Mobile
ఈ రోజుల్లో చాలామంది నిద్ర పట్టడం లేదు అని అంటున్నారు. కానీ నిజం ఏంటంటే నిద్ర రావడం మానిపించేది మన చేతిలో ఉన్న చిన్న స్క్రీన్ (Screen). బెడ్ మీద పడుకున్నాక ఒకసారి ఫోన్(Mobile) ఓపెన్ చేస్తే… టైమ్ ఎలా పోతుందో కూడా తెలియదు. రీల్స్, వీడియోలు, మెసేజ్‌లు చూసుకుంటూ చూస్తే అర్ధరాత్రి దాటిపోతుంది. అప్పుడు ఫోన్ పెట్టినా నిద్ర రావడానికి చాలా టైమ్ పడుతుంది.
దీనికి కారణం కేవలం అలవాటు కాదు. మన బాడీ లోపల జరిగే హార్మోన్ల (Hormonal) మార్పులు. మన శరీరంలో మెలటోనిన్ (Melatonin) అనే హార్మోన్ ఉంటుంది. ఇదే నిద్ర రావడానికి కారణం. రాత్రి చీకటి పడితే ఈ హార్మోన్ ఆటోమేటిక్‌గా రిలీజ్ అవుతుంది. కానీ మొబైల్ స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ (Blue Light) ఈ మెలటోనిన్ విడుదలను అడ్డుకుంటుంది. అంటే మన బ్రెయిన్‌కి ఇంకా పగలే అన్న సిగ్నల్ వెళ్తుంది. దాంతో శరీరం రెస్ట్ మోడ్‌లోకి (Rest Mode) వెళ్లదు. ఇదే కారణంగా ఫోన్ చూసిన తర్వాత బెడ్ మీద ఉన్నా నిద్ర పట్టదు.
ఇంకో పెద్ద సమస్య ఏమిటంటే… మొబైల్ (Mobile)కంటెంట్ మన మెదడును ఎప్పుడూ అలర్ట్‌గా (Alert) ఉంచుతుంది. వీడియోలు, నోటిఫికేషన్స్, సడన్ సౌండ్స్—ఇవన్నీ బ్రెయిన్‌ని రిలాక్స్ (Relax) అవ్వనివ్వవు. శరీరం పడుకుని ఉన్నా, మెదడు మాత్రం ఇంకా పని చేస్తూనే ఉంటుంది. దీని ప్రభావం వెంటనే కనిపిస్తుంది. ఉదయం లేవగానే అలసట (Tiredness), తలనొప్పి (Headache), కళ్లు మంట, ఫోకస్ (Focus) తగ్గిపోవడం, చిన్న విషయానికే కోపం (Anger) రావడం. ఇవి అన్నీ నిద్ర లోపం (Sleep Deprivation) లక్షణాలు.
కొన్ని రోజులు ఇలా జరిగితే పెద్దగా అనిపించదు. కానీ ఇది అలవాటుగా మారితే బాడీ లోపల నెమ్మదిగా డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. హార్మోన్ల బ్యాలెన్స్ దెబ్బతింటుంది. జీర్ణక్రియ (Digestion) సరిగా పనిచేయదు. బరువు పెరుగుతుంది (Weight Gain). మానసిక ఒత్తిడి (Mental Stress) పెరుగుతుంది.
పిల్లలలో అయితే మెమరీ (Memory), గ్రోత్ (Growth) మీద కూడా ప్రభావం పడుతుంది. రాత్రి ఫోన్ చూసే అలవాటు మన నిద్ర సైకిల్‌ను (Sleep Cycle) పూర్తిగా మార్చేస్తుంది. ఆలస్యంగా పడుకోవడం, ఆలస్యంగా లేవడం వల్ల శరీరం గడియారం (Body Clock) గందరగోళంలో పడుతుంది.
సైకాలజీ చెప్పేది ఒక్కటే— బెడ్ అంటే నిద్ర కోసం మాత్రమే ఉండాలి. ఫోన్ కోసం కాదు. నిద్రకు ముందు కనీసం 30 నుంచి 45 నిమిషాలు ఫోన్(Mobile) దూరంగా పెట్టగలిగితే, మెదడుకు రిలాక్స్ అవ్వడానికి ఛాన్స్ ఇస్తాం. లైట్స్ తగ్గించి, నిశ్శబ్దంగా ఉండటం మొదలుపెడితే మెలటోనిన్ సహజంగా పనిచేస్తుంది.
మంచి నిద్ర ఉంటే మన మైండ్ క్లియర్‌గా ఉంటుంది. మన బాడీ స్ట్రాంగ్‌గా ఉంటుంది. మన నిర్ణయాలు కరెక్ట్‌గా ఉంటాయి. అందుకే రాత్రి ఫోన్ కాదు, మన శరీరానికే ప్రాధాన్యం ఇవ్వాలి.
