Main Door : ఇంటి మెయిన్ డోర్ వద్ద ఉంచకూడని 5 వస్తువులు

Main Door : ఇంటి మెయిన్ డోర్ వద్ద కొన్ని వస్తువులను ఉంచడం వల్ల దారిద్ర్యం సంభవిస్తుందని , లక్ష్మీ దేవి అనుగ్రహం లభించదని వాస్తు శాస్త్రం చెబుతోంది.

Main Door

ఇంటి ప్రధాన ద్వారమనేది కేవలం మనం ఇంట్లోకి వచ్చే మార్గం మాత్రమే కాదు.. అది ఇంట్లోకి వచ్చే సానుకూల శక్తికి , లక్ష్మీ దేవి రాకకు ద్వారం అంటారు పెద్దలు. వాస్తు ప్రకారం ప్రధాన ద్వారం ఎప్పుడూ శుభ్రంగా ,పవిత్రంగా ఉండాలట.. ఎందుకంటే అక్కడ కొన్ని వస్తువులను ఉంచడం వల్ల దారిద్ర్యం సంభవిస్తుందని , లక్ష్మీ దేవి అనుగ్రహం లభించదని వాస్తు శాస్త్రం చెబుతోంది.

అందులో మొదటిది చెత్త డబ్బా (Dustbin). చాలా మంది సౌకర్యం కోసం మెయిన్ డోర్ పక్కనే చెత్త డబ్బా పెడుతుంటారు. ఇది ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది అలాగే ఇంటి ఆర్థిక పరిస్థితిని కూడా దెబ్బతీస్తుందట. సింహద్వారం వద్ద చెత్త ఉండటం వల్ల లక్ష్మీ దేవి ఇంటి లోపలికి రావడానికి ఇష్టపడదు.

రెండోది చెప్పుల స్టాండ్. ప్రధాన ద్వారం ఎదురుగా చెప్పులు చిందరవందరగా ఉంచడం, లేదా చెప్పుల స్టాండ్ ను నేరుగా ద్వారం ముందు పెట్టడం వాస్తు దోషం. చెప్పులు బయటి నుంచి వచ్చే అశుభ్రతను మోసుకొస్తాయి కాబట్టి, వాటిని ద్వారానికి పక్కన కానీ, ఒక మూలన కానీ కనిపించకుండా ఉంచాలి.

మూడోది విరిగిన వస్తువులు లేదా పాత సామాన్లు. సింహద్వారం వద్ద పాత కర్రలు, విరిగిన కుర్చీలు లేదా ఇనుప సామాన్లు పేరుకుపోవడం వల్ల ఇంట్లో గొడవలు , మనశ్శాంతి కరువవుతాయి.

నాలుగోది నీరు నిల్వ ఉండటం. ప్రధాన ద్వారం ముందు గుంతలు కానీ నీరు నిల్వ కానీ ఉంటే అది రాహువు ప్రభావానికి దారితీస్తుంది, దీనివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి.

Main Door

ఐదోది ఎండిపోయిన మొక్కలు. సింహద్వారం వద్ద ఎండిపోయిన పూల కుండీలు ఉంచడం వల్ల దురదృష్టం వెంటాడుతుంది.

లక్ష్మీ దేవిని ఆహ్వానించాలంటే సింహద్వారం వద్ద పవిత్రమైన చిహ్నాలు ఉండాలి. పసుపుతో గడపను పూయడం, స్వస్తిక్ లేదా ఓం గుర్తులను ద్వారం పైన ఉంచడం చాలా శుభకరం అని పండితులు చెబుతారు. ముగ్గులు వేయడం , మామిడి ఆకుల తోరణాలు కట్టడం వల్ల సానుకూల శక్తి ఇంట్లోకి వస్తుంది.

ప్రధాన ద్వారం (Main Door) వద్ద ఎప్పుడూ వెలుతురు ఉండేలా చూడాలి, చీకటిగా ఉంటే దారిద్ర్యం ఆవహిస్తుంది. మెయిన్ డోర్ (Main Door) ఇతర తలుపుల కంటే పెద్దవిగా, ఆకర్షణీయంగా ఉండాలి. అలాగే తలుపు తెరిచినప్పుడు లేదా మూసినప్పుడు చప్పుడు రాకుండా చూసుకోవాలి. సింహద్వారాన్ని ఇలా పవిత్రంగా ఉంచుకుంటే ఆ ఇంట్లో లక్ష్మీ దేవి స్థిర నివాసం ఉంటుందని ,అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.

WPL : ప్లే ఆఫ్స్ కు దూసుకెళ్లిన ఆర్సీబీ..గుజరాత్ పై ఘనవిజయం

 

Exit mobile version