Imran Khan’s wife: ఇమ్రాన్ ఖాన్ భార్యకి 17 ఏళ్ల జైలు శిక్ష.. పాకిస్తాన్ పాలిటిక్స్‌లో జరుగుతున్న పవర్ గేమ్ ఏంటి?

Imran Khan's wife: ఇప్పటికే అనేక కేసుల్లో శిక్షలు పడి, కొంతకాలంగా అడియాలా జైల్లోనే ఉంటున్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు మరో భారీ షాక్ తగిలింది.

Imran Khan’s wife

పాకిస్తాన్ రాజకీయాల్లో ప్రస్తుతం అత్యంత ఉత్కంఠభరితమైన, సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే అనేక కేసుల్లో శిక్షలు పడి, కొంతకాలంగా అడియాలా జైల్లోనే ఉంటున్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు మరో భారీ షాక్ తగిలింది. అయితే ఈసారి దెబ్బ ఇమ్రాన్ కు మాత్రమే కాదు, నేరుగా ఆయన భార్య (Imran Khan’s wife)బుష్రా బీబీకి తగిలింది. తోషాఖానా 2 అవినీతి కేసులో బుష్రా బీబీకి ఏకంగా 17 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ రావల్పిండిలోని ప్రత్యేక కోర్టు జడ్జి షారుఖ్ అర్జుమంద్ సంచలన తీర్పు ఇచ్చారు. ఈ పరిణామంతో పాకిస్తాన్ రాజకీయాలు పూర్తిగా హై స్టేక్స్ ఫేజ్‌లోకి వెళ్లిపోయాయి.

రావల్పిండిలోని అడియాలా జైలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో ఈ విచారణ జరిగింది. తోషాఖానా 2 కేసులో ఇమ్రాన్ ఖాన్ , ఆయన భార్య (Imran Khan’s wife)బుష్రా బీబీలకు తలో 17 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ఇందులో 10 ఏళ్ల శిక్ష క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద, మరో 7 ఏళ్ల శిక్ష అవినీతి నిరోధక చట్టం కింద విధించడం గమనార్హం. వీటితో పాటు ఒక్కొక్కరికి 10 మిలియన్ పాకిస్తానీ రూపాయల జరిమానా కూడా వేశారు.

సౌదీ అరేబియా యువరాజు బహుమతిగా ఇచ్చిన అత్యంత ఖరీదైన బుల్గరీ డైమండ్ నెక్లెస్ సెట్ ను (దీని విలువ సుమారు 80 మిలియన్ రూపాయలు) తోషాఖానా నిబంధనలు ఉల్లంఘించి, చాలా తక్కువ ధరకే తన సొంతం చేసుకున్నారనేది బుష్రా బీబీపై ఉన్న ప్రధాన ఆరోపణ. ప్రభుత్వ ఖజానాకు చెందాల్సిన సంపదను వ్యక్తిగత ఆస్తిగా మలచుకున్నారని కోర్టు నిర్ధారించింది.

పీటీఐ మరియు ఇమ్రాన్ వర్గం రియాక్షన్.. “ఇది కేవలం ఒక ప్రహసనం. జైలు లోపల, మూసివేసిన తలుపుల వెనుక, కనీసం కుటుంబ సభ్యులను కూడా అనుమతించకుండా జరిగిన ఈ విచారణ ఎలా నిష్పక్షపాతమవుతుంది? ఇది న్యాయం కాదు, మిలటరీ కోర్టులాగా ఒక సీల్ చేయబడిన విచారణ” అని ఇమ్రాన్ పార్టీ పీటీఐ తీవ్రంగా ఆక్షేపించింది. ఇప్పటికే జైల్లో ఉన్న ఇమ్రాన్ ను కుంగదీయడానికే ఆయన భార్య(Imran Khan’s wife)ను కూడా జైల్లో పెడుతున్నారని వారు వాదిస్తున్నారు.

Imran Khan’s wife

పాకిస్తాన్‌లో అసలు ఏమి జరుగుతోంది? – మూడు లేయర్ల పవర్ ఫైట్..

