Hot Water
చలికాలంలో గడ్డకట్టే చలి నుంచి ఉపశమనం పొందడానికి చాలామంది వేడి నీళ్ల( Hot Water)తో స్నానం చేయడానికి ఇష్టపడతారు. అయితే గోరు వెచ్చని నీళ్లో, లేదా కొంచెం వేడిగా ఉంటేనో ఓకే కానీ కొంతమంది మరీ ఎక్కువ వేడి ఉన్న నీళ్లతో స్నానం చేస్తారు. కానీ ఈ అలవాటు చర్మానికి, జుట్టుకు ఎంత ప్రమాదకరమో తెలిస్తే మీరు కచ్చితంగా మీ అలవాటును మార్చుకుంటారని డెర్మటాలజిస్టులు చెబుతున్నారు.
అతిగా వేడి చేసిన నీటితో రోజూ స్నానం చేయడం వల్ల చర్మంపై ఉండే సహజమైన నూనెలు (Natural Oils) పూర్తిగా తొలగిపోతాయి. దీనివల్ల చర్మం పొడిబారిపోయి, దురదలు రావడం, పగుళ్లు ఏర్పడటం వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. ముఖ్యంగా చలికాలంలో చర్మం ఇప్పటికే పొడిగా ఉంటుంది.. దానికి తోడు వేడి నీళ్లు దానికి తోడైతే చర్మం ముడతలు పడి అకాల వృద్ధాప్యం ఛాయలు కనిపించే అవకాశం కూడా ఉంటుంది.
చర్మంతో పాటు జుట్టు ఆరోగ్యంపై కూడా వేడి నీళ్ల ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. ఎక్కువ వేడి జుట్టు కుదుళ్లను (Hair Follicles) బలహీనపరచడంతో.. జుట్టు విపరీతంగా రాలిపోతుంది. అంతేకాకుండా తల చర్మం (Scalp)కూడా బాగా పొడిబారిపోయి చుండ్రు సమస్య పెరుగుతుంది.
వేడి నీళ్లు( Hot Water) జుట్టులోని తేమను లాగేయడం వల్ల జుట్టు నిర్జీవంగా మారడంతో పాటు గడ్డిలా తయారవుతుంది. అందుకే నిపుణులు ఎప్పుడూ గోరువెచ్చని నీటితో (Lukewarm Water) మాత్రమే స్నానం చేయాలని సూచిస్తారు. స్నానం చేసిన వెంటనే చర్మానికి మాయిశ్చరైజర్ రాసుకోవడం వల్ల తేమను కాపాడుకోవచ్చని చెబుతున్నారు. అలాగే తలస్నానానికి ఎప్పుడూ సాధారణ ఉష్ణోగ్రత ఉన్న నీటిని వాడటం వల్ల జుట్టు రాలడాన్ని అరికట్టొచ్చని సూచిస్తున్నారు.
Mana Shankar Varaprasad Garu:మన శంకర్ వరప్రసాద్ గారు.. ప్రీమియర్ షోల టైమింగ్స్, టికెక్ ధరల డిటైల్స్
