Drinking water: నీళ్లను ఎలా పడితే అలా తాగకూడదట..నీళ్లు తాగే విధానంలో అద్భుత సూత్రాలున్నాయట..

Drinking water: నీళ్లను మనం ఎంత తాగుతున్నామనే దానికంటే, ఎప్పుడు, ఎలా తాగుతున్నాం అనేదానిపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.

Drinking water

మనిషి జీవించడానికి అత్యంత అవసరమైనది నీరు (Drinking water)అయినా కూడా.. మనం ఎంత తాగుతున్నామనే దానికంటే, ఎప్పుడు, ఎలా తాగుతున్నాం అనేదానిపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని ఆయుర్వేదం స్పష్టంగా చెబుతుంది.

ఆయుర్వేదం ప్రకారం, నిలబడి లేదా నడుస్తూ వేగంగా నీటిని తాగకూడదు. ఈ పద్ధతిలో నీరు త్వరగా పొట్టలోకి వెళ్లడం వలన జీర్ణవ్యవస్థ ఆమ్లాలను (Acids) సరిగ్గా సమతుల్యం చేయలేదు, మరియు ఇది కీళ్లపై (Joints) ఒత్తిడిని పెంచుతుంది.

సరైన పద్ధతి ఏంటంటే నేలపై లేదా కుర్చీలో కూర్చుని, నెమ్మదిగా, చిన్న చిన్న గుటకల్లో (Sipping) నీటిని తాగడం ఉత్తమం. ఇలా తాగడం వలన నీరు లాలాజలంతో (Saliva) సరిగ్గా కలిసి పొట్టలోకి చేరుతుంది. లాలాజలం ఆల్కలైన్ (క్షార) స్వభావం కలిగి ఉంటుంది. ఇది పొట్టలోని జీర్ణ ఆమ్లాలను (Stomach Acids) సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. దీనివల్ల జీర్ణక్రియ (Digestion) మెరుగుపడుతుంది.

Drinking water

భోజనం చేసేటప్పుడు అధికంగా నీరు తాగడం వలన జీర్ణ రసాలు పలుచనై, జీర్ణ శక్తి తగ్గుతుంది. అందుకే భోజనానికి అరగంట ముందు లేదా భోజనం చేసిన గంట తర్వాత మాత్రమే నీరు తాగాలి(Drinking water). ఉదయం లేవగానే గోరువెచ్చని నీటిని నెమ్మదిగా తాగడం వల్ల పేగులు శుభ్రపడతాయి .అలాగే జీవక్రియ (Metabolism) చురుకవుతుంది.

ఆయుర్వేదం ప్రకారం, శరీరంలోని ‘అగ్ని’ (జీర్ణ శక్తి) ని ఆర్పే విధంగా నీరు తాగకూడదు. ఈ చిన్న మార్పు జీర్ణ సమస్యలు, ఎసిడిటీ , కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం అందిస్తుంది.

Eat sweets: తీపి తినాలనే కోరిక విపరీతంగా ఉందా ? అయితే ఇదే కారణం కావొచ్చు..

Exit mobile version