Memories: పాత జ్ఞాపకాలు పీడిస్తున్నాయా? గతం నుంచి బయటపడి ప్రశాంతంగా జీవించే మార్గాలు!

Memories: మన జీవితంలో కొన్ని విషయాలు పూర్తి కాలేదని మనసు భావిస్తుంది. తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకోలేకపోయామా లేదా ఒక అవకాశాన్ని వదిలేశామా..

Memories

మనలో చాలా మందికి ఒకే అనుభవం(Memories) ఉంటుంది. ఒంటరిగా ఉన్నప్పుడు లేదా నిద్రపోయే ముందు ఒక్కసారిగా గతం గుర్తొస్తుంది. గతం మారదు అని తెలిసినా, మనసు ఎందుకు మళ్లీ మళ్లీ అక్కడికే వెళ్తుంది? సైకాలజీ ప్రకారం, మన మెదడుకు భవిష్యత్తు కంటే గతం సేఫ్‌గా అనిపిస్తుంది.

ఎందుకంటే గతంలో ఏమి జరిగిందో మనకు తెలుసు. అది మంచైనా చెడైనా, తెలిసిన విషయం. కానీ భవిష్యత్తు అనేది తెలియని భయం. అందుకే మెదడు తెలియని దానికంటే తెలిసిన దానికే ఎక్కువగా వెళ్లాలని చూస్తుంది. ఇంకో ముఖ్యమైన కారణం అసంపూర్తి భావన.

మన జీవితంలో కొన్ని విషయాలు పూర్తి కాలేదని మనసు భావిస్తుంది. తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకోలేకపోయామా లేదా ఒక అవకాశాన్ని వదిలేశామా.. ఇవన్నీ మనసులో ఓపెన్ ఫైళ్లలా ఉంటాయి. మెదడు సహజంగా వాటిని క్లోజ్ చేయాలని ప్రయత్నిస్తుంది.

చాలామంది అనుకుంటారు గతం గురించి ఆలోచిస్తే తాము బలహీనులమని. కానీ నిజానికి అది వీక్‌నెస్ కాదు. అది మెదడు పని చేసే విధానం. మన మెదడు మనల్ని రక్షించడానికి ప్రయత్నిస్తుంది. ఆ తప్పు మళ్లీ జరగకూడదు అని గుర్తు చేస్తూ ఉంటుంది.

Memories

కానీ సమస్య ఏంటంటే, అదే ఆలోచన అవసరానికి మించి తిరుగుతే అది మనసుకు భారంగా మారుతుంది. గిల్ట్ కూడా గత ఆలోచనలకు పెద్ద కారణం. వాస్తవానికి అప్పటి పరిస్థితులు, అప్పటి మనసు వేరు. కానీ మనం ఇప్పటి బుద్ధితో అప్పటిని కొలుస్తాం. ప్రస్తుత జీవితం సంతృప్తిగా లేనప్పుడు కూడా మనసు పాత రోజుల్లోకి జారిపోతుంది.

గతాన్ని ఒక పాఠంగా చూసినప్పుడు అది ఉపయోగపడుతుంది, అదే గతాన్ని ఒక శిక్షలా చూసినప్పుడు అది మనసును నెమ్మదిగా తినేస్తుంది. గతాన్ని మార్చలేము, కానీ దాని అర్థాన్ని మార్చుకోవచ్చు. వర్తమానం అర్థవంతంగా ఉన్నప్పుడు గతానికి అంత పవర్ ఉండదు.

Saying Yes:అందరికీ సరే అంటున్నారా? అయితే మీ వ్యక్తిత్వం ప్రమాదంలో పడ్డట్టే!

Exit mobile version