Social Media
2025లో మనందరినీ పట్టిపీడిస్తున్న అతిపెద్ద మానసిక సమస్య లైక్స్ డిప్రెషన్. మనం పెట్టిన ఫోటోకో లేదా వీడియోకో ఆశించిన స్థాయిలో లైక్స్ , కామెంట్స్ రాకపోతే మనం అందంగా లేమేమో లేదా మనల్ని ఎవరూ ఇష్టపడట్లేదేమో, మనం రాసిన కవితో లేక కథో బాగోలేదేమో అనే భావనతో చాలా మంది కుంగిపోతున్నారు. ఇది మెల్లిగా తీవ్రమైన ఒత్తిడికి , ఆత్మన్యూనతా భావానికి దారితీస్తోంది. అసలు ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి , మన మానసిక ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
మన మెదడులో డోపమైన్ అనే హార్మోన్ ఉంటుంది. మనకు ఎవరైనా లైక్ కొట్టినప్పుడు లేదా మంచి కామెంట్ పెట్టినప్పుడు మన మెదడుకు ఒక రకమైన కిక్ వస్తుంది. ఆ కిక్ కోసం మనం తెలియకుండానే అలవాటు పడిపోతాం. ఒక్కసారి ఆ లైక్స్ తగ్గగానే మన మెదడుకి అందాల్సిన ఆ డోపమైన్ కిక్ అందదు. దానివల్ల వెంటనే విచారం , నిరాశ మొదలవుతుంది. మన విలువను సోషల్ మీడియా (Social Media)నంబర్లు డిసైడ్ చేయలేవని మనం ముందుగా గుర్తించాలి.
డిజిటల్ డిటాక్స్ ఎలా చేయాలంటే ముందుగా స్క్రీన్ టైమ్ లిమిట్ సెట్ చేసుకోవాలి. రోజులో సోషల్ మీడియా (Social Media)కోసం ఎంత సమయం కేటాయించాలో ముందే ఫిక్స్ చేసుకోండి. అవసరం లేని నోటిఫికేషన్స్ ఆఫ్ చేయడం వల్ల అనవసరంగా మాటిమాటికీ ఫోన్ చూడటం తగ్గుతుంది. దీనివల్ల మీ సమయం ఆదా అవ్వడమే కాకుండా మెదడుపై ఒత్తిడి తగ్గుతుంది.
నో ఫోన్ జోన్స్ ..బెడ్రూమ్ లో ,డైనింగ్ టేబుల్ దగ్గర ఫోన్ వాడకూడదని ఒక రూల్ పెట్టుకోండి. ముఖ్యంగా పడుకోవడానికి గంట ముందు ఫోన్ పక్కన పెట్టేయడం వల్ల నిద్ర బాగా పడుతుంది మరియు మానసిక ప్రశాంతత లభిస్తుంది.
ఆన్ లైన్ లో తెలియని వ్యక్తుల లైక్స్ కోసం వెతకడం కంటే ఆఫ్ లైన్ లో ఉన్న స్నేహితులతో నేరుగా మాట్లాడటం,ఫ్యామిలీతో సమయం గడపడం వల్ల మనసుకి ఎక్కువ ప్రశాంతత లభిస్తుంది. నిజమైన నవ్వులు , పలకరింపులు ఇచ్చే ఆనందం సోషల్ మీడియా (Social Media)లైక్స్ ఇవ్వలేవు.
మీరు అందంగా ఉన్నారా లేదా అనేది మీ ఇన్‌స్టాగ్రామ్ ఫిల్టర్లు నిర్ణయించవు. మీ ఆత్మవిశ్వాసం , మీ వ్యక్తిత్వం మాత్రమే మీ అసలైన అందం. ఇతరుల లైఫ్ స్టైల్ చూసి మీ జీవితంతో పోల్చుకోకండి. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో (Social Media)వారి జీవితంలోని బెస్ట్ పార్ట్ ని అంటే కేవలం సంతోషకరమైన క్షణాలను మాత్రమే చూపిస్తారు. వారి వెనుక ఉన్న బాధలను ఎవరూ పోస్ట్ చేయరు అన్నది వాస్తవం. ఇతరుల రంగుల ప్రపంచాన్ని చూసి మీ వాస్తవ జీవితాన్ని తక్కువ అంచనా వేసుకోకండి.
సోషల్ మీడియా (Social Media)అనేది కేవలం ఒక వినోద సాధనం మాత్రమే అది మీ జీవితం కాదు. డిజిటల్ ప్రపంచం నుంచి అప్పుడప్పుడు విరామం తీసుకుని ప్రకృతితో మరియు మనుషులతో గడపండి. అప్పుడే మీరు నిజమైన సంతోషాన్ని పొందగలరు.