ఎస్టాబ్లిష్‌మెంట్ వర్సెస్ ఇమ్రాన్ ఖాన్.. ఒకప్పుడు ఆర్మీ సపోర్ట్‌తో పైకి ఎక్కిన ఇమ్రాన్, ఆ తర్వాత అదే ఎస్టాబ్లిష్‌మెంట్‌తో ఢీకొని బయట పడిపోయాడు. ఇప్పుడు ఆర్మీ ,ప్రస్తుత ప్రభుత్వం కలిసి ఇమ్రాన్‌ను రాజకీయాల నుంచి పూర్తిగా డిస్క్వాలిఫై చేయాలని చూస్తున్నాయి.

జైలు విచారణల వ్యూహం.. కీలక కేసులన్నీ అడియాలా జైలు లోపలే, సెక్యూరిటీ పేరుతో సీల్ చేసి విచారించడం అనేది ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతోంది. ఇది ప్రజల్లో రూల్ ఆఫ్ లా పై నమ్మకాన్ని తగ్గిస్తోంది.

లీడర్‌లెస్ పార్టీగా మార్చే ప్లాన్.. ఎన్నికల సమయంలో పీటీఐకి ఉన్న బలమైన ఓటర్ బేస్ ను చెడగొట్టడానికి, ఆ పార్టీ అగ్ర నాయకత్వాన్ని పూర్తిగా జైలు గదుల్లోనే బంధించి, పార్టీని నామరూపాలు లేకుండా చేయాలనేది పాలకుల వ్యూహంగా కనిపిస్తోంది.

బుష్రా బీబీ జైలుకు వెళ్తే పరిస్థితి ఎలా మారుతుంది?

ఇమ్రాన్ ఇమేజ్ మరియు సింపతి.. ఇమ్రాన్ ఖాన్ ఒక్కడినే కాదు, ఆయన భార్య(Imran Khan’s wife)ను కూడా జైలులో పెట్టడం అనేది పీటీఐ పార్టీకి ఒక బలమైన ఎమోషనల్ పాయింట్ అవుతుంది. “కుటుంబాన్ని కూడా వదిలిపెట్టని వ్యవస్థ” అనే భావన యువతలో, మహిళల్లో ఇమ్రాన్ పట్ల సానుభూతిని మరింత పెంచుతుంది.

పీటీఐ అంతర్గత పరిస్థితి.. ఇమ్రాన్, బుష్రా ఇద్దరూ లోపల ఉంటే, పార్టీ నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతుంది. అయితే ఇది కేడర్‌ను మరింత అగ్రెసివ్‌గా మార్చవచ్చు. సోషల్ మీడియా ద్వారా నిరసనలు మరియు అంతర్జాతీయ ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.

సామాజిక, సైకాలజికల్ ప్రభావం.. బుష్రా బీబీకి పాకిస్తాన్ లో ఒక ఆధ్యాత్మిక వ్యక్తిగా ఇమేజ్ ఉంది. అలాంటి వ్యక్తిపై అవినీతి కేసులు వేసి జైలుకు పంపడం అనేది అక్కడి సాంప్రదాయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది.

ఈ అనిశ్చితి వల్ల పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంది. ఐఎంఎఫ్ , విదేశీ ఇన్వెస్టర్లు దేశంలో స్థిరత్వం కోరుకుంటారు. ఇలాంటి గందరగోళం ఆర్థిక పునరుద్ధరణను దెబ్బతీస్తుంది. మరోవైపు అమెరికా,వెస్ట్రన్ దేశాలు ఇప్పటివరకు ఈ విషయంలో డిప్లమాటిక్ గానే స్పందిస్తున్నాయి. కేవలం ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ ఉండాలని స్టేట్మెంట్స్ ఇస్తున్నాయి తప్ప, లోపల జరుగుతున్న విషయాల్లో నేరుగా జోక్యం చేసుకోవడం లేదు.

రాజకీయ కల్లోలం ఒకవైపు ఉంటే, పాకిస్తాన్ లో తీవ్రవాద దాడులు కూడా పెరుగుతున్నాయి. ఆర్మీ అంతా రాజకీయాలపై ఫోకస్ పెట్టడం వల్ల దేశ భద్రత బలహీనపడుతోందని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version