Nobel Peace Prize 2025: ట్రంప్ కు కాదు మచాడోకు.. నోబెల్ శాంతి బహుమతి ప్రకటన

Nobel Peace Prize 2025: రెండోసారి అధికారంలో వచ్చిన తరువాత ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాలు చాలా దేశాల మీద ఎంతటి ఎఫెక్ట్‌ చూపించాయో ప్రపంచం మొత్తం చూసింది.

Nobel Peace Prize 2025

నోబెల్‌ శాంతి బహుమతి (Nobel Peace Prize 2025)మీద ట్రంప్‌ పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. నోబెల్‌ శాంతి బహుమతి(Nobel Peace Prize 2025)ని వెనుజులా విపక్ష నేత మరియా కొరినా మచాడోకు ప్రకటించారు. మరియా కొరినా మచాడో వెనిజువెలా రాజకీయ నాయకురాలు. రాజకీయాల్లోకి ప్రవేశించకముందు, ఆమె సామాజిక, మానవ హక్కుల కార్యకర్తగా పనిచేశారు.

2013లో వెంటే వెనుజులా అనే పేరుతో పార్టీని స్థాపించారు. పాలిటిక్స్‌లోకి వచ్చిన కొంత కాలానికే వెనిజువెలా ప్రజాస్వామ్య ఉద్యమంలో ప్రముఖ వ్యక్తిగా నిలిచారు. మచాడో మానవ హక్కుల రక్షణ, ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నారు, ముఖ్యంగా నికోలస్ మడురో పాలనకు వ్యతిరేకంగా పని చేస్తున్నారు. వెనిజువెలా ప్రజల ప్రజాస్వామ్య హక్కుల కోసం ఆమె చేసిన అవిశ్రాంత కృషికి, శాంతియుత మార్పు కోసం ఆమె పోరాటానికి గుర్తింపుగా 2025 నోబెల్‌ శాంతి బహుమతి ఆమెకు ఇచ్చారు.

ఇదిలా ఉంటే కొన్ని దేశాలు సిఫార్సు చేసినా ట్రంప్‌కు శాంతి బహుమతి రాలేదు. ఆయన చేసిన ఒప్పందాలు దీర్ఘకాలికంగా లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఇండియా పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నప్పుడు ఎవరూ పిలవకపోయినా ట్రంప్‌ జోక్యం చేసుకున్నారు. ఇరు దేశాల మధ్య శాంతి కుదిర్చాను.. ఇక యుద్ధం లేదంటూ ప్రకటించారు. కట్‌ చేస్తే.. పాకిస్థాన్‌ తన బుద్ధి మార్చుకోలేదు.

Nobel Peace Prize 2025

ఇండియా పాకిస్థాన్‌కు బుల్లెట్లతో ఆన్సర్‌ చెప్పడం కూడా మానలేదు. దీంతో ట్రంప్‌ మాటలు అంతా బిల్డప్‌ అని ప్రపంచం మొత్తం తెలిసి పోయింది. ఇదొక్కటే కాదు.. 2018లో ఉత్తర కొరియా చర్చలు, 2020లో అబ్రహం ఒప్పందాలు, 2021లో సెర్బియా కొసోవో ఒప్పందాలు.. ఇలా ట్రంప్‌ చేసిన అన్ని పనులూ కేవలం తాత్కాలిక ఒప్పందాలుగానే మిగిలాయి.

నార్వేజియన్‌ కమిటీ శాంతి బహుమతి ఇవ్వడానికి కొన్ని అర్హతలు చూస్తుంది. అంతర్జాతీయ శాంతిని నెలకొల్పడం, ప్రజాస్వామ్య హక్కుల గురించి పోరాడటం వంటి అంశాలకే ప్రాధాన్యత ఇస్తుంది. కానీ ట్రంప్ చేసినట్టుగా చెబుతున్న శాంతి ఒప్పందాలన్నీ తాత్కాలికంగానే ఉండిపోయాయి. పైగా రెండోసారి అధికారంలో వచ్చిన తరువాత ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాలు చాలా దేశాల మీద ఎంతటి ఎఫెక్ట్‌ చూపించాయో ప్రపంచం మొత్తం చూసింది. లక్షల మంది విద్యార్థులు, ఉద్యోగులను ట్రంప్‌ నిర్ణయాలు ఇబ్బందులకు గురి చేశారు.

విదేశాంగ విధానాల్లో విభజనాత్మక ధోరణి ప్రదర్శించడం. ఇరాన్‌ అణు ఒప్పందం నుండి బయటకు రావడం, పారిస్‌ వాతావరణ ఒప్పందాన్ని వదిలేయడం లాంటి చర్యలు ట్రంప్‌కు శాంతి బహుమతిని దూరం చేశాయి. ఏం చేయకపోయినా ఒబామాకు నోబెల్‌ ప్రైజ్‌ ఇచ్చారు.. నాకెందుకు ఇవ్వరంటూ హడావుడి చేసినా అవార్డ్ కమిటీ పట్టించుకోలేదు. పైగా కమిటీ మీదనే విమర్శలు చేస్తే అవార్డు ఎందుకిస్తారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

IND vs WI: జైశ్వాల్ శతక్కొట్టుడు రెండో టెస్ట్ తొలిరోజు మనదే

Exit mobile version