Oxygen levels: ఫుడ్స్ ద్వారా ఆక్సిజన్ లెవల్స్ పెంచుకోవచ్చని తెలుసా?

Oxygen levels: కొన్ని రకాల ఆహార పదార్థాలను మన రోజువారీ జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను సహజంగా పెంచుకోవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

ఈ రోజుల్లో వాయు కాలుష్యం, వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల మన శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు(Oxygen levels) తగ్గడం ఒక పెద్ద ఆందోళనగా మారింది. కానీ, దీనికి పరిష్కారం మన వంటగదిలోనే ఉందని మీకు తెలుసా? కొన్ని రకాల ఆహార పదార్థాలను మన రోజువారీ జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను సహజంగా పెంచుకోవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

Boycott: ట్రెండింగ్‌లో బాయ్ కాట్ అమెరికా ప్రొడెక్ట్స్..లిస్టులో ఏమేం ఉన్నాయో చూడండి..

మన శరీరంలో ఆక్సిజన్ (Oxygen levels)నిర్వహణకు చాలా ముఖ్యమైనది అరటి పండు. దీనిలో ఉండే పోషకాలు, మెగ్నీషియం, విటమిన్ B6 వంటివి శరీరంలో ఆల్కలైన్ బ్యాలెన్స్‌ను కాపాడి, ఆక్సిజన్ నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుతాయి. అలాగే, శరీరంలో రోగనిరోధక శక్తికి మూలమైన నిమ్మకాయ, విటమిన్ C తో నిండి ఉంటుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి, శరీరంలోని విషపదార్థాలను తొలగిస్తుంది, తద్వారా ఆక్సిజన్ అవసరాన్ని పెంచుతుంది.

ఇక ద్రాక్ష గురించి చెప్పాలంటే, వాటిలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించి, కణాల నాశనాన్ని అరికడతాయి. దీనివల్ల రక్తంలో ఆక్సిజన్ తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. శరీరానికి చల్లదనాన్ని, తేమను అందించే కీరాలో 95% పైగా నీరు ఉంటుంది. ఈ అధిక ద్రవశాతం రక్తంలో ఆక్సిజన్ సరఫరాను అద్భుతంగా మెరుగుపరుస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది ఒక మంచిది.

Oxygen levels

Lord Shiva: పరమశివుడు పులి చ‌ర్మాన్నే ఎందుకు ధరిస్తాడు?

శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే బ్రకోలిలో విటమిన్ C, K, A తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శ్వాసకోశ వ్యవస్థను మెరుగుపరిచి, శరీరంలోని ఆక్సిజన్ నిల్వలను పెంచడంలో సహాయపడతాయి. ఇవే కాకుండా, బీట్‌రూట్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఆపిల్ గుండె ఆరోగ్యానికి తోడ్పడి, రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. గ్రీన్ టీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో మంటను తగ్గించి, ఆక్సిజన్ శక్తిని పెంచుతాయి. అలాగే ఓట్స్ కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

కేవలం ఆహారం మాత్రమే కాదు, యోగా,ప్రాణాయామం వంటి వ్యాయామాలు కూడా ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచి, శరీరానికి అవసరమైన ఆక్సిజన్ అందిస్తాయి. అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఆక్సిజన్ స్థాయిలు త్వరగా తగ్గుతున్నప్పుడు, ఆహారం ఒక సహాయం మాత్రమే. అలాంటి పరిస్థితుల్లో వెంటనే వైద్యుడిని సంప్రదించి, తక్షణ చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. పరిశుభ్రమైన గాలి ఉన్న ప్రదేశాలలో ఎక్కువ సమయం గడపడం కూడా మంచిది. ఆరోగ్యకరమైన జీవనశైలిని, సరైన ఆహారాన్ని పాటించడం ద్వారా మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చు.

 

Exit mobile version