలో మానవత్వం తలవంచిన రోజు. 1945లో అమెరికా వదిలిన అణుబాంబు ‘లిటిల్ బాయ్’… జపాన్‌లో హిరోషిమా (Hiroshima)నగరాన్ని ఒక్క క్షణంలో మట్టిలో కలిపిన రోజు. ఉదయం 8:15.. అప్పుడే నిద్రలేస్తున్న పసికందులు, స్కూల్‌కి వెళ్తున్న పిల్లలు, తమ పనుల్లో మునిగిపోయిన కుటుంబాలు , ఇలా అందరూ ఒక్క నిమిషంలోనే బూడిదయిన తేదీ. 70 వేల మంది అక్కడికక్కడే మరణించగా… ఏడాది లోపే ఆ సంఖ్య 1,40,000 దాటి పోయిందని నేటికీ గుర్తు చేసే చేదు జ్ఞాపకం.

ఆరోజు జరిగినే ఆ మానవ విపత్తు అక్కడితో ఆగలేదు. రేడియేషన్‌తో బాధితులు – తరాల తరబడి జన్యుపరమైన లోపాలు, క్యాన్సర్, మానసిక యాతనలు పడుతూనే ఉన్నారు. హిబకుషాగా గుర్తింపబడిన వాళ్లు జివితాంతం బాధల కూడు తిన్నారు. ప్రపంచమంతా హిరోషిమా దృశ్యాల్ని చూసి ఉలిక్కిపడింది. అణు బాంబు అంటే యుద్ధ గెలుపు కాదని, అది ఓ మానవతా పరాజయం అనే గుణపాఠం ఇస్తూ.. ఆ దాడి చరిత్రలో శాశ్వత ముద్ర వేసింది.

ఇప్పుడు ప్రతి సంవత్సరం ఆగస్టు 6న హిరోషిమా(Hiroshima) దినోత్సవం జరుపుతారు. ఇది ఒక స్మృతిరోజుగా కాదు. ఇది శాంతికి, అణు ఆయుధాల నిషేధానికి, మానవతకు మనం తీసుకోవాల్సిన సంకల్పాన్ని గుర్తు చేసే రోజుగా జరుపుకొంటారు. హిరోషిమా ఘాతకాన్ని మర్చిపోవడం అంటే మన మానవత్వాన్ని మర్చిపోవడమే. ప్రతి చిన్న గ్రామం నుంచి ఐక్యరాజ్యసమితి వరకు శాంతి కొవ్వొత్తులు వెలిగించాలి. ఆ దినం ఒక నిశబ్ద కంఠంగా మానవత్వం కోసం కేకలు వేస్తోంది.

Hiroshima

ప్రపంచంలో ఇప్పటికీ 13,000కి పైగా అణు బాంబులు(atomic-bomb) ఉన్నాయి. ఇదే నిజంగా భద్రతనా? హిరోషిమా సంఘటనకు 80 ఏళ్లైనా ..ఆ సంఘటన నుంచి మనం నేర్చుకున్నామా? లేక మళ్లీ అదే దారేనా?

ప్రతి మనిషికి ఓ పేరు ఉంది. ప్రతి ప్రాణాన్ని ఎవరో ప్రేమించారు. వారి మరణం వ్యర్థం కాకూడదు. సెత్సుకో తుర్లో మాటలు ఇప్పటికీ మన హృదయాల్లో మారుమ్రోగాలి.

ఇకనైనా శాంతి కోసం, మానవత్వం కోసం ఒక్కటిగా నిలుద్దాం. హిరోషిమా మళ్లీ జరగకూడదని కోరుకుందాం..

 

Exit mobile version