Workout:టైమ్ లేనివారికి 5 నిమిషాల ఇంటెన్స్ వర్కౌట్

Workout: రొటీన్ లైఫ్ స్టైల్ నుంచి బయటపడాలంటే గంటలు గంటలు వ్యాయామం చేయాల్సిన అవసరం లేదు.

Workout

జిమ్‌కు వెళ్లడానికి టైమ్ లేదు, ఈ రోజంతా తీరిక లేకుండా పని ఉంది, ఒక గంటో అరగంటో కూడా వ్యాయామం చేయలేకపోతున్నాను – ఇవి మనం తరచుగా వినే మాటలు. ఈ రొటీన్ లైఫ్ స్టైల్ నుంచి బయటపడాలంటే గంటలు గంటలు వ్యాయామం చేయాల్సిన అవసరం లేదు. ఈ సమస్యకు ఈజీ అండ్ బాగా పనిచేసేవి మైక్రో-వర్కౌట్స్ (Micro-Workouts) అంటున్నారు ఫిట్నెస్ నిపుణులు.

మైక్రో-వర్కౌట్స్ (Workout)అంటే ఏమిటి?.. మైక్రో-వర్కౌట్స్ అంటే రోజంతా విరామాలలో (బ్రేక్స్, టీ టైమ్, లేదా లంచ్ తర్వాత) కేవలం 5 నుంచి 10 నిమిషాల పాటు మాత్రమే చేసే చిన్నపాటి, కానీ ఇంటెన్స్ (Intense) అయిన వ్యాయామాలు. ఇవి చిన్నవి అయినా కూడా, శరీరంపై చూపించే ప్రభావం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది.

జనరల్‌గా మనం 60 నిమిషాలు ఒకేసారి వ్యాయామం చేస్తాం. మైక్రో-వర్కౌట్స్‌లో, మీరు రోజంతా 4-6 సార్లు ఈ 5-10 నిమిషాల వ్యాయామాలను చేస్తారు. ఉదాహరణకు ఉదయం 10 గంటలకు 5 నిమిషాలు స్క్వాట్స్, లంజెస్.

రోజు మొత్తంలో మీ వ్యాయామ సమయం 20 నుంచి 30 నిమిషాలు అవుతుంది, కానీ దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఒకేసారి చేసే వ్యాయామం కంటే ఎక్కువ ఉంటాయి.

Workout

ఎందుకు ఈ ట్రెండ్ ప్రజాదరణ పొందుతోందంటే..సమయం ఆదా అవడం దీనికి అతి పెద్ద ప్లస్ పాయింట్. ఒకేసారి గంట కేటాయించలేని బిజీ ప్రొఫెషనల్స్‌కు, తల్లిదండ్రులకు ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

ఎక్కువసేపు కూర్చుని ఉండటం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. మైక్రో-వర్కౌట్స్ ప్రతి గంటకోసారి మిమ్మల్ని కదిలేలా చేసి, కూర్చునే సమయాన్ని తగ్గిస్తాయి.

పని మధ్యలో 5 నిమిషాల పాటు చిన్న వ్యాయామం చేయడం వలన రక్త ప్రసరణ (Blood Circulation) పెరిగి, మెదడుకు శక్తి అందుతుంది. దీనితో మీకు మరింత ఉత్సాహం, ఏకాగ్రత లభిస్తాయి.

పెద్ద లక్ష్యాలు పెట్టుకోకుండా, చిన్న చిన్న వ్యాయామాలతో మొదలుపెట్టడం వలన వాటిని రోజూ చేయడం సులభమవుతుంది.

మైక్రో-వర్కౌట్స్‌ను ఎలా మీ జీవితంలో భాగం చేసుకోవాలి? ప్రతి రెండు గంటలకు ఒకసారి 5 నిమిషాలు బ్రేక్ తీసుకోవాలని మీ మొబైల్‌లో రిమైండర్ పెట్టుకోండి.

దీనికి ఎలాంటి జిమ్ పరికరాలు అవసరం లేదు. స్క్వాట్స్, పుష్-అప్స్, ప్లాంక్, జంపింగ్ జాక్స్, గోడ సపోర్ట్‌తో కూర్చోవడం (Wall Sit) వంటివి చేసుకోవచ్చు.

కేవలం 5 నిమిషాలే కదా అని అనుకొని బద్ధకాన్ని పక్కన పెట్టి, ఆ చిన్న సమయాన్ని పూర్తి ఇంటెన్సిటీతో చేయండి.

మైక్రో-వర్కౌట్స్ అనేది ఆధునిక జీవనశైలికి సరిపోయే ఒక స్మార్ట్ ఫిట్‌నెస్ సొల్యూషన్. చిన్న మార్పులతో పెద్ద ప్రయోజనాలు పొందడానికి ఇది ఉత్తమ మార్గం.

మరిన్ని హెల్త్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version