Raga Therapy: రాగా థెరపీ గురించి విన్నారా? దేనికోసం వాడతారో తెలుసా?

Raga Therapy: భారతీయ సంగీతంలోని ప్రతి రాగం ఒక నిర్దిష్ట భావోద్వేగం, గ్రహం , శక్తి కేంద్రం (చక్రం) తో ముడిపడి ఉంటుంది.

Raga Therapy

భారతీయ శాస్త్రీయ సంగీతానికి (Indian Classical Music) ఉన్న అపారమైన శక్తి కేవలం కళాత్మక ఆనందానికే పరిమితం కాదు. వేల సంవత్సరాల క్రితం నుంచి మన పూర్వీకులు దీనిని రాగ చికిత్స (Raga Therapy) రూపంలో మానసిక , శారీరక వ్యాధులకు చికిత్సగా ఉపయోగించారు.

భారతీయ సంగీతంలోని ప్రతి రాగం ఒక నిర్దిష్ట భావోద్వేగం, గ్రహం , శక్తి కేంద్రం (చక్రం) తో ముడిపడి ఉంటుంది. ప్రతి రాగం సృష్టించే నిర్దిష్టమైన శబ్ద తరంగాలు (Sound Vibrations) మానవ శరీరంపై ఒక ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపిస్తాయి.

ఉదాహరణకు, ప్రశాంతతను , లోతైన నిద్రను ఇచ్చే రాగం యమన్ (Yaman Raga) రాత్రిపూట వినడానికి అనువైనది, ఇది నిద్రలేమి (Insomnia)ని తగ్గిస్తుంది. ఉదయం ఆలస్యంగా పాడే రాగం తోడి జీర్ణవ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. పరిశోధనల ప్రకారం, రాగాల స్థిరమైన, లయబద్ధమైన కంపనాలు వింటున్నవారి గుండె కొట్టుకునే వేగాన్ని (Heart Rate), రక్తపోటును , మెదడు తరంగాలను (Brain Waves) నియంత్రిస్తాయి.

Raga Therapy

ముఖ్యంగా ఆల్ఫా , థీటా తరంగాల ఉత్పత్తిని పెంచి, ఇది ధ్యాన స్థితికి (Meditative State) చేరుకోవడానికి సహాయపడుతుంది. ఒత్తిడి సంబంధిత వ్యాధులు, అధిక రక్తపోటు, మైగ్రేన్ , దీర్ఘకాలిక ఆందోళన వంటి సమస్యలకు రాగ చికిత్సను సాంప్రదాయ వైద్యానికి అనుబంధంగా ఉపయోగిస్తున్నారు. ఇది మందులు లేకుండా మనస్సు , శరీరాన్ని సమతుల్యం చేసే ఒక శక్తివంతమైన వారసత్వ విజ్ఞానంగా భావిస్తారు.

మరిన్ని హెల్త్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version