Dhanushkodi:ధనుష్కోడి ..అంతమైన చోట మొదలయ్యే అద్భుతాన్ని చూడండి

Dhanushkodi: నిశ్శబ్దం, సముద్ర ఘోష , చరిత్ర కలగలిసిన ధనుష్కోడి పర్యాటకుల మనసుపై చెరగని ముద్ర వేస్తుంది.

Dhanushkodi

తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ఉన్న ధనుష్కోడి(Dhanushkodi) ఒక అద్భుతమైన , రహస్యమైన పర్యాటక ప్రాంతం. దీనిని ‘ఘోస్ట్ టౌన్’ అని కూడా పిలుస్తారు. భారతదేశం , శ్రీలంకల మధ్య సరిహద్దులో ఉన్న ఈ చిన్న భూభాగం ఒకప్పుడు కలకలలాడే ఒక రేవు పట్టణం. కానీ 1964లో వచ్చిన ఒక భయంకరమైన తుపాను వల్ల ఈ పట్టణం మొత్తం సముద్రంలో కలిసిపోయింది.

అప్పటి నుంచి ఇక్కడ ఎవరూ నివసించడం లేదు. కేవలం శిథిలాలు మాత్రమే మిగిలాయి. సముద్రం మధ్యలో ఒక సన్నని ఇసుక తిన్నె మీద ప్రయాణిస్తూ ధనుష్కోడి చేరుకోవడం పర్యాటకులకు ఒక థ్రిల్లింగ్ అనుభూతినిస్తుంది.

ఒకవైపు బంగాళాఖాతం శాంతంగా కనిపిస్తే, మరోవైపు హిందూ మహాసముద్రం చాలా ఉధృతంగా ఉంటుంది. ఈ రెండు సముద్రాలు కలిసే చోట (అరిచల్ మునై) నిలబడటం వర్ణనాతీతం. సముద్రపు నీలి రంగులు, అంతులేని ఆకాశం అక్కడకు వెళ్లినవారిని మరో లోకానికి తీసుకెళ్తాయి.

టూరిజం పరంగా చూస్తే ధనుష్కోడి(Dhanushkodi) ఆధ్యాత్మికంగా కూడా చాలా ప్రాముఖ్యత కలిగినదే. ఇక్కడి నుంచి శ్రీలంక కేవలం 18 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. రామాయణ గాథ ప్రకారం శ్రీరాముడు సముద్రంపై వారధిని ఇక్కడి నుంచే నిర్మించాడని స్థానికుల నమ్మకం. సముద్రం లోపల రామసేతు శిథిలాలు ఇప్పటికీ ఉన్నాయని చెబుతుంటారు.

Dhanushkodi

ఇక్కడ మిగిలి ఉన్న రైల్వే స్టేషన్ శిథిలాలు, చర్చి గోడలు అక్కడి చరిత్రను గుర్తు చేస్తాయి. సూర్యోదయ సమయంలో ఈ ప్రాంతం ఎంతో ప్రశాంతంగా, సుందరంగా ఉంటుంది. ఫోటోగ్రఫీ అంటే ఇష్టం ఉన్నవారికి ఇక్కడ అద్భుతమైన,అందమైన ఫ్రేమ్స్ దొరుకుతాయి. రామేశ్వరం సందర్శించే వారు కచ్చితంగా ధనుష్కోడికి వెళ్లి తీరాల్సిందే అంటారు ప్రకృతి ప్రేమికులు.

నిశ్శబ్దం, సముద్ర ఘోష , చరిత్ర కలగలిసిన ఈ ప్రాంతం పర్యాటకుల మనసుపై చెరగని ముద్ర వేస్తుంది. ఆధునిక ప్రపంచానికి దూరంగా, సముద్ర గర్భంలో దాగి ఉన్న ఈ అద్భుతాన్ని సందర్శించడం మీకు కచ్చితంగా ఒక చిరస్మరణీయ జ్ఞాపకంగా మిగిలిపోతుంది.

Tata Harrier EV :టాటా హారియర్ EV- అదిరిపోయే ఫీచర్లు.. ఈ కారును కొనడం తెలివైన నిర్ణయమేనా?

Exit mobile version