Just LifestyleLatest News

Anger:కోపం వైపు మనసు ఎందుకు పరుగెడుతుంది? కోపాన్ని కంట్రోల్ చేసే అంతరంగ రహస్యం

Anger: మనసులో నెగటివ్ ఎనర్జీకి డోర్ ఎప్పుడూ ఓపెన్‌గా ఉంటుంది. కానీ పాజిటివ్ ఎనర్జీకి మాత్రం మనం బలవంతాన తలుపు తెరవాలి.

Anger

మనిషి మనసు శాంతంగా (Silent) ఉండాలి అనిపించినప్పుడు కూడా ఎందుకో కోపం (Anger) వైపు ఈజీగా తిరుగుతుంది. ఏ చిన్న మాట, ఏ చిన్న తప్పు కూడా మనసులో పెద్దదైపోతుంది.

ఈ అంతరంగం (Inner Self) రహస్యం గురించి పురాణాల్లో (Puranas) ఒక విషయం స్పష్టంగా చెప్పారు..మనసులో నెగటివ్ ఎనర్జీకి (Negative Energy) డోర్ ఎప్పుడూ ఓపెన్‌గా ఉంటుంది. కానీ పాజిటివ్ ఎనర్జీకి (Positive Energy) మాత్రం మనం బలవంతాన తలుపు తెరవాలి.

కోపం (Anger) అసలైన మూలం “అహం” (Ego). మనం చెప్పింది జరగకపోతే, మన ఆశలు నెరవేరకపోతే, మన మాటను ఎవరో పట్టించుకోకపోతే మనలోని చిన్న అహం వెంటనే రియాక్ట్ అవుతుంది. ఇది సహజమే. కానీ దీన్ని నియంత్రించే శక్తి (Controlling Power) కూడా మనలోనే ఉందని పురాణాలు చెప్తాయి.

Anger
Anger

ముఖ్యంగా, కోపం వచ్చిన మొదటి మూడు సెకండ్లలో మనం తీసుకునే నిర్ణయమే (Decision) మన జీవితాన్ని మార్చేస్తుంది. పాత గ్రంథాల్లో చెప్పినట్లు..మనసు కోపం మీద వెళ్లడం అంటే నీటిలోకి రాయి పడినట్టు. ఒకసారి అలజడి (Agitation) వస్తే, అది ఆగడానికి టైమ్ పడుతుంది.

అంతరంగాన్ని కంట్రోల్ చేయడానికి శ్వాస పద్ధతి (Breathing Techniques), రెండు నిమిషాల నిశ్శబ్దం, అలాగే ఆగు – ఆలోచించు – మాట్లాడు.. అనే మూడు దశలు వాడడం చాలా ఉపయోగపడుతుంది.

కోపంతో తీసుకున్న నిర్ణయాలు జీవితంలో ఎక్కువగా బాధను ఇస్తాయని, శాంతంతో తీసుకున్న నిర్ణయాలు సమస్యలను సులభంగా మారుస్తాయని పురాణాలు స్పష్టంగా చెబుతాయి అలాగే పెద్దవాళ్లు కూడా ఇదే విషయాన్ని పదేపదే చెబుతారు. అందుకే మనసులోని అలజడి ఆగాలంటే కోపాన్ని అరికట్టడం కాదు, దాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం అని తెలుసుకోవాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button