Power Nap :మధ్యాహ్నం కునుకు తీస్తున్నారా? అయితే మీ మెదడు పదేళ్లు యవ్వనంగా మారుతుందట..

Power Nap : ఏజ్ పెరుగుతున్న కొద్దీ అందరిలో సాధారణంగా జ్ఞాపకశక్తి తగ్గడం, ఆలోచనా శక్తి మందగించడం అనే సమస్య ఎదురవుతుంది.

Power Nap

పగటిపూట నిద్రపోవడమనేది పనితో పాటు ఆరోగ్యానికి కూడా చేటు అని మన పెద్దలు చెబుతుండేవారు. కానీ మారుతున్న కాలంతో పాటు.. ఈ సామెతకు కూడా కాలం చెల్లిందని తాజాగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీలున్నంత వరకు పగటిపూట కనీసం 20 నుంచి 40 నిమిషాల పాటు అయినా చిన్న కునుకు తీయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని తాజా పరిశోధనల్లో తేలింది.

ముఖ్యంగా యాభై ఏళ్లు దాటినవారిలో ఈ అలవాటు మెదడును చాలా చురుగ్గా ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు. పగటిపూట కాసేపు నిద్రపోవడం(Power Nap ) వల్ల మెదడు కేవలం చురుగ్గా ఉండటమే కాకుండా, ఆ వయసులో ఉండాల్సిన దానికంటే కూడా మరింత యవ్వనంగా మారుతుందని తాజా పరిశోధనలు తేల్చాయి.

ఏజ్ పెరుగుతున్న కొద్దీ అందరిలో సాధారణంగా జ్ఞాపకశక్తి తగ్గడం, ఆలోచనా శక్తి మందగించడం అనే సమస్య ఎదురవుతుంది. అయితే పగటిపూట క్రమం తప్పకుండా కునుకు తీసే వారిలో మెదడు పునరుత్తేజం చెందుతుంది. దీనివల్ల మెదడుపై ఉండే పని ఒత్తిడి తగ్గి నాడీ వ్యవస్థ స్ట్రాంగ్ అవుతుందని తేలింది.

ఇది సుదీర్ఘ కాలంలో మెదడు ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు, వృద్ధాప్యంలో వచ్చే అల్జీమర్స్ వంటి మతిమరుపు వ్యాధుల ప్రభావాన్ని కూడా బాగా తగ్గిస్తుంది. అంతేకాదు మెదడులోని నాడీ కణాల మధ్య అనుసంధానం మెరుగుపడటంతో, ఏదైనా విషయాన్ని త్వరగా గ్రహించే శక్తి కూడా బాగా పెరుగుతుందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.

Power Nap

ఇలా పగటి పూట కొంతమంది చిన్న పవర్ నేప్(Power Nap ) వేశాం అనడం ఇటీవల బాగా వింటున్నాం. ఎందుకంటే ఇలా పగటి పూట కాసేపు నిద్ర పోవడం (Power Nap ) శరీరానికి అందే విశ్రాంతి .దీని వల్ల మెదడుకు ఒక రిఫ్రెష్ బటన్ లాగా పనిచేస్తుంది. ఇది వృద్ధాప్యం వల్ల మెదడులో కలిగే మార్పుల ప్రభావం తగ్గించేలా చేస్తుంది. అయితే ఈ నిద్ర గంటల తరబడి కాకుండా కేవలం అరగంట మహా అయితే 40 నిమిషాల లోపు ఉంటేనే మెరుగైన ఫలితాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి.

కాబట్టి పగటిపూట కాసేపు విశ్రాంతి తీసుకోవడమనేది సోమరితనం కాదు, అది మీ మెదడును భవిష్యత్తులో వచ్చే అనారోగ్యాల నుంచి కాపాడుకునే ఒక సహజ సిద్ధమైన మెడిసిన్ గా మారుతుందన్న మాట. ఆరోగ్యకరమైన నాడీ వ్యవస్థ కోసం, చురుకైన మైండ్ కోసం మధ్యాహ్నం ఆ చిన్న కునుకును మీ డైలీ లైఫ్‌లో భాగం చేసుకోండి మరి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version