Apple cider vinegar
కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. చాలామంది తగినంత నీరు తాగరు. ఇలా నీళ్లు సరిగా తాగకపోతే మూత్రం గాఢత పెరుగుతుంది. దీనివల్ల మూత్రంలోని కాల్షియం, ఆక్సలేట్ వంటి లవణాలు స్పటికాలుగా మారి రాళ్లుగా ఏర్పడతాయి.
రాళ్లు ఒకసారి ఏర్పడ్డాయంటే ఆ నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. కిడ్నీలో రాళ్లు ఉన్నా లేకపోయినా కూడా రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తాగడం వల్ల కిడ్నీల్లో వ్యర్థాలు పేరుకుపోకుండా నివారించొచ్చు.
కిడ్నీ రాళ్ల నివారణలో ఆహారపు అలవాట్లు కీలక పాత్రను పోషిస్తాయి. ఉప్పు , మాంసాహారం తగ్గించడం వల్ల కిడ్నీలపై భారం తగ్గుతుంది. అలాగే సిట్రస్ పండ్లు నిమ్మ, నారింజ వంటివి ఎక్కువగా తీసుకోవాలి, ఎందుకంటే వీటిలో ఉండే సిట్రేట్ రాళ్లు ఏర్పడకుండా ఆపుతుంది.
అయితే కిడ్నీ స్టోన్స్ విషయంలో ఆపిల్ సైడర్ వెనిగర్ (Apple cider vinegar) గురించి సోషల్ మీడియాలో చాలా ప్రచారం జరుగుతూ ఉంటుంది. దీనిలో ఉండే ఎసిటిక్ యాసిడ్ కిడ్నీలో రాళ్లను కరిగించగలదా అంటే.. దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆపిల్ సైడర్ వెనిగర్ (Apple cider vinegar) డైరక్టుగా రాళ్లను కరిగించదు కానీ, బాడీలోని పీహెచ్ (pH) స్థాయిలను బ్యాలెన్స్ చేయడంలో , మూత్రాన్ని క్షారయుతంగా మార్చడంలో సహాయపడుతుంది. అయితే, దీనిని డైరక్టుగా తాగకూడదు, ఒక గ్లాసు నీటిలో ఒకటి లేదా రెండు స్పూన్లు కలిపి మాత్రమే తీసుకోవాలి.
ఇంకో విషయం ఏంటంటే అందరికీ ఆపిల్ సైడర్ వెనిగర్ (Apple cider vinegar )సరిపడదు. కిడ్నీ వ్యాధులు ఉన్నవారు , గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండటమే మంచిది. మందుల కంటే ముందు సహజమైన జాగ్రత్తలు పాటించడం మంచిది. కొబ్బరి నీళ్లు, బార్లీ నీళ్లు , గంజి కిడ్నీల క్లీనింగ్ కు అద్భుతంగా పనిచేస్తాయి.
పాలకూర, టమోటాలు వంటి ఆక్సలేట్ ఎక్కువగా ఉండే కూరగాయలను పరిమితంగా తీసుకోవాలి. ఒకవేళ కిడ్నీలో నొప్పి లేదా మూత్రంలో రక్తం కనిపిస్తే ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. వేసవిలో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటమే కిడ్నీలను కాపాడుకోవడానికి ప్రాథమిక సూత్రం. కిడ్నీలు శరీరంలోని ఫిల్టర్లు, వాటిని శుభ్రంగా ఉంచుకుంటేనే ఆరోగ్యం బాగుంటుంది.
Harish Rao:హరీశ్ రావుకు సిట్ నోటీసులు..ఫోన్ ట్యాపింగ్ కేసు మెడకు చుట్టుకున్నట్లేనా?
