Cruise
సినిమాల్లోనూ, వీడియోలలోనూ చూసి విదేశాల్లో మాత్రమే క్రూయిజ్ (Cruise) షిప్ లు ఉంటాయని చాలామంది అనుకుంటారు. ఇప్పుడు మన దేశంలో కూడా ప్రపంచ స్థాయి సౌకర్యాలతో క్రూయిజ్ టూర్స్ అందుబాటులోకి వచ్చేశాయి. తక్కువ ఖర్చుతో విలాసవంతమైన ప్రయాణం చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు.
టాప్ క్రూయిజ్ రూట్స్ ఇవే..
1.ముంబై టు గోవా (Cordelia Cruises)- ఇది భారతీయులకు అత్యంత ఇష్టమైన రూట్. రెండు రోజులు సముద్రం మధ్యలో ఎంజాయ్ చేస్తూ గోవా చేరుకోవచ్చు. ఇందులో స్విమ్మింగ్ పూల్స్, థియేటర్లు, రకరకాల వంటకాలు అందుబాటులో ఉంటాయి.
2. కోల్ కతా టు వారణాసి (Ganga Vilas)- ఇది ప్రపంచంలోనే పొడవైన రివర్ క్రూయిజ్(Cruise) అని చెప్పొచ్చు. గంగా నదిపై సాగే ఈ ప్రయాణం ఆధ్యాత్మికంగానూ, పర్యాటక పరంగానూ అద్భుతం అనే చెప్పాలి.
3. కొచ్చి టు లక్షద్వీప్- ప్రకృతి ప్రేమికులకు నిజంగా ఇది ఒక స్వర్గమే. నీలి రంగు సముద్రం మధ్యలో ప్రయాణిస్తూ లక్షద్వీప్ అందాలను చూడటం మరచిపోలేని అనుభూతిగా మిగిలిపోతుందనడంలో సందేహమే లేదు.
చాలామంది క్రూయిజ్ అంటే లక్షల్లో ఖర్చవుతుందని అనుకుంటారు. కానీ ఇప్పుడు 2 రాత్రుల ప్రయాణానికి ఒక వ్యక్తికి రూ.15,000 నుంచి రూ. 25,000 మధ్యలో ప్యాకేజీలు లభిస్తున్నాయి. దీనిలోనే భోజనం, వసతి, ఎంటర్టైన్మెంట్ అన్నీ కలిపి ఉంటాయి.
అయితే మీరు ముందుగానే డేట్ ఫిక్స్ చేసుకుని బుక్ చేసుకుంటే భారీ డిస్కౌంట్లు ఉంటాయి. దీంతో ఆటోమేటిక్‌గా మరింత తక్కువ డబ్బులతోనే సముద్రపు ప్రయాణాన్ని హాయిగా ఎంజాయ్ చేయొచ్చు.
T20 Series: కివీస్‌పై మళ్లీ అభిషేకాస్త్రం..టీ ట్వంటీ సిరీస్ భారత్ కైవసం
