Meal
మన భారతీయ సంప్రదాయంలో ప్రతి పని వెనుక ఒక అర్థం, పరమార్థం ఉంటాయన్న విషయం బాగా లోతుగా విశ్లేషిస్తేనే అర్ధం అవుతుంది. పూర్వం మన తాతలు, ముత్తాతలు భోజనానికి కూర్చునే ముందు ఆకు చుట్టూ లేదా పళ్లెం చుట్టూ నీటిని చల్లడం చాలామంది చూసే ఉంటారు. దీనిని చిత్రాహుతి/పరిషేచనం అంటారు. అయితే కొంతమంది దీనిని ఒక మూఢనమ్మకం అని కొట్టిపారేస్తారు. కానీ దీని వెనుక అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు , ఆధ్యాత్మిక కోణాలు ఉన్నాయంటున్నాయి శాస్త్రాలు.
పూర్వ కాలంలో అంతా నేలమీద కూర్చుని, అరటి ఆకుల్లోనే భోజనం(Meal) చేసేవారు. ఇళ్లు మట్టితో ఉండటం వల్ల నేలపై నుంచి చిన్న చిన్న చీమలు, పురుగులు, దుమ్ము ఆకులోకి వచ్చే అవకాశం ఉండేది. అయితే తినే విస్తరాకు చుట్టూ నీటిని చల్లడం వల్ల ఒక ‘రక్షణ వలయం’ (Water Shield) ఏర్పడుతుంది. ఇది చిన్నచిన్న పాకే క్రిములను ఆకులోకి రాకుండా అడ్డుకుంటుంది. అలాగే, నీరు చల్లడం వల్ల ఆ ప్రాంతంలోని దుమ్ము రేణువులు గాలిలోకి లేవకుండా అణచివేయబడతాయి. దీనివల్ల మనం తినే ఆహారం శుభ్రంగా ఉంటుంది. ఇది ఒక రకమైన న్యాచురల్ శానిటైజేషన్ అని చెప్పొచ్చు.
ఇక ఆధ్యాత్మికంగా దీనిని చూస్తే అన్నం బ్రహ్మ స్వరూపం అని మనమంతా భావిస్తాం. భోజనం(Meal) చుట్టూ నీరు చల్లి మూడు సార్లు ‘ఓం ప్రాణాయ స్వాహా’ అంటూ మంత్రం చదవడం ద్వారా, ఆ ఆహారాన్ని అందించిన ప్రకృతికి, దైవానికి కృతజ్ఞతలు తెలిపినట్లు అవుతుంది. మన లోపల ఉన్న ప్రాణశక్తికి ఈ ఆహారాన్ని నైవేద్యంగా సమర్పిస్తున్నామని దీని అర్థం. ఇది మనిషిలో అహంకారాన్ని తగ్గించి, వినయాన్ని పెంచుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
అంతేకాకుండా, అరటి ఆకులో భోజనం చేయడం వల్ల అందులోని పాలీఫెనాల్స్ ఆహారంలో కలిసి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. నేలపై కూర్చుని భోజనం చేయడం వల్ల మన వెన్నెముక నిటారుగా ఉండటంతో.. ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.అందుకే మన సంప్రదాయాలను గౌరవించడం అంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడమే అన్న విషయాన్ని ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి.
T20 Series: కివీస్‌పై మళ్లీ అభిషేకాస్త్రం..టీ ట్వంటీ సిరీస్ భారత్ కైవసం
