Patala Loka:పాతాళలోకం గురించి పురాణాలు ఏం చెబుతున్నాయి? పాతాళం అంటే నేటి అమెరికాయేనా?

Patala Loka: పాతాళంలో రాక్షసులు, యక్షులు, నాగజాతి వారు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. నారదుడు పాతాళాన్ని సందర్శించినట్లు విష్ణు పురాణం చెబుతోంది.

Patala Loka

పాతాళలోకం భూమి(Patala Loka) కింద భాగంలో ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. భాగవత పురాణం ప్రకారం, భూమి నుంచి దాదాపు 50 వేల యోజనాల (సుమారు 4 లక్షల మైళ్లు) దూరంలో ఇది ఉంటుందట. దీన్ని భూమి కింద ఉన్న గ్రహ వ్యవస్థల్లో భాగంగా కూడా భావిస్తారు.

పాతాళంలో రాక్షసులు, యక్షులు, నాగజాతి వారు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి.

నారదుడు పాతాళాన్ని సందర్శించినట్లు విష్ణు పురాణం చెబుతోంది. నారదుడు పాతాళాన్ని వర్ణిస్తూ, అక్కడ సూర్యరశ్మి ఉండకపోవడంతో అంతా చీకటిగా ఉంటుందని తెలిపారు. అయితే, అక్కడ మాయ రాజభవనాలు, ధర్మశాలలు మరియు లెక్కలేనంత బంగారం ఉంటుందట. సూర్యరశ్మి లేకపోవడంతో, ఆ బంగారు ఆభరణాలు మిలమిల మెరుస్తూ కాంతిని పంచుతాయని పేర్కొన్నారు.

Patala Loka

పగలు-రాత్రి సిద్ధాంతం..పురాణాల ప్రకారం, సూర్యసిద్ధాంతం అనే ప్రాచీన ఖగోళ గ్రంథం ప్రకారం సురాసురుల్లో (దేవతలు-రాక్షసులు) ఒకరికి రాత్రి అయితే, మరొకరికి పగలు. అంటే, భూమి యొక్క ఒక వైపున పగలు ఉంటే, సరిగ్గా అవతల వైపున రాత్రి ఉంటుందని దీని భావం. ఈ సిద్ధాంతం పాతాళలోకం స్థానాన్ని గుర్తించడానికి దోహదపడింది.

పాతాళం(Patala Loka) అంటే నేటి అమెరికా ఖండమే అని ప్రముఖ పండితుడు దయానంద సరస్వతీ వంటి అనేక మంది పండితులు అభిప్రాయపడ్డారు. దీనికి కారణం, భూగోళంలో భారతదేశానికి సరిగ్గా అవతల వైపున (Antipode) అమెరికా ఖండం ఉండడమే. అంటే, మన దేశ భూభాగంలో నిల్చుంటే సరిగ్గా పాదాల క్రింద ఉండే ప్రాంతం అమెరికాయే. అందుకే భూమికి కింది భాగంలో ఉన్న లోకాన్ని పాతాళంగా భావించి, అదే అమెరికా అని కొంతమంది పరిగణించేవారు.ఏది ఏమైనా, పాతాళలోకం అనేది మాత్రం ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది.

Trip: సోలో ట్రిప్ ప్లాన్ చేశారా? అయితే ఇవి తెలుసుకోండి

Exit mobile version