Eggs:ఫ్రిజ్‌లో గుడ్లు నిల్వ చేసే అలవాటుందా? అయితే ఇది మీకోసమే

Eggs: చాలా మంది మార్కెట్‌ నుంచి కొనుగోలు చేసిన గుడ్లను ఫ్రిజ్‌లో నిల్వ చేస్తారు.ఆహార పదార్థాలు , వినియోగ వస్తువులతోపాటు గుడ్లను ఫ్రిజ్‌లో ఉంచి తినడం ఎప్పుడూ మంచిది కాదు.

Eggs

గుడ్లు (Eggs)మనం రోజూ ఉపయోగించే ముఖ్యమైన ఆహార పదార్థాలలో ఒకటి, వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. గుడ్లు మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను అందిస్తాయి. అయితే, చాలా మంది మార్కెట్‌ నుంచి కొనుగోలు చేసిన గుడ్లను ఫ్రిజ్‌లో నిల్వ చేస్తారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆహార పదార్థాలు , వినియోగ వస్తువులతోపాటు గుడ్లను ఫ్రిజ్‌లో ఉంచి తినడం ఎప్పుడూ మంచిది కాదు.

గుడ్ల(eggs)ను వాటి షెల్ఫ్ లైఫ్ కంటే ఎక్కువసేపు (3 నుంచి 5 వారాల కంటే ఎక్కువ) ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల మంచి కంటే ఎక్కువ హాని జరుగుతుందని అనేక అధ్యయనాల ద్వారా నిరూపించబడింది. గుడ్లను ఎక్కువసేపు ఫ్రిజ్‌లో నిల్వ చేయడం వల్ల అవి తమ పోషకాలను కోల్పోయే ప్రమాదం ఉంది, దీనితో పాటు అనేక ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల, వీలైనంత వరకు వాటిని ఫ్రిజ్‌లో ఉంచకపోవడమే మంచిది, అవసరమైతే తక్కువ సమయం ఉంచాలి.

Eggs

గుడ్ల(Eggs)ను ఫ్రిజ్‌లో ఉంచకపోవడానికి గల ముఖ్య కారణం, వాటిలో సాధారణంగా సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా మన శరీరంలోకి ప్రవేశిస్తే విరేచనాలు, వాంతులు వంటి సమస్యలకు, కొన్ని సందర్భాల్లో ప్రాణాంతక వ్యాధులకు కూడా కారణమవుతుంది. గుడ్లను రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయడం వల్ల ఈ బ్యాక్టీరియా ఇతర ఆహార పదార్థాలకు కూడా వ్యాపించే ప్రమాదం ఉంది.

అందువల్ల, గుడ్లను 3 నుంచి 5 వారాల కంటే ఎక్కువ కాలం ఫ్రిజ్‌లో ఉంచకూడదు. ఒకవేళ నిల్వ చేయవలసి వస్తే, వాటిని ఫ్రిజ్ దిగువన ఉన్న ప్రత్యేక పెట్టెలో ఉంచడం శ్రేయస్కరం. అంతేకాకుండా, గుడ్లను ఫ్రిజ్‌లో నిల్వ చేసే ముందు వాటిని నీటితో శుభ్రంగా కడగాలి అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. గుడ్లను వాటి నాణ్యత, పోషక విలువలు తగ్గకుండా త్వరగా వాడుకోవడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version