Rangoli:సంక్రాంతికి 3D రంగోలి డిజైన్ల హవా..ఈ ముగ్గులు వేయడం ఎలానో తెలుసా?
Rangoli: ఈ ముగ్గులు వేసినప్పుడు అవి నేల మీద ఉన్నట్లు కాకుండా, నిజంగానే ఆ వస్తువులు అక్కడ ఉన్నాయేమో అనే భ్రమను కలిగించే విధంగా ఉంటాయి.
Rangoli
తెలుగువారి లోగిళ్లలో సంక్రాంతి సందడి మొదలైంది అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది రంగురంగుల ముగ్గులే. అయితే ఈ ఏడాది సాధారణ ముగ్గుల (Rangoli) కంటే 3D (త్రీ-డైమెన్షనల్) రంగోలి డిజైన్లే ఎక్కువగా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
ఈ ముగ్గులు వేసినప్పుడు అవి నేల మీద ఉన్నట్లు కాకుండా, నిజంగానే ఆ వస్తువులు అక్కడ ఉన్నాయేమో అనే భ్రమను కలిగించే విధంగా ఉంటాయి. ముఖ్యంగా ముగ్గుల పోటీల్లో పాల్గొనే వారికి ఈ త్రీడీ డిజైన్లు ఒక అద్భుతమైన ఆయుధంగా మారుతున్నాయి. ఇవి కేవలం ముగ్గులే కాదు, ఒక అందమైన చిత్రలేఖనంలా కనిపించడంతో జడ్జిలు కూడా వీటివైపే ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు.
నిజానికి ఈ 3D ముగ్గుల(Rangoli) వెనుక ఉన్న అసలు రహస్యం ‘షేడింగ్’. రంగులను ఉపయోగించేటప్పుడు కాంతి ఎటు నుంచి పడుతోంది, నీడ ఎక్కడ పడుతుంది అనే విషయాన్ని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుని ముగ్గు వేస్తుంటారు.
ఉదాహరణకు ఒక పువ్వు లేదా ఒక బుట్ట, కుండ వంటివి వేసినప్పుడు, దాని అంచుల వద్ద ముదురు రంగులను, మధ్యలో లేత రంగులను వాడితే అది 3D లుక్ సంతరించుకుంటుంది. ఈ ఏడాది సంక్రాంతి ముగ్గుల్లో గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, ధాన్యపు గంపల డిజైన్లను 3D స్టైల్‌లో వేయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు.

ఈ ముగ్గుల (Rangoli ) ఇంకో విశేషం ఏంటంటే, వీటిని ఏ వైపు నుంచి చూసినా అవి చాలా సహజంగా అలాగే కనిపిస్తాయి. ముగ్గు మధ్యలో వేసే చుక్కల అమరిక కూడా 3D ప్రభావాన్ని పెంచుతుంది. దీనికోసం ముగ్గు వేసిన తర్వాత దానికి చుట్టూ తెల్లటి రంగుతో అవుట్‌లైన్ ఇచ్చి, ఒకవైపు నలుపు లేదా బూడిద రంగుతో నీడ (Shadow) లాగా జాగ్రత్తగా వేయాలి. దీనివల్ల ఆ ముగ్గు నేల మీద నుంచి పైకి లేచినట్లుగా కనిపిస్తుంది. పండుగ రోజుల్లో మీ ఇంటి ముందు ఇలాంటి ముగ్గులు ఉంటే, వచ్చేపోయే బంధుమిత్రులు ఒక్క నిమిషం అయినా ఆగి చూడకుండా అక్కడ నుంచి కదలరంటే అది అతిశయోక్తి కాదు.
2026 ముగ్గుల (Rangoli )పోటీల్లో గెలవాలంటే మీరు కూడా ఈ సరికొత్త త్రీడీ టెక్నిక్స్‌ను ప్రయత్నించి ఫ్రైజ్ కొట్టేయండి. తక్కువ సమయంలోనే ఎక్కువ ఆకర్షణీయంగా కనిపించే ఇలాంటి డిజైన్లను ఎంచుకోవడం వల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా, మీ క్రియేటివిటీకి కూడా ప్రశంసలు దక్కుతాయి. అందుకే సంప్రదాయ ముగ్గులకు ఆధునిక హంగులు జోడించి ఈ సంక్రాంతిని మరింత కలర్ ఫుల్ గా మార్చుకోండి.



